iDreamPost

ఇంటర్ విద్యార్థి సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్.. లేఖలో ఏముదంటే!

  • Published Mar 09, 2024 | 11:35 AMUpdated Mar 09, 2024 | 11:35 AM

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని సాహితీ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని సాహితీ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.

  • Published Mar 09, 2024 | 11:35 AMUpdated Mar 09, 2024 | 11:35 AM
ఇంటర్ విద్యార్థి సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్.. లేఖలో ఏముదంటే!

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే విద్యార్థులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.  గత 3 నెలలో వ్యవధి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 25 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని అర్ధంతరంగా తనువు చలిస్తున్నారు. అయితే ఇలా ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం.. పరీక్షల్లో మంచి మార్కులు రాకపోవడమో, విద్యార్థులకు కాలేజీల్లో ఒత్తిడి కారణంగానే తెలియదు కానీ ఇలాంటి దారణాలకు పాల్పడుతూ.. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిలుస్తున్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాహితీ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో మరో బిగ్ ట్టిస్ట్ చోటు చేసుకుంది.ఆత్మహత్య చేసుకున్న ముందు సాహిత్య తన స్నేహితురాలుకు రాసిన లేఖ అలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇటీవలే హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామానికి చెందిన వలుగుల సాహితీ అనే విద్యార్థిని.. బీమారంలోని శివాని ఇంటర్మీడియట్ కాలేజీలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే ఉన్నటుండి ఏం జరిగిందో తెలియదుగానీ గురవారం రాత్రి  సాహితీ కాలేజీ బిల్డింగ్‌పై నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుందని ఆ కాలేజీ నిర్వహకులు తెలియజేశారు. అయితే, ఈ ఘటన గురువారం రాత్రి జరిగితే.. విద్యార్ధిని తల్లిదండ్రులకు మాత్రం శుక్రవారం ఉదయం వరకు సమాచారం అందించకుండా కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచారు. అలాగే పోస్ట్ మార్టం తరలించాక మాత్రమే సాహితీ తల్లిదండ్రులకు సమాచారం అందించారని వారు ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా, సాహితీ మృతిపై కాలేజీ యాజమాన్యం గోప్యత పాటించడం, అలాగే, ఆమె చేతికి కట్ చేసుకుని ఉండటంతో పాటు తలకు దెబ్బలు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. అయితే, విద్యార్థి మృతి పై ఫిర్యాదు అందిన పోలీసులు మాత్రం దీనిని అనుమానాస్పద మరణం కింద కేసు నమోదు చేసుకున్నారు. ఇక సాహితీ చనిపోయే ముందు సూసైట్ నోట్ రాసిన విషయం తెలిసిందే. కాగా, ఆ లెటర్ తన స్నేహితురాలుకు రాసిందని అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఈ లేటర్ ను ఇప్పుడు కేయూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇక సాహితీ తన స్నేహితురాలకు సంబోధిస్తూ ఏం రాసిందంటే.. నీకు చెప్పకుండా వెళ్తున్నందుకు ఐయామ్ సారీ!.. నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎవరూ నిన్ను విడిచి పెట్టలేరే.. యూ ఆర్ బై బెస్ట్ ఫ్రెండ్. త్రీ మంత్స్ నుంచి నాకు అసలు మంచిగ అనిపించడం లేదు. నా మైండ్ అంతా చనిపొమ్మంటోంది. దాని వల్ల అసలు చదువుకోబుద్ది కావడం లేదు. అయినా చదివి ఎగ్జామ్స్ రాసినా.. బోర్డు ఎగ్జామ్స్ ఫస్ట్ సాన్ స్క్రిట్ పేపర్లో ఒక్క బిట్ రాయలేదు. ఇంగ్లిష్ ఓకే కానీ బోటనీ అసలు మంచిగా రాయలేదు. ఆన్స్ర్స్ అన్నీ వచ్చినా కూడా ఏమీ మంచిగా రాయలేదు. ఇవన్నీ నీకు చెప్పలేదు. అని రాసి ఉంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ బాధపడుతూ.. ఏది ఏమైనా ఎగ్జామ్స్ బాగా రాయకపోతే ఇలా చనిపోయి తల్లిదండ్రులకు శోకసంధ్రంలో ముంచేయడం సరి కాదని, అలాగే విద్యార్థుల పై ప్రవైట్ సంస్థలో అధిక ఒత్తిడికి గురి చేస్తున్నారని.. ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.మరి, ఇంటర్ విద్యార్థి సాహితీ రాసిన లెటర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి