iDreamPost

టీమిండియా వికెట్‌ కీపర్‌ ఎవరు? ఆ ఇద్దరి మధ్యే ప్రధాన పోటీ!

  • Published Apr 23, 2024 | 8:07 PMUpdated Apr 23, 2024 | 8:08 PM

T20 World Cup 2024, IPL 2024, Rishabh Pant: రానున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియాలో వికెట్‌ కీపర్‌గా ఎవరు ఉంటారనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే.. ఓ ఐదురుగు ఆటగాళ్లు పోటీ పడుతున్నా.. ఇద్దరు ఆటగాళ్ల మధ్యే పోటీ ఎక్కువగా ఉంది. మరి ఆ ఇద్దరు ఎవరో ఇప్పుడు చూద్దాం..

T20 World Cup 2024, IPL 2024, Rishabh Pant: రానున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియాలో వికెట్‌ కీపర్‌గా ఎవరు ఉంటారనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే.. ఓ ఐదురుగు ఆటగాళ్లు పోటీ పడుతున్నా.. ఇద్దరు ఆటగాళ్ల మధ్యే పోటీ ఎక్కువగా ఉంది. మరి ఆ ఇద్దరు ఎవరో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 23, 2024 | 8:07 PMUpdated Apr 23, 2024 | 8:08 PM
టీమిండియా వికెట్‌ కీపర్‌ ఎవరు? ఆ ఇద్దరి మధ్యే ప్రధాన పోటీ!

క్రికెట్‌ అభిమానులంతా ఐపీఎల్‌ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. దాదాపు అన్ని జట్లు కూడా విజయం కోసం హోరాహోరీగా పోరాడాతున్నాయి. దీంతో.. ప్రతి మ్యాచ్‌ దాదాపుగా చివరి ఓవర్‌ వరకు వెళ్తూ.. క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ధనాధన్‌ క్రికెట్‌ మజాను పంచుతోంది. ఇలా ఒకవైపు ఐపీఎల్‌ జోరుగా సాగుతున్నా.. మరోవైపు టీ20 వరల్డ్‌ కప్‌పై కూడా క్రికెట్‌ అభిమానుల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆటగాళ్ల ప్రదర్శన చూసిన తర్వాత.. ఎవరెవరు టీమ్‌లో ఉండాలి, ఎవరు టీమ్‌లో ఉండకూడదనే విషయాలపై క్రికెట్‌ అభిమానులు, క్రికెట్‌ పండితులు చర్చించుకుంటున్నారు. అయితే.. అత్యంత కీలకమైన వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ ప్లేస్‌లో ఎవర్ని తీసుకోవాలి అనే విషయంలో మాత్రం గట్టి చర్చ నడుస్తోంది. ప్రస్తుతానికి ఈ ప్లేస్‌కు ఎవర్ని కూడా ఫైనల్‌ చేయలేదు.

అయితే.. ఐపీఎల్‌ 2024లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న ఓ ఐదుగురు ఆటగాళ్ల పేర్లు మాత్రం గట్టిగా వినిపిస్తోంది. ఆ ఐదుగురు ఎవరంటే.. రిషభ్‌ పంత్‌, సంజు శాంసన్‌, కేఎల్‌ రాహుల్‌, దినేష్‌ కార్తీక్‌, ఇషాన్‌ కిషన్‌.. ఈ ఐదుగురిలో ఒకరు లేదా ఇద్దరు టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం ఎంపిక కావొచ్చే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ ఐదుగురిలో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఎవరి ప్రదర్శన ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన పంత్‌ 36.29 యావరేజ్‌, 150.30 స్ట్రైక్‌రేట్‌తో 254 పరుగుల చేశాడు. ఇందులో రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అలాగే 8 క్యాచ్‌లు, 3 స్టంపింగ్‌లు చేశాడు. ఇక సంజు శాంసన్‌ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడి 62.80 యావరేజ్‌, 152.43 స్ట్రైక్‌రేట్‌తో 314 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అలాగే కీపర్‌గా 6 క్యాచ్‌లు అందుకుని, ఒక స్టంప్‌ అవుట్‌ చేశాడు.

ఇక కేఎల్‌ రాహుల్‌ గురించి మాట్లాడుకుంటే.. టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటే లక్ష్యంగా వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ పొజిషన్‌ కోసం కష్టపడుతున్నాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌లో క్వింటన్‌ డికాక్‌ ఉన్నా కూడా తనే కీపింగ్‌ చేస్తున్నాడు. అయితే.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన కేఎల్‌ 40.86 యావరేజ్‌, 143 స్ట్రైక్‌రేట్‌తో 286 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అలాగే కీపర్‌గా 7 క్యాచ్‌లు, 2 స్టంపౌట్‌లు చేశాడు. దినేష్‌ కార్తీక్‌.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన డీకే 62.75 యావరేజ్‌, 196.09 స్ట్రైక్‌రేట్‌తో 251 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇక కీపర్‌గా ఒక క్యాచ్‌ అందుకున్నాడు. చివరిగా ఇషాన్‌ కిషన్‌ నంబర్స్‌ చూస్తే.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్‌.. 24 యావరేజ్‌, 168.42 స్ట్రైక్‌రేట్‌తో 192 పరుగులు చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్‌ సెంచరీ ఉంది. కీపర్‌గా 6 క్యాచ్‌లు తీసుకున్నాడు.

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఈ ఐదుగురి గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. ఐదుగురిలో ఇషాన్‌ కిషన్‌ బ్యాటర్‌గా విఫలం అవుతున్నాడు. పైగా బీసీసీఐ క్రమ శిక్షణా నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా అలాగే ప్రస్తుత పూర్‌ ఫామ్‌ దృష్ట్యా అతనికి టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కే సూచనలు కనిపించడం లేదు. అలాగే ఓపెనర్‌గా రోహిత్‌ శర్మకు జైస్వాల్‌ జోడీగా ఉన్నాడు. ఆ యాంగిల్‌లో కూడా ఇషాన్‌కు ఛాన్స్‌ కనిపించడం లేదు. ఇక దినేష్‌ కార్తీక్‌ అద్భుతంగా రాణిస్తున్న అతన్ని పరిగణంలోకి తీసుకుంటారో లేదో తెలియదు. టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో ఇలాగే ఫినిషర్‌గా అదుగొడుతున్నాడని తీసుకుంటే దారుణంగా విఫలం అయ్యాడు. దీంతో పంత్‌, శాంసన్‌, కేఎల్‌ మధ్యే పోటీ ఉండనుంది. వీరిలో కూడా పంత్‌, సంజు మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో ఇద్దరు బాగానే ఆడుతున్నారు. కీపింగ్‌ కూడా ఇద్దరు అద్భుతంగా చేస్తారు. దీంతో. పంత్‌, శాంసన్‌ను ఇద్దరి సెలెక్ట్‌ చేసి.. ఒకర్ని బ్యాకప్‌గా ఉంచే ఛాన్స్‌ ఉంది.

సంజు శాంసన్‌ టీమ్‌లో ఉంటే.. వన్‌ డౌన్‌ బ్యాటర్‌కు బ్యాకప్‌గా కూడా పనికొస్తాడు. పైగా.. యశస్వి జైప్వాల్‌ తాజాగా సెంచరీతో ఫామ్‌లోకి రావడంతో సంజు కాస్త హెల్ప్‌ అయిందనే చెప్పాలి. జైస్వాల్‌ ఫామ్‌లోకి రాకుంటే రోహిత్‌తో జోడీకి మరో లెఫ్ట్‌ హ్యాండర్‌ను టీమ్‌లోకి తీసుకోవాలని సెలెక్టర్లు భావించి ఉంటే.. ఇషాన్‌ కిషన్‌ వైపు మొగ్గుచూపేవారు. అప్పుడు పంత్‌ కీపర్‌గా, ఇషాన్‌ ఓపెనర్‌ కమ్‌ బ్యాకప్‌ కీపర్‌గా ఎంపికయ్యేవారు. కానీ, ఇప్పుడు జైస్వాల్‌ ఫామ్‌లోకి రావడంతో ఓపెనర్‌గా అతని స్థానం పదిలమైంది. దీంతో ఇషాన్‌ కీపర్‌గా కూడా చోటు కష్టమే. దీంతో పంత్‌తో పాటే శాంసన్‌ టీమ్‌లో ఉండే అవకాశం ఉంది.  మరి పంత్‌, శాంసన్‌, కేఎల్‌ రాహుల్‌ ఈ ముగ్గురిలో ఎవర్ని టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం ప్రధాన వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌గా ఎంపిక చేస్తే బాగుంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి