iDreamPost

రైల్వే సూపర్ యాప్.. బుకింగ్, ట్రాకింగ్ అన్నీ సేవలు ఒకే యాప్ లో!

  • Published Apr 11, 2024 | 6:35 PMUpdated Apr 11, 2024 | 6:35 PM

భారతదేశ రవాణా సంస్థలలో.. రైల్వే సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. అయితే గత కొంతకాలంగా రైల్వే సంస్థలలో కొన్ని సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా కొన్ని సదుపాయాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారట అధికారులు.

భారతదేశ రవాణా సంస్థలలో.. రైల్వే సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. అయితే గత కొంతకాలంగా రైల్వే సంస్థలలో కొన్ని సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా కొన్ని సదుపాయాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారట అధికారులు.

  • Published Apr 11, 2024 | 6:35 PMUpdated Apr 11, 2024 | 6:35 PM
రైల్వే సూపర్  యాప్.. బుకింగ్, ట్రాకింగ్ అన్నీ సేవలు ఒకే యాప్ లో!

ఇండియన్ రైల్వే సిస్టమ్స్ ను ఎంతో మంది ఉపయోగిస్తూ ఉంటుంటారు. దేశంలో అన్ని మారుమూల ప్రాంతాలను కనెక్ట్ చేయడంలో భారతీయ రైల్వేలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. తక్కువ ధరలకు అయిపోతుంటాయి కాబట్టి చాలా మంది.. ప్రయాణానికి రైల్వే సదుపాయాలనే ఉపయోగిస్తూ ఉంటారు, అయితే ఈ క్రమంలో గత కొంత కాలంగా రైల్వే సంస్థలు అనేక సమస్యల గురి కావడంతో.. ఇప్పుడు మారుతున్న టెక్నాలజీతో వాటికి కొత్త పరిష్కారాలను కనుగొంటోంది. టెక్నాలజీ మారుతోంది కాబట్టి.. ప్రపంచంలో ఏ సమస్యకైనా సరే ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. దీనితో ఇప్పుడు రైల్వేస్ కూడా ఉన్న సమస్యలను తొలగించేందుకు.. ఒక సూపర్ యాప్ ను డెవలప్ చేసింది. ఈ సూపర్ యాప్ అందించే సేవలన్నిటిని ఒకే చోట ప్రజలకు అందించబోతుంది. మరి ఏ ఏ సదుపాయలు ఈ యాప్ లో అందుబాటులో ఉన్నాయో చూసేద్దాం.

ఆధునికంగా ప్రపంచం ఎంతో ముందుకు వెళ్తుంది. దీనితో ఎటువంటి సమస్యనైనా కానీ క్షణాల్లో పరిష్కారం కనుక్కోవచ్చు. ఈ క్రమంలోనే ఇండియన్ రైల్వేస్ లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలు వచ్చేశాయి. దాదాపు అన్ని సేవలను ఒకే చోట ఉపయోగించే విధంగా ఈ యాప్ పనిచేస్తుంది. ఈ యాప్ లోనే టికెట్ బుకింగ్, ట్రైన్ ట్రాకింగ్ ఇలా అన్ని చెక్ చేసుకోవచ్చు. అలాగే టికెట్ క్యాన్సిలేషన్ కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. అంతేకాకుండా టికెట్ వాపస్ కోసం.. 24/7 సర్వీస్ ను కూడా ప్రారంభించబోతుంది. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు.. దీనిని ప్రారంభించాలనే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వీటికోసం యాప్స్ ఉన్నా కూడా.. ఇప్పుడు అన్ని సేవలను కలిపి ఒకటే యాప్ లో ఉపయోగించుకునేలా దీనిని ప్రారంభిస్తున్నారు.

ఇక ప్రస్తుతం అత్యధికంగా అందరు ఉపయోగిస్తున్న యాప్ IRCTC రైల్ కనెక్ట్ యాప్. ఇప్పటివరకు ఈ యాప్ 10 కోట్ల డౌన్లోడ్స్ ను కలిగి ఉంది. ఇక ఇది కాకుండా.. రైల్ మదద్, యుటీఎస్ , సతార్క్ లాంటి ఎన్నో యాప్స్ ను ఉపయోగిస్తూ ఉన్నారు. అలాగే ట్రైన్ ట్రాకింగ్ చేయడానికి వేర్ ఈజ్ మై ట్రైన్ అనే యాప్ ను వినియోగిస్తూ ఉన్నారు. వాటిలో అప్పుడప్పుడు సాంకేతిక కారణాల వలన ఇబ్బందులు తలెత్తొచ్చు. ఈ యాప్ లు అన్నిటిని కలిపి ఒకే అప్లికేషన్ కిందకు తెచ్చేందుకు.. రైల్వే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే.. కలకత్తా మెట్రో మొబైల్ యాప్ ను 4 లక్షల మందికి పైగా ఉపయోగిస్తున్నారు. ఇది వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండడంతో.. ఇప్పుడు ఈ సూపర్ యాప్ లాంచ్ చేసే దిశగా అధికారులు సన్నద్ధం అవుతున్నారు. త్వరలోనే ఈ సూపర్ యాప్ అందరికి అందుబాటులోకి రానుంది. మరిఎం ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి