iDreamPost

క్రికెట్ చరిత్రలో సంచలనం.. లెజెండరీ ప్లేయర్స్​కే సాధ్యం కాని రికార్డు ఇది!

  • Published Apr 25, 2024 | 5:58 PMUpdated Apr 25, 2024 | 5:58 PM

వరల్డ్ క్రికెట్​ హిస్టరీలో ఓ సంచలన రికార్డు నమోదైంది. మహామహులకే సాధ్యం కాని అరుదైన ఘనత ఇది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వరల్డ్ క్రికెట్​ హిస్టరీలో ఓ సంచలన రికార్డు నమోదైంది. మహామహులకే సాధ్యం కాని అరుదైన ఘనత ఇది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Apr 25, 2024 | 5:58 PMUpdated Apr 25, 2024 | 5:58 PM
క్రికెట్ చరిత్రలో సంచలనం.. లెజెండరీ ప్లేయర్స్​కే సాధ్యం కాని రికార్డు ఇది!

ఏ ఆటలోనైనా రికార్డులు సృష్టించడం, ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు వాటిని బద్దలుకొట్టడం కామనే. అయితే ఒక్కోసారి మహామహులకు సాధ్యం కాని రికార్డుల్ని కొందరు అనామకులు బ్రేక్ చేసేస్తుంటారు. వాళ్లు ఎవరో కూడా చాలా మందికి తెలియదు. కానీ ఎలాంటి ఎక్స్​పెక్టేషన్స్ లేకుండా వచ్చి సంచలనాలు చేసేస్తుంటారు. ఇలాంటి వాళ్లకు ఓవర్​నైట్ స్టార్​డమ్ వచ్చేస్తుంది. క్రికెట్​లో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా వరల్డ్ క్రికెట్​లో ఓ సంచలన రికార్డు నమోదైంది. ఇండోనేషియా విమెన్ ప్లేయర్ రోహ్మాలియా చరిత్ర సృష్టించింది. ఇప్పటిదాకా ఎవరికీ సాధ్యం కానిది ఆమె సాధించింది.

ఇండోనేషియా, మంగోలియా మహిళా జట్ల మధ్య బుధవారం ఓ టీ20 మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్​లో ఊహించని రికార్డు నమోదైంది. ఇండోనేషియా బౌలర్ రోహ్మాలియా హిస్టరీ క్రియేట్ చేసింది. 17 ఏళ్ల రోహ్మాలియా 3.2 ఓవర్లు బౌలింగ్ వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఏకంగా 7 వికెట్లు తీసింది. ఏడు వికెట్లు తీయడం మామూలే. కానీ ఒక్క రన్ కూడా ఇవ్వకుండా తీయడం గ్రేట్. టీ20 క్రికెట్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు ఇది. లెజెండరీ ప్లేయర్స్​ కూడా ఈ ఘనతను అందుకోలేదు. కానీ ఇండోనేషియాకు చెందిన రోహ్మాలియా రికార్డు సృష్టించింది. ఆమె ధాటికి మంగోలియా టీమ్ 24 రన్స్​కే కుప్పకూలింది.

Rohmalia

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన ఇండోనేషియా విమెన్స్ టీమ్ 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. నందా సకారిని (44 బంతుల్లో 61) ధనాధన్ బ్యాటింగ్​తో అలరించింది. ఆమెతో పాటు హిల్వా నూర్ (19) రాణించింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన మంగోలియా జట్టును రోహ్మాలియా కట్టిపడేసింది. ఆమె దెబ్బకు అపోజిషన్ టీమ్​లో ఒక్క బ్యాటర్ కూడా రెండంకెల స్కోరు చేయలేదు. సెండ్యూరెన్ (7) హైస్కోరర్. నిప్పులు చెరిగే బంతులతో మంగోలియాను కూల్చిన రోహ్మాలియా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి