iDreamPost

KL Rahul: టీమ్‌లో KL రోల్‌ ఫిక్స్‌ చేసిన ద్రవిడ్‌! ఇక నుంచి దానికే పరిమితం

  • Published Jan 23, 2024 | 3:44 PMUpdated Jan 23, 2024 | 3:44 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్​ సూపర్ ఫామ్​లో ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్​లో బౌలర్లను రఫ్ఫాడించిన కేఎల్.. దాన్నే సౌతాఫ్రికా టూర్​లోనూ కంటిన్యూ చేశాడు. అలాంటి కీలక ప్లేయర్​కు టీమ్​లో రోల్ ఫిక్స్ చేశాడు కోచ్ రాహుల్ ద్రవిడ్.

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్​ సూపర్ ఫామ్​లో ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్​లో బౌలర్లను రఫ్ఫాడించిన కేఎల్.. దాన్నే సౌతాఫ్రికా టూర్​లోనూ కంటిన్యూ చేశాడు. అలాంటి కీలక ప్లేయర్​కు టీమ్​లో రోల్ ఫిక్స్ చేశాడు కోచ్ రాహుల్ ద్రవిడ్.

  • Published Jan 23, 2024 | 3:44 PMUpdated Jan 23, 2024 | 3:44 PM
KL Rahul: టీమ్‌లో KL రోల్‌ ఫిక్స్‌ చేసిన ద్రవిడ్‌! ఇక నుంచి దానికే పరిమితం

ఇంగ్లండ్​తో టెస్ట్​ సిరీస్​కు సిద్ధమవుతున్న టీమిండియా జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది. ఉప్పల్​లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సోమవారం రోహిత్ శర్మ, శుబ్​మన్ గిల్, యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, జస్​ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శ్రేయస్ అయ్యర్​తో పాటు కేఎల్ రాహుల్, ముకేశ్ కుమార్ తదితరులు సాధన చేశారు. గ్రౌండ్​లో ప్రాక్టీస్ తర్వాత నెట్స్​లో బౌలింగ్, బ్యాటింగ్ సాధన చేశారు. అయోధ్యలోని బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లడంతో ఈ ఆప్షనల్ ప్రాక్టీస్​కు దూరమయ్యాడు రవీంద్ర జడేజా. ఇంక ఆదివారమే హైదరాబాద్​కు చేరుకున్న విరాట్ కోహ్లీ.. పర్సనల్ రీజన్స్ వల్ల తొలి రెండు టెస్టులకు దూరమైన సంగతి తెలిసిందే. ప్లేయర్ల ప్రాక్టీస్​ను పర్యవేక్షించాడు కోచ్ రాహుల్ ద్రవిడ్. ఆ తర్వాత ఆయన ప్రెస్​మీట్​లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కేఎల్ రాహుల్​కు టీమ్​లో ఓ రోల్ ఫిక్స్ చేశామన్నాడు.

ఇంగ్లండ్​తో జరిగే 5 టెస్టుల సిరీస్​లో కేఎల్ రాహుల్ స్పెషలిస్ట్ బ్యాటర్​గా మాత్రమే బరిలోకి దిగుతాడని ద్రవిడ్ తెలిపాడు. అతడు వికెట్ కీపింగ్ చేయడని స్పష్టం చేశాడు. అందుబాటులో ఉన్న కేఎస్ భరత్, ధృవ్ జురెల్​లో నుంచి ఒకర్ని వికెట్ కీపర్​గా తీసుకుంటామని చెప్పాడు. ‘ఈ సిరీస్​లో రాహుల్ వికెట్ కీపింగ్​కు దూరంగా ఉంటాడు. ఈ విషయంలో మేం చాలా క్లారిటీగా ఉన్నాం. వికెట్ కీపింగ్ కోసం ఇద్దరు ప్లేయర్లను ఇప్పటికే ఎంపిక చేశాం. సౌతాఫ్రికా సిరీస్​లో కేఎల్ అద్భుతంగా ఆడాడు. ఆ సిరీస్​ను భారత్ డ్రా చేయడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. అయితే ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్​ను దృష్టిలో ఉంచుకొని అతడ్ని వికెట్ కీపింగ్ బాధ్యతలకు దూరంగా ఉంచాలని డిసైడ్ అయ్యాం. కీపింగ్ కోసం ఇద్దరు ఆటగాళ్లను తీసుకున్నాం. వారిలో ఒకరికి బాధ్యతలు అప్పజెబుతాం’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. ఇక, కేఎస్ భరత్ ఇప్పటికే టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. కానీ హైదరాబాద్ టెస్ట్​లో జురెల్​కు ఛాన్స్ దక్కితే మాత్రం అతడికి ఇదే అరంగ్రేట మ్యాచ్ కానుంది.

కాగా, ఆసియా కప్-2023 నుంచి ఆడిన ప్రతి ఫార్మాట్​లోనూ దుమ్మురేపుతున్నాడు కేఎల్ రాహుల్. ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా వన్డే సిరీస్, వన్డే వరల్డ్ కప్-2023, సౌతాఫ్రికా టూర్​లోనూ తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు. రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురవడంతో  టీమ్​కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో పలువురు కీపర్లను ప్రయోగించిన టీమ్ మేనేజ్​మెంట్ ఆఖరికి రాహుల్​కు ఉన్న కీపింగ్ ఎబిలిటీస్​ను యూజ్ చేసుకుంది. అతడు కూడా కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అద్భుతంగా కీపింగ్​ చేస్తూ భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే రెగ్యులర్​గా ఆడుతుండటం, మూడు ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్ కావడంతో వర్క్ లోడ్ తగ్గిద్దామనే ఉద్దేశంతో అతడ్ని ఇంగ్లండ్​తో సిరీస్​లో కీపింగ్​కు దూరంగా ఉంచారని ద్రవిడ్ మాటలతో స్పష్టమైంది. దీంతో ఇక నుంచి అతడు బ్యాటింగ్​కు మాత్రమే పరిమితం కానున్నాడు. మరి.. రాహుల్​ను కేవలం బ్యాటింగ్​కే పరిమితం చేస్తూ టీమ్ మేనేజ్​మెంట్ తీసుకున్న నిర్ణయంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి