iDreamPost

IND vs ENG: తొలి టెస్ట్​లో ఓటమి.. కోచ్ ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్!

  • Published Jan 29, 2024 | 3:57 PMUpdated Jan 30, 2024 | 7:25 AM

ఇంగ్లండ్​తో జరిగిన తొలి టెస్ట్​లో భారత్ ఓడిన సంగతి తెలిసిందే. ఈ ఓటమిపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. వాళ్ల వల్లే మ్యాచ్ చేజారిందన్నాడు.

ఇంగ్లండ్​తో జరిగిన తొలి టెస్ట్​లో భారత్ ఓడిన సంగతి తెలిసిందే. ఈ ఓటమిపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. వాళ్ల వల్లే మ్యాచ్ చేజారిందన్నాడు.

  • Published Jan 29, 2024 | 3:57 PMUpdated Jan 30, 2024 | 7:25 AM
IND vs ENG: తొలి టెస్ట్​లో ఓటమి.. కోచ్ ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్!

ఇంగ్లండ్​తో జరిగిన తొలి టెస్ట్​లో ఫస్ట్ ఇన్నింగ్స్​లో భారీ ఆధిక్యం దక్కించుకున్నా టీమిండియాకు ఓటమి మాత్రం తప్పలేదు. మొదటి రెండున్నర రోజులు ఆటపై భారత్​దే పెత్తనం. కానీ సెకండ్ ఇన్నింగ్స్​లో ఇంగ్లీష్ టీమ్​ను ఆపడంలో బౌలర్లు ఫెయిలవడం, ఛేజింగ్​లో బ్యాటర్లు చేతులెత్తేయడంతో రోహిత్ సేన ఓడిపోయింది. ప్రత్యర్థి నిర్దేశించిన 231 పరుగుల లక్ష్య ఛేదనలో 202 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్​లో బౌలర్లలో బుమ్రా ఒక్కడే రాణించాడు. బ్యాటింగ్​లో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ మార్క్​ను చేరుకోలేకపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ (39) టాప్ స్కోరర్​గా నిలిచాడు. మంచి స్టార్ట్స్ దొరికినా దాన్ని భారీ స్కోర్లుగా మలచేకపోయారు. అలాగే ఒకే లైన్ పట్టుకొని బౌలింగ్ చేస్తున్న ఇంగ్లండ్ స్పిన్నర్లపై ఒక్కరు కూడా అటాక్ చేయలేదు. దీంతో వాళ్లు మరింత చెలరేగిపోయారు. ఈ నేపథ్యంలో తొలి టెస్ట్​ ఓటమిపై భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

బ్యాటింగ్ ఫెయిల్యూర్ వల్లే మొదటి టెస్టులో ఓడిపోయామని ద్రవిడ్ అన్నాడు. భారత బ్యాటర్లలో ఒక్కరు కూడా సెంచరీ చేయలేదన్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్​లో ముగ్గురు బ్యాట్స్​మెన్ 80ల్లో ఔటయ్యారని తెలిపాడు. వాళ్లు సెంచరీలు చేసే అవకాశం చేజార్చుకున్నారని చెప్పాడు. ‘తొలి ఇన్నింగ్స్​లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేసే ఛాన్స్ మిస్సయ్యారు. మరో 70 పరుగులు చేసి ఉంటే సిచ్యువేషన్ డిఫరెంట్​గా ఉండేది. మొదటి రెండ్రోజులు పిచ్ బ్యాటింగ్​కు అనుకూలంగా ఉంది. అప్పుడే ఇంకాస్త బాగా ఆడాల్సింది. కొన్ని మంచి స్టార్ట్స్ దొరికినా దాన్ని వాడుకోలేకపోయాం. టెస్టుల్లో ఫోర్త్ ఇన్నింగ్స్​లో బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ సవాలే. 230 టార్గెట్ చిన్నగా కనిపించినా దాన్ని అందుకోవడం చాలా కష్టం. ఒక్క బ్యాట్స్​మన్​ అయినా సెంచరీ చేసి ఉంటే ఇంగ్లండ్ మీద డామినేషన్ చూపించేందుకు అవకాశం దక్కేది’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

We will lose because of them

టీమిండియాలో చాలా మంది యంగ్​స్టర్స్ ఉన్నారని ద్రవిడ్ పేర్కొన్నాడు. వాళ్లకు డొమెస్టిక్ క్రికెట్​లో మ్యాచులు ఆడిన ఎక్స్​పీరియెన్స్ ఉందని.. ఇంటర్నేషనల్ లెవల్​లో నేర్చుకోవడానికి వారికి ఇంకాస్త టైమ్ పడుతుందన్నాడు. వాళ్లు ఇలాంటి ఛాలెంజెస్​ను ఎదుర్కోలేదని.. ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందన్నాడు. దీని నుంచి నేర్చుకొని రాబోయే సిరీస్​ల్లో బెటర్​గా పెర్ఫార్మ్ చేస్తారని ఆశిస్తున్నానని ద్రవిడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఓలీ పోప్ (196) అద్భుతంగా ఆడాడని మెచ్చుకున్నాడు. క్వాలిటీ బౌలింగ్​లో ఇలాంటి పిచ్​పై స్వీప్, రివర్స్ స్వీప్​తో పరుగులు రాబట్టడం అంత ఈజీ కాదన్నాడు. అతడి విషయంలో భారత బౌలర్లు అనుకున్న ప్రణాళికల్ని సరిగ్గా అమలు చేయలేకపోయారని ద్రవిడ్ వివరించాడు. ఇంగ్లండ్​ బజ్​బాల్​ ఫార్ములాను బ్రేక్ చేసేందుకు నెక్స్ట్ మ్యాచ్​లో సరికొత్త వ్యూహాలతో వస్తామని స్పష్టం చేశాడు. మరి.. తొలి టెస్ట్​లో ఓటమికి బ్యాటర్ల ఫెయిల్యూర్ కారణమంటూ భారత కోచ్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి