iDreamPost

ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్! ఒక్కో టిక్కెట్‌ ధర రూ.1.86 కోట్లు!

  • Published Mar 04, 2024 | 3:26 PMUpdated Mar 04, 2024 | 3:26 PM

India vs Pakistan, T20 World Cup 2024: ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే క్రికెట్‌ అభిమానులకు పండుగ అనే చెప్పాలి. అలాంటి మ్యాచ్‌ చూసేందుకు క్రికెట్‌ కొందామంటే కళ్లు చెదిరిపోయే రేట్లు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

India vs Pakistan, T20 World Cup 2024: ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే క్రికెట్‌ అభిమానులకు పండుగ అనే చెప్పాలి. అలాంటి మ్యాచ్‌ చూసేందుకు క్రికెట్‌ కొందామంటే కళ్లు చెదిరిపోయే రేట్లు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 04, 2024 | 3:26 PMUpdated Mar 04, 2024 | 3:26 PM
ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్! ఒక్కో టిక్కెట్‌ ధర రూ.1.86 కోట్లు!

ఏంటి.. ఒక్క టిక్కెటే రూ.1.83 కోట్లా? అంత సీన్‌ లేదు అనుకుంటున్నారా? ఎంత ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అయినా మరీ రెండు కోట్లు పెట్టి ఒక్క టిక్కెట్‌ కొని ఎవరైనా మ్యాచ్‌ చూస్తారా? అని అనుకోవచ్చు. కానీ, ఇది నిజం. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జూన్‌ 9న న్యూయార్క్‌ వేదికగా మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ టిక్కెట్ల గురించే ఇప్పుడు చర్చంతా. ఒకటి కాదు రెండు కాదు.. వేలు కాదు లక్షలు కాదు.. ఏకంగా కోట్లలో ఆ మ్యాచ్‌ టిక్కెట్‌ ధరలు పలుకుతుండటం ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా మారింది. ఇండియా పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే క్రికెట్‌ అభిమానుల్లో భారీ క్రేజ్‌ ఉంటుందనే విషయం తెలిసిందే. పైగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడంతో.. కేవలం ఐసీసీ మెగా ఈవెంట్స్‌లోనే దాయాది జట్లు పోటీ పడుతున్నాయి.

ఈ క్రమంలోనే జూన్‌లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ప్రపంచ ‍వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్‌ను లైవ్‌లో చూసేందుకు టిక్కట్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. టీ20 వరల్డ్ కప్‌ 2024 టోర్నీ టిక్కట్లను ఐసీసీ(ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌) పబ్లిక్‌ బ్యాలెట్‌ ద్వారా విక్కయిస్తోంది. ఇందులో ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ టిక్కెట్‌ ధరలను 6 డాలర్ల నుంచి 400 డాలర్లుగా నిర్ణయించింది. ఇండియన్‌ కరెన్సీలో వీటి ధరలు రూ.497 నుంచి రూ.33,148 లుగా ఉంది. కానీ, బ్లాక్‌ అండ్‌ సెకండరీ మార్కెట్‌లో ఈ టిక్కెట్ల ధరలు మాత్రం ఊహకు అందని విధంగా ఉన్నాయి.

స్టబ్‌హబ్‌, సీట్‌గీక్‌ లాంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌కి ఉన్న క్రేజ్‌ను ఫుల్‌ క్యాష్‌ చేసుకుంటున్నాయి. 400 డాలర్లు ఉన్న టిక్కెట్‌ ధర.. సెకండరీ మార్కెట్‌లో 40 వేల డాలర్లకు విక్రయిస్తున్నారు. పైగా వాటికి ట్యాక్స్‌లు ఇతర ఖర్చులు కలిపితే.. 50 వేల డాలర్లకు ఒక టిక్కెట్‌ వస్తోంది. ఒక్కో టిక్కెట్‌ 50 వేల డాలర్లు అంటే.. మన ఇండియన్‌ కరెన్సీలో దాదాపు 40 లక్షల పై మాటే. యూఎస్‌ఏ టూడే రిపోర్ట్‌ ప్రకారం.. సీట్‌గీక్‌లో ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ టిక్కెట్‌ ధర అత్యధికంగా 1,75,000 డాలర్లుగా నిర్ణయించినట్లు తేలింది. అంటే మన ఇండియన్‌ కరెన్సీలో ఒక్క టిక్కెట్‌ ధర రూ.1.4 కోట్లు.. దానికి ట్యాక్స్‌లు ఇతర ఖర్చులు కలుపుకుంటే.. దాదాపు రూ.1.86 కోట్లకు ఒక్క టికెట్‌ వస్తోంది. ఇలా ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ను సెకండరీ మార్కెట్‌ బీభత్సంగా క్యాష్‌ చేసుకుంటోంది. మరి ఈ ధరలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి