iDreamPost

ఆఖరి టెస్ట్​కు రోహిత్ శర్మ దూరం! కెప్టెన్​గా ఆ స్టార్ ప్లేయర్!

  • Published Feb 28, 2024 | 8:12 PMUpdated Feb 28, 2024 | 8:12 PM

ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​ను ఇప్పటికే సొంతం చేసుకున్న భారత్.. ధర్మశాల వేదికగా జరిగే ఆఖరి మ్యాచ్​కు రెడీ అవుతోంది. అయితే ఐదో టెస్ట్​లో టీమిండియా కెప్టెన్సీ విషయంలో అనూహ్య మార్పు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​ను ఇప్పటికే సొంతం చేసుకున్న భారత్.. ధర్మశాల వేదికగా జరిగే ఆఖరి మ్యాచ్​కు రెడీ అవుతోంది. అయితే ఐదో టెస్ట్​లో టీమిండియా కెప్టెన్సీ విషయంలో అనూహ్య మార్పు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Published Feb 28, 2024 | 8:12 PMUpdated Feb 28, 2024 | 8:12 PM
ఆఖరి టెస్ట్​కు రోహిత్ శర్మ దూరం! కెప్టెన్​గా ఆ స్టార్ ప్లేయర్!

ఇంగ్లండ్​తో జరుగుతున్న టెస్ట్ సిరీస్​లో టీమిండియా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సీనియర్స్ ఒక్కొక్కరుగా ఈ సిరీస్​కు దూరం అవుతూ వచ్చినా.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో కుర్రాళ్ళు అద్భుత ప్రదర్శన చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే టీమిండియా ఈ టెస్ట్ సిరీస్​ను సొంతం చేసుకోవడం విశేషం. ఇక, చివరిదైన ఐదో టెస్ట్ మార్చి 7 నుంచి ప్రారంభం కానుంది. అయితే.. ఈ గ్యాప్​లో భారత అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. లాస్ట్ టెస్ట్​కు సారథి రోహిత్ శర్మ అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదట. హిట్​మ్యాన్ చాలా కాలంగా విరామం తీసుకోకుండా క్రికెట్ ఆడుతున్నాడు. ఒకవైపు సీనియర్స్ అంతా టీమ్​కు దూరమైనా రోహిత్ ఒక్కడే తన బాధ్యతను నిర్వర్తిస్తూ వచ్చాడు. అయితే.. ఎలాగో టెస్ట్ సిరీస్ గెలిచేయడంతో.. నామమాత్రంగా మిగిలిన చివరి టెస్ట్​కు హిట్​మ్యాన్​కు రెస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పేసర్లుకు అనుకూలించే ధర్మశాలలో చివరి టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్​కు పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా కమ్​బ్యాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో చివరి టెస్ట్​కు బుమ్రాను కెప్టెన్​గా నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బుమ్రాకు ఇది వరకు కెప్టెన్​గా కొంత అనుభవం ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే బ్యాటర్​గా రోహిత్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అనేది ఇక్కడ ప్రశ్నగా మారింది. ఈ సిరీస్​లో దారుణంగా విఫలమైన రజత్ పాటిదార్​కు మరో అవకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి పాటిదార్ పై వేటు వేసి.. దేవదత్ పడిక్కల్​కు అవకాశం కల్పిస్తారని అంతా భావించారు. అయితే.. ఇప్పుడు రోహిత్ రెస్ట్ తీసుకోవడంతో పడిక్కల్ అతడి స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. దీంతో.. రజత్ సేఫ్ జోన్​లోనే ఉన్నట్టు అయ్యింది.

నిన్న మొన్నటి వరకు ఇండియన్ టెస్ట్ టీమ్​కు రోహిత్, కోహ్లీ, పుజారా, రహానే, రాహుల్ వంటి సీనియర్ ప్లేయర్స్ పెద్ద అండగా నిలుస్తూ వచ్చారు. ఇప్పుడు హిట్​మ్యాన్ కూడా తప్పుకుంటే.. టీమిండియాలో ఒక్క సీనియర్ బ్యాటర్ కూడా కనిపించే అవకాశం లేదు. దీంతో.. జూనియర్స్​కు ఇదే మంచి అవకాశం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బౌలింగ్​లో మాత్రం భారత్ సీనియర్స్, జూనియర్స్ కలయికతో సమతూకంతో కనిపిస్తోంది. మరి.. ఒక్క సీనియర్ సలహాలు కూడా లేకుండా ఐదో టెస్టులో కుర్రాళ్ళు ఎంత వరకు కుమ్మేస్తారు అనేది ప్రశ్నగా మారింది. మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్​లో బెర్త్ దక్కాలంటే ప్రతి మ్యాచ్ గెలవడం, పాయింట్స్ పెంచుకోవడం అత్యవసరం. మరి.. బుమ్రా కెప్టెన్సీ పగ్గాలు చేపడతాడనే వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: RCB అంటే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కాదు! IPLకి ముందు కొత్త అర్థం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి