iDreamPost

చైనాకు దిమ్మతిరిగేలా షాకిస్తున్న భారతీయులు.. ఆ దేశ టీవీలు, స్మార్ట్‌ఫోన్లు కొంటలేరు

చైనాకు దిమ్మతిరిగేలా షాకిస్తున్న భారతీయులు.. ఆ దేశ టీవీలు, స్మార్ట్‌ఫోన్లు కొంటలేరు

చైనాలో స్మార్ట్ ఫోన్ కంపెనీలు, టెలివిజన్ పరిశ్రమ నేల చూపులు చూస్తోంది. దీనికి గల కారణం భారత్ లో వాటి అమ్మకాలు తగ్గడమే. భారతీయులు చైనా దేశపు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను కొనడానికి ఆసక్తి చూపించడం లేదు. ఆ దేశ ఉత్పత్తులను కొనకుండా షాకిస్తున్నారు భారతీయులు. ఈ విషయం ఆ దేశంలో మార్కెట్ రీసెర్చ్ కౌంటర్ పాయింట్ టెక్నాలజీ సర్వే చేసి రూపొందించిన నివేదికలో వెల్లడైంది.గతంలో భారత్ లో చైనా ఉత్పత్తులకు మంచి సేల్ ఉండేది. కానీ అది రాను రాను తగ్గిపోయింది. ముఖ్యంగా భారత్ లో టెలివిజన్ సెక్టార్ లో చైనా బ్రాండ్ టీవీలకు మార్కెట్ తగ్గిపోయింది. దీంత ఆయా కంపెనీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

చైనాలో తయారయిన ప్రముఖ మొబైల్ ఫోన్లు రియల్ మీ, షియోమీ, వివో,ఐక్యూ వంటి స్మార్ట్ ఫోన్స్, టెలివిజన్ రంగంలో ఎల్ జీ, సామ్‌సంగ్ వంటి బ్రాండెడ్ ఉత్పత్తులకు మార్కెట్ తగ్గింది. నివేదిక ప్రకారం వన్ ప్లస్, రియల్ మీ టీవీలు భారత మార్కెట్ లో వాటి మార్కెటింగ్ తగ్గిపోవచ్చు. వాస్తవానికి ఏప్రిల్ నుండి జూన్ త్రైమాసికంలో చైనీస్ బ్రాండ్‌ల టీవీ షిప్‌మెంట్‌లు 33.6శాతం పడిపోయాయి. గతేడాది ఈ సంఖ్య 35.7 శాతంగా ఉంది. జూలై, ఆగస్టులలో కూడా చైనీస్ బ్రాండ్ల అమ్మకాలు 30 నుండి 33శాతం వరకు క్షీణించాయి.చైనీస్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లు భారత్ లో మార్కెట్ వాటాను కోల్పోతున్నాయి. మొత్తానికి చైనా ఉత్పత్తుల పట్ల భారతీయులు చూపిస్తున్న నిరాసక్తత చైనా కంపెనీలకు కంటికి కునుకు లేకుండా చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి