iDreamPost

గుడ్ న్యూస్: అధికవేగం, తక్కువ ఛార్జీలు.. ‘వందే సాధారణ రైలు..!

గుడ్ న్యూస్: అధికవేగం, తక్కువ ఛార్జీలు.. ‘వందే సాధారణ రైలు..!

వందే భారత్ రైళ్లు.. వీటి గురించి ప్రయాణికులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేశంలో అత్యంత పాపులర్ గా మారాయి ఈ వందే భారత్ రైళ్లు. ప్రయాణికులను అత్యంత వేగంతో, తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుస్తుంది. అయితే ఈ వందే భారత్ రైళ్ల ఛార్జీలు భారీగా ఉన్నాయి. అందుకే సామాన్య ప్రజలు ఇందులో ప్రయాణించేందుకు వెనుకడుగు వేస్తుంటారు. అందుకే సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని, వారి కోసం వందే భారత్ ఆర్డినర్ రైళ్లను నడపడానికి ఇండియన్ రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. వందేభారత్ కు భిన్నంగా వందే సాధారణ రైలును ప్రారంభించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ రైలుకు సంబంధించిన కోచ్ లను తయారు చేస్తున్నారు. మరీ.. ఈ వందే భారత్ ఆర్డీనరీ రైలు వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

మీడియా నివేదికల ప్రకారం.. వందేభారత్ రైళ్లు సామాన్యులకు కాస్తా దూరంగా ఉందనే  టాక్ వినిపించింది. కేవలం అధిక ధరలు చెల్లించే స్థోమత గల వారే ఈ రైళ్లలో ప్రయాణాలు చేస్తున్నారు. అధిక ఛార్జీల కారణంగా  చాలా మంది ఈ రైళ్లలో ప్రయాణించలేకపోయారని రైల్వే తెలిపింది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని  రైల్వే “వందే సాధారణ” రైలును ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వందేభారత్ రైలుతో పోల్చితే.. ఇందులో  ఛార్జీలు తక్కువగా ఉంటుంది. ఇక త్వరలో ఈ రైళ్లను పట్టాలు ఎక్కించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే వందే సాధారణ రైలు కోసం  కోచ్ లను తయారు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. చెన్నైలోని ఇంట్రిగల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైలు కోచ్ లను తయారు చేస్తున్నారు. ఇవి అతి త్వరలోనే రానున్నాయి. వందే భఆరత్ సాధారణ రైల్లో24 ఎల్ హెచ్ బీ కోచ్ లను ఏర్పాటు చేయనున్నారు. అలానే బయో వాక్యూమ్ టాయిలెట్స్, ప్యాసింజర్ సమాచార వ్యవస్థ, ఛార్జీంగ్ పాయింట్స్ వంటి అధునాతన సౌకర్యాలు కూడా  ఇందులో రూపొందిచనున్నారు. వీటితో పాటు రైలులో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. వందే భారత్ రైలు మాదిరిగానే దీనికి కూడా ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ  రైలళ్ల వేగం మెయిల్, ఎక్స్ ప్రెస్  కంటే ఎక్కువగా ఉంటుంది.  అలానే ఛార్జీల విషయానికి వస్తే.. అతి తక్కువ ధర ఉండనుందని సమాచారం.

సామాన్య ప్రజల కోసం ఈ రైలును తయారు చేస్తోన్నారు. కాబట్టి  వందేభారత్  ఎక్స్ ప్రెస్  కంటే చాలా తక్కువగా ఛార్జీ ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఛార్జీల గురించి అధికారిక సమాచారం లేదు.  రైల్వే మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. వందే భారత్, సాధారణం వందే భారత్ రైలు మధ్య వ్యత్యాసాన్ని అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. ఏది ఏమైనప్పటికి.. వందే భారత్ రైల్లో ప్రయాణించాలనుకునే సామాన్యులకు ఇది శుభవార్తే.. మరి.. వందే భారత్ కు భిన్నంగా వందే సాధారణ రైలు రానుండం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి