iDreamPost

అమెరికాలో వరుసగా భారత విద్యార్థులు మృతి.. ఏం జరుగుతోంది?

America: ఇటీవల అమెరికాలో వరుసగా భారతీయ విద్యార్థులు మృతి చెందుతున్నారు. ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటి వరకు ఐదు మంది మరణించారు. అయితే అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఆ మరణాల వెనుక మిస్టరీ ఏంటి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

America: ఇటీవల అమెరికాలో వరుసగా భారతీయ విద్యార్థులు మృతి చెందుతున్నారు. ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటి వరకు ఐదు మంది మరణించారు. అయితే అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఆ మరణాల వెనుక మిస్టరీ ఏంటి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

అమెరికాలో వరుసగా భారత విద్యార్థులు మృతి.. ఏం జరుగుతోంది?

ఒకప్పుడు చాలా మంది భారతీయులకు అమెరికాకు వెళ్లడం అనేది ఒక కలగా ఉండేది. అతి తక్కువ మంది మాత్రమే ఆ అగ్రరాజ్యానికి వెళ్లై వారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి.. విద్య, ఉద్యోగం నిమిత్తం ఎంతో మంది భారతీయులు అమెరికాకు పయనం అవుతున్నారు. మంచి భవిష్యత్ ఉంటుందని యువత యూఎస్ఏకి వెళ్తున్నారు. తల్లిదండ్రులను వదలిసే.. ఒంటరిగా జీవిస్తున్నాయి. అయితే తరచూ అక్కడ భారతీయులు వివిధ కారణాలతో మృతి చెందుతున్నారు. ఇక ఇటీవల అమెరికాలో వరుసగా భారతీయ విద్యార్థులు మృతి చెందడంతో ఇక్కడ ఉండే వారి బంధువులు ఆందోళనకు గురవుతున్నారు.

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని ఎంతో మంది భారతీయ విద్యార్థులు కలలు కంటారు. అలానే ఉన్నత చదువుల కోసం చాలా మంది అమెరికాకు పయనం అవుతుంటారు. ఇప్పటికే అలా వెళ్లిన ఎందరో బాగా చదువుకుని.. అక్కడే ఉద్యోగాలు చేస్తూ స్థిర పడ్డారు. అలా వారి బాటల్లోనే ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు అమెరికాకు పయనం అవుతుంటారు. అలా వెళ్లిన విద్యార్థులపై వారి తల్లిదండ్రులు  ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అయితే ఈ ఏడాది అమెరికాలో వరుసగా భారతీయ విద్యార్థులు మృతి చెందుతున్నారు. ఇదే ఇప్పుడు భారత్ లో ఉన్న వారి బంధువులను ఆందోళనకు గురి చేస్తోంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది తెలియక అక్కడి విద్యార్థుల తల్లిదండ్రులు  భయాందోళనకు గురవుతున్నారు.

ఈ ఏడాది తొలిరోజు నుంచి ఇప్పటి వరకు ఐదుమంది భారతీయ విద్యార్థులు మృతి చెందారు. ఇటీవలే శ్రేయాస్ రెడ్డి అనే విద్యార్థి మృతి చెందాడు.  స్థానిక సమాచారం ప్రకారం.. శ్రేయాస్ రెడ్డి  అనే విద్యార్థి సిన్సినాటిలో చనిపోయిన స్థితిలో కనిపించాడు. అయితే అతడి మరణానికి  గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడు లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చదువుతున్నట్లు సమాచారం. అతడి మృతిపై న్యూయార్క్ లోని భారత రాయబార కార్యాలయం ప్రగాఢ సానుభూతి తెలిపింది. మరోవైపు వారం రోజుల వ్యవధిలోనే ఇలా విద్యార్థులు మృతి చెందడం అందరని కలవరానికి గురి చేస్తోంది. ఇక శ్రేయాస్ రెడ్డి కంటే ముందు నలుగురు విద్యార్థులు కూడా చనిపోయారు.

వివేక్ సైనీ(25)అనే భారతీయ విద్యార్థిని ఓ వ్యక్తి దుకాణంలో కొట్టి చంపాడు.  అలానే నీల్ ఆచార్య అనే విద్యార్థి కూడా గత వారం శవమైన కనిపించాడు. గత ఆదివారం ఆచార్య కనిపించడం లేదని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ మరుసటి రోజే శవమై కనిపించాడు. ఇక ఆదిత్య అద్లాఖా అనే 26 ఏళ్ల భారతీయ విద్యార్థి కూడా దారుణ హత్యకు గురయ్యారు. అలానే అకుల్ ధావన్ అనే 18 ఏళ్ల భారత సంతతి విద్యార్థి కూడా మృతి చెందాడు. ఇలా అతి తక్కువ సమయంలోనే 5 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారు. కొందరు హత్యకు గురిగా, మరికొందరు ఏ కారణంతో చనిపోయారో కూడా తెలియడం లేదు. మొత్తంగా ఇలా వరుస భారతీయ విద్యార్థుల మృతితో అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. మరి.. అమెరికాలో వరుసగా భారతీయ యువకులు మరణిస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి