iDreamPost

Mukesh Kumar: ముకేశ్ కుమార్ సక్సెస్​ సీక్రెట్ అదే.. కలిసొచ్చిన లేడీ లక్..!

  • Author singhj Published - 05:47 PM, Tue - 5 December 23

భారత నయా స్పీడ్​స్టర్ ముకేశ్ కుమార్ రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్నాడు. ఆసీస్​తో టీ20 సిరీస్​లో అతడు అదరగొట్టాడు.

భారత నయా స్పీడ్​స్టర్ ముకేశ్ కుమార్ రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్నాడు. ఆసీస్​తో టీ20 సిరీస్​లో అతడు అదరగొట్టాడు.

  • Author singhj Published - 05:47 PM, Tue - 5 December 23
Mukesh Kumar: ముకేశ్ కుమార్ సక్సెస్​ సీక్రెట్ అదే.. కలిసొచ్చిన లేడీ లక్..!

రీసెంట్​గా ఆస్ట్రేలియాతో ముగిసిన 5 టీ20ల సిరీస్​ను టీమిండియా 4-1 తేడాతో సొంతం చేసుకుంది. తద్వారా వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో బాధలో ఉన్న అభిమానులకు కాస్త ఊరట కలిగించింది. ప్రపంచ కప్ ముగిసిన నాల్రోజుల్లోనే స్టార్ట్ అయిన ఈ సిరీస్​ మీద ముందు అంత ఇంట్రెస్ట్‌ ఎవరికీ కలగలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, మహ్మద్ షమి, జస్​ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ లాంటి స్టార్ ప్లేయర్లు అందుబాటులో లేకపోవడంతో ఈ సిరీస్​ను ఫ్యాన్స్ కూడా లైట్ తీసుకున్నారు. కానీ ఒక్కసారి మ్యాచులు మొదలయ్యాక మాత్రం అందర్నీ తమ వైపు తిప్పుకుంది యంగ్ ఇండియా. ఒక్కో మ్యాచ్ గెలుస్తూ సిరీస్​ను కైవసం చేసుకుంది.

కంగారూలతో సిరీస్​లో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, జితేష్ శర్మ, రింకూ సింగ్, ముకేశ్ కుమార్ లాంటి యంగ్​స్టర్స్ అద్భుతంగా రాణించారు. ఓపెనింగ్​లో జైస్వాల్, గైక్వాడ్ అదరగొట్టారు. ఇషాన్ మెరుపు ఇన్నింగ్స్​లతో మరోమారు సత్తా చాటాడు. కొత్త కుర్రాడైన జితేష్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇటు కీపింగ్​తో పాటు అటు బ్యాటింగ్​లో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో బ్యాటింగ్​కు వచ్చిన రింకూ సింగ్ కూల్​గా తన పని తాను చేసుకుపోయాడు. ఎంత ఒత్తిడి ఉన్నా టెన్షన్ పడకుండా మ్యాచ్​లను ముగించాడు.

స్పిన్నర్ రవి బిష్ణోయ్ పవర్ ప్లేతో పాటు మిడిల్ ఓవర్లలోనూ కీలకమైన బ్రేక్ త్రూలు అందించాడు. ఆవేశ్ ఖాన్, అర్ష్​దీప్ సింగ్ మొదట్లో కాస్త ఎక్కువ రన్స్ ఇచ్చినా ఆఖరి ఓవర్లలో మాత్రం అపోజిషన్ టీమ్ భరతం పట్టారు. లాస్ట్ టీ20లో అర్ష్​దీప్ ఫైనల్ ఓవర్ కట్టుదిట్టంగా వేసి భారత్​ను గెలిపించాడు. పేస్ బౌలర్లలో ముకేశ్ అందరికంటే ఎక్కువగా మార్కులు కొట్టేశాడు. వెటరన్ పేసర్ మహ్మద్ షమి వారసుడిగా పేరు తెచ్చుకున్నాడు. షమీలాగే పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్, స్వింగ్​, యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను పోయించాడు. అలాంటి ఈ బౌలర్ సిరీస్ మధ్యలోనే పెళ్లి చేసుకున్నాడు. మ్యారేజ్ కోసం మూడో టీ20కి దూరమయ్యాడు.

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన దివ్యా సింగ్ అనే అమ్మాయిని ముకేశ్ వివాహం చేసుకున్నాడు. అయితే మ్యారేజ్ కోసం మధ్యలోని వెళ్లిపోయిన ఈ డెత్ ఓవర్ స్పెషలిస్ట్​కు ఆఖరి రెండు మ్యాచుల్లో ఆడే ఛాన్స్ ఇచ్చింది టీమ్ మేనేజ్​మెంట్. ఐదో టీ20లోనైతే ముకేశ్ చెలరేగి బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లు వేసి 3 కీలక వికెట్లు తీశాడు. వరుసగా మ్యాట్​ షార్ట్​తో పాటు బెన్ డ్వార్ష్యూస్​ను ఔట్ చేశాడు. దీంతో ముకేశ్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. జూనియర్ షమి మ్యాచ్ మ్యాచ్​కు మరింత మెరుగవుతున్నాడని అంటున్నారు. పెళ్లి చేసుకోవడం అతడికి కలిసొచ్చింది.. అతడి వైఫ్ లక్ వల్లే ముకేశ్​ సక్సెస్ అయ్యాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. పెళ్లితో ముకేశ్ లక్ మారిపోయందనే అభిప్రాయాలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Virender Sehwag: సెహ్వాగ్ విధ్వంసక ఇన్నింగ్స్​కు 14 ఏళ్లు.. అలాంటి బ్యాటింగ్ నీకే సాధ్యం బాస్!

 

View this post on Instagram

 

A post shared by Delhi Capitals (@delhicapitals)

 

View this post on Instagram

 

A post shared by Team India (@indiancricketteam)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి