iDreamPost

BREAKING: హైదరాబాద్‌లో జరగాల్సిన ఇండియా మ్యాచ్‌ బెంగళూరుకు మార్పు!

  • Author Soma Sekhar Published - 04:58 PM, Wed - 8 November 23

హైదరాబాద్ వేదికగా జరగాల్సిన టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ను బెంగళూరుకు తరలించారు. మరి హైదరాబాద్ లో జరగాల్సిన మ్యాచ్ బెంగళూరుకు మార్చడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్ వేదికగా జరగాల్సిన టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ను బెంగళూరుకు తరలించారు. మరి హైదరాబాద్ లో జరగాల్సిన మ్యాచ్ బెంగళూరుకు మార్చడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

  • Author Soma Sekhar Published - 04:58 PM, Wed - 8 November 23
BREAKING: హైదరాబాద్‌లో జరగాల్సిన ఇండియా మ్యాచ్‌ బెంగళూరుకు మార్పు!

ప్రస్తుతం వరల్డ్ కప్ లో ఎదురులేకుండా దూసుకుపోతోంది టీమిండియా. ఆడిన 8 మ్యాచ్ ల్లో ఎనిమిదీ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ప్రస్తుత టీమిండియా ఫామ్ చూస్తే.. వరల్డ్ కప్ గెలవడం పెద్ద విషయమేమీ కాదు. ఇదిలా ఉండగా.. ప్రపంచ కప్ ముగిసిన నాలుగు రోజులకే ఆస్ట్రేలియాతో 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఇందులో భాగంగా చివరిదైన 5వ టీ20 మ్యాచ్ ను హైదరాబాద్ వేదికగా ఆడాల్సి ఉండగా.. ఆ మ్యాచ్ ను బెంగళూరుకు మార్చినట్లు తెలుస్తోంది. మరి హైదరాబాద్ లో జరగాల్సిన మ్యాచ్ బెంగళూరుకు మార్చడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన నాలుగు రోజులకే మరో సిరీస్ లో పాల్గొనబోతోంది టీమిండియా. ఆసీస్ తో స్వదేశంలో 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా నవంబర్ 23న జరిగే తొలి టీ20 మ్యాచ్ విశాఖపట్నంలో జరగనుంది. ఆ తర్వాత వరుసగా తిరువనంతపురం, గుహవాటి, నాగపూర్ వేదికగా మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక చివరిదైన 5వ టీ20 మ్యాచ్ కు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియం వేదికగా నిర్ణయించారు. కానీ ఈ మ్యాచ్ ను హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మార్చారు.

దానికి కారణం.. డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఫలితాల వెల్లడి ఉండటమే. మ్యాచ్ కూడా ఇదే రోజున ఉండటంతో.. ఇటు మ్యాచ్ కు ఫలితాలకు సంబంధించి భద్రత ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని వేదికను మార్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. ఇప్పటికే వరల్డ్ కప్ లో టీమిండియా మ్యాచ్ లను సొంత గ్రౌండ్ లో చూడలనుకున్న హైదరాబాదీలకు నిరాశ ఎదురుకాగా.. తాజాగా ఈ మ్యాచ్ ను బెంగళూరుకు మార్చడంతో.. వారిలో అసంతృప్తి మరింతగా పెరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు అధికారులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి