iDreamPost

బలహీనతే బలం కానుందా? అయ్యర్​తో ద్రవిడ్ ఏం చేయబోతున్నాడు!

  • Author singhj Published - 08:44 PM, Sat - 7 October 23
  • Author singhj Published - 08:44 PM, Sat - 7 October 23
బలహీనతే బలం కానుందా? అయ్యర్​తో ద్రవిడ్ ఏం చేయబోతున్నాడు!

వన్డే వరల్డ్ కప్-2023 ఫస్ట్ మ్యాచ్​కు భారత్ సిద్ధమైంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న ఈ మ్యాచ్​లో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ముందే చెన్నైకి చేరుకున్న ఇరు జట్ల ప్లేయర్లు అక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డారు. నెట్స్​లో భారత్-ఆసీస్ ఆటగాళ్లు కఠోర సాధన చేస్తున్నారు. స్వదేశంలో జరుగుతున్న మెగా టోర్నీని విక్టరీతో మొదలుపెట్టాలనే ఉద్దేశంలో ఉన్న టీమిండియా.. కంగారూలతో తొలిపోరుకు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్​లో గెలవడం కోసం భారత మేనేజ్​మెంట్ స్పెషల్ ప్లాన్స్​ వేస్తోంది.

చెపాక్ వికెట్ స్పిన్​కు సహకరిస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో ఈ మ్యాచ్​లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు తోడుగా చైనామన్ కుల్దీప్ యాదవ్ కూడా టీమ్​లో ఉంటాడని టాక్. పేస్ బాధ్యతలను జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ మోస్తారు. వారికి తోడుగా ఎలాగూ పేస్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా ఉండనే ఉన్నాడు. అయితే అతడి వేలికి గాయమైందనే వార్తల నేపథ్యంలో బౌలింగ్ చేస్తాడో లేదో చూడాలి. ఒకవేళ పాండ్యా బౌలింగ్ వేయకపోతే టీమిండియా తుది కూర్పు మొత్తం మారిపోయే అవకాశం ఉంది. బ్యాటింగ్​ విషయంలో భారత్ కాస్త ఆందోళన పడుతోంది. ఓపెనర్ శుబ్​మన్ గిల్ డెంగ్యూతో బాధపడుతున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఒకవేళ గిల్ ఆడకపోతే ఇషాన్ కిషన్ అతడి ప్లేసులో గ్రౌండ్​లోకి దిగే ఛాన్స్ ఉంది. ఇదొక్కటి తప్పితే బ్యాటింగ్ విషయంలో ఏ టెన్షన్ లేదు. రోహిత్​ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్​లో ఉండటం బిగ్ ప్లస్. వీళ్లందరూ ఎక్స్​పీరియన్స్ ఉన్న బ్యాటర్లే. స్పిన్​, పేస్​ను బాగా ఆడగల సమర్థులే. అయితే అయ్యర్ విషయంలో మాత్రం ఒక ఆందోళన ఉంది. స్పిన్​ను బాగా హ్యాండిల్ చేసే ఈ స్టార్ బ్యాటర్.. పేస్​ను ఎదుర్కోవడంలో కాస్త ఇబ్బంది పడతాడు. అందులోనూ పిచ్​పై పడి ముఖం మీదకు దూసుకొచ్చే బౌన్సర్లు, బీమర్లను ఫేస్ చేయడంలో అయ్యర్ చాలా వీక్. భారత్​తో మ్యాచ్ టైమ్​లో అయ్యర్ బ్యాటింగ్​కు దిగితే చాలు.. ప్రత్యర్థి బౌలర్లు అతడికి షార్ట్ పిచ్ బంతుల్ని అదేపనిగా వేస్తుంటారు.

శ్రేయస్ అయ్యర్ కూడా చాలామార్లు షార్ట్ పిచ్ బంతులకే ఔటయ్యాడు. కానీ గాయం తర్వాత కమ్​బ్యాక్ ఇచ్చిన శ్రేయస్.. బౌన్సర్లను గ్రౌండ్​ షాట్స్​గా కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అయినా ఈ రకమైన బంతుల్ని ఎదుర్కోవడంలో అతడిలో అంత పర్ఫెక్షన్ కనిపించలేదు. ఈ వరల్డ్ కప్​లో మళ్లీ ఇదే బలహీనతగా మారే ప్రమాదం కనిపిస్తోంది. అందుకే కోచ్ రాహుల్ ద్రవిడ్​ దీనిపై ఫోకస్ చేశాడు. నెట్స్​లో అయ్యర్​తో పుల్ షాట్ ఆడటం ప్రాక్టీస్ చేయించాడు. టెన్నిస్ బ్యాట్ తీసుకొని అయ్యర్​కు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చాడు. ద్రవిడ్-అయ్యర్ ప్రాక్టీస్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో బౌన్సర్లను అయ్యర్ గట్టిగా లెగ్ సైడ్ వైపు కొడుతూ కనిపించాడు. అయ్యర్ బలహీనతను బలంగా మార్చాలనే ద్రవిడ్ ప్లాన్ వర్కవుట్ అయితే మాత్రం ఆసీస్ బౌలర్లకు చుక్కలేనని ఈ వీడియో చూసిన టీమిండియా ఫ్యాన్స్ అంటున్నారు.

ఇదీ చదవండి: World Cup: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్‌! భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌ జరగకపోవచ్చు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి