iDreamPost

IND vs AFG: ఆఫ్ఘాన్ సిరీస్​కు టీమ్ ప్రకటన.. రాహుల్ సహా మరో ఐదుగురు స్టార్లకు షాక్!

  • Published Jan 08, 2024 | 8:59 AMUpdated Jan 08, 2024 | 8:59 AM

ఆఫ్ఘానిస్థాన్​తో జరిగే మూడు టీ20ల సిరీస్​కు భారత టీమ్​ను ప్రకటించారు. అయితే కేఎల్ రాహుల్​తో పాటు మరో ఐదుగురు స్టార్లకు సెలక్టర్లు షాకిచ్చారు.

ఆఫ్ఘానిస్థాన్​తో జరిగే మూడు టీ20ల సిరీస్​కు భారత టీమ్​ను ప్రకటించారు. అయితే కేఎల్ రాహుల్​తో పాటు మరో ఐదుగురు స్టార్లకు సెలక్టర్లు షాకిచ్చారు.

  • Published Jan 08, 2024 | 8:59 AMUpdated Jan 08, 2024 | 8:59 AM
IND vs AFG: ఆఫ్ఘాన్ సిరీస్​కు టీమ్ ప్రకటన.. రాహుల్ సహా మరో ఐదుగురు స్టార్లకు షాక్!

ఈ ఏడాది జూన్​లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో పొట్టి ఫార్మాట్ మ్యాచులపై అన్ని జట్లు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. భారత జట్టు కూడా టీ20 ప్రపంచ కప్​ మీద దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఆఫ్ఘానిస్థాన్​తో మూడు టీ20ల సిరీస్​ను ప్లాన్ చేసింది. వరల్డ్ కప్​కు ముందు టీమిండియా ఆడే చివరి టీ20 సిరీస్ ఇదే కానుంది. ఆఫ్ఘాన్​ సిరీస్ తర్వాత ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. అనంతరం డైరెక్ట్​గా మెగాటోర్నీలో బరిలోకి దిగాల్సి ఉంటుంది. అందుకే ఆఫ్ఘాన్​తో సిరీస్​ను కీలకంగా భావిస్తోంది. ఈ సిరీస్​ కోసం సెలక్షన్ కమిటీ ఆదివారం 16 మంది సభ్యులతో కూడిన టీమ్​ను ప్రకటించింది. ఏడాది గ్యాప్ తర్వాత టీ20 జట్టులోకి కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇచ్చారు. హిట్​మ్యానే కెప్టెన్​గా ఉండనున్నాడు. అయితే అనూహ్యంగా కేఎల్ రాహుల్​తో పాటు మరో ఐదుగురు స్టార్లకు స్క్వాడ్​లో చోటు దక్కలేదు.

ఆఫ్గాన్​తో టీ20 సిరీస్ ఈ నెల 11వ తేదీ మొదలు కానుంది. 11న తొలి టీ20, 14న రెండో టీ20, 17న ఆఖరి టీ20 జరగనున్నాయి. అయితే గాయాల కారణంగా హార్దిక్​ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ ఈ సిరీస్​కు దూరమయ్యారు. టీమ్​లో కీలకంగా వ్యవహరిస్తాడని, చోటు పక్కా అని అనుకున్న కేఎల్ రాహుల్​కు సెలక్టర్లు షాకిచ్చారు. అతడితో పాటు వన్డేల్లో అదరగొడుతున్న శ్రేయస్ అయ్యర్​కూ మొండిచెయ్యి చూపారు. అలాగే స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా, యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్, స్పీడ్​స్టర్ దీపక్ చాహర్​కూ టీమ్​లో చోటు దక్కలేదు. వీళ్లలో జడేజా రీసెంట్​గా సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్​లో ఆడాడు. వెన్ను నొప్పి కారణంగా సఫారీలతో తొలి టెస్టుకు దూరమైన ఆల్​రౌండర్.. రెండో మ్యాచ్​లో బరిలోకి దిగినా బౌలింగ్ చేసే ఛాన్స్ రాలేదు. గాయం పూర్తిగా మానాలని జడ్డూను పక్కనపెట్టారా? లేదా టీ20ల్లో అతడి కంటే అక్షర్ పటేల్​ బెటర్ అనే ఉద్దేశంతో ఇలా చేశారా? అనేది క్లారిటీ లేదు. ఒకవేళ ఇంజ్యురీ గురించి ఆలోచిస్తే సౌతాఫ్రికాతో రెండో టెస్ట్​లో ఎందుకు ఆడించారో అర్థం కావడం లేదు.

shock for kl rahul

పర్సనల్ రీజన్స్ వల్ల సౌతాఫ్రికా టూర్ మధ్యలో నుంచే వచ్చేశాడు ఇషాన్ కిషన్. అయితే ఆఫ్ఘాన్​తో సిరీస్​కైనా అతడు అందుబాటులో ఉంటాడని అనుకుంటే అదీ సాధ్యపడలేదు. ఆరోగ్య కారణాల వల్లే ఈ సిరీస్​కు అతడు దూరమయ్యాడట. మెంటల్ ఫెటీగ్ (మానసికంగా అలసిపోవడం) వల్లే ఈ సిరీస్​లో ఇషాన్ ఆడట్లేదని సమాచారం. అతడి ప్లేస్​లో సంజూ శాంసన్​ను ఎంపిక చేశారు. వన్డే వరల్డ్ కప్​తో పాటు సౌతాఫ్రికా టూర్​లోనూ దుమ్మురేపిన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్​ను సెలక్ట్ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఫిట్​గానే ఉన్నా, ఏ ప్లేస్​లో ఆడేందుకైనా రెడీగా ఉన్నానని ప్రకటించినా రాహుల్​ను దూరం పెట్టడం కొత్త డిస్కషన్స్​కు తెరలేపింది. పేసర్ దీపక్ చాహర్​ కూడా ఈ సిరీస్​కు ఎంపిక చేసిన జట్టులో లేడు. తండ్రి అనారోగ్యం నేపథ్యంలో సౌతాఫ్రికా టూర్​కు చాహర్ దూరంగా ఉన్నాడు. ఆయన పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ సిరీస్​లోనూ ఆడొద్దని అతడు డిసైడ్ అయ్యాడట. మరి.. కేఎల్ రాహుల్ సహా పలువురు స్టార్లకు సెలక్టర్లు షాకివ్వడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుబ్​మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్​ శర్మ (వికెట్ కీపర్), సంజూ శాంసన్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్​దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేష్ కుమార్.

ఇదీ చదవండి: David Warner: వార్నర్ షాకింగ్ కామెంట్స్.. T20లకు కూడా వీడ్కోలు చెబుతాడా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి