iDreamPost

న్యూజిలాండ్ పర్యటన

న్యూజిలాండ్ పర్యటన

ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుతో మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ ముగిసిన మరుసటి రోజు బెంగళూరు నుండి నేరుగా న్యూజిలాండ్ పర్యటనకు భారత జట్టు బయలుదేరుతుంది.ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచ కప్పు సన్నాహకంగా అన్ని విభాగాలను పటిష్టం చేయడం పై భారత సెలక్టర్లు దృష్టి పెట్టారు.

గత శ్రీలంక సిరీస్ లో ఒక మ్యాచ్ ఆడే అవకాశం వచ్చిన కేరళ వికెట్ కీపర్ సంజు శాంసన్ కు మరొకసారి నిరాశ ఎదురయింది. రెండు సిరీస్ ల నుండి జట్టులో స్థానం పొందిన శాంసన్ ఇప్పటివరకు కేవలం రెండు టి20 మ్యాచ్లే ఆడే అవకాశం వచ్చింది.రిషబ్ పంత్ గాడిలో పడుతున్న దశలో సంజు శాంసన్ తుది జట్టులో ఆడే అవకాశం లేకపోవడంతో అతనిపై వేటు పడింది.
తాజాగా జరిగిన శ్రీలంక సిరీస్ లో ఓపెనర్ రోహిత్ శర్మ,ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీలకు విశ్రాంతి నిచ్చిన సెలెక్టర్లు తిరిగి జట్టులో స్థానం కల్పించారు.వెన్నునొప్పి గాయం నుంచి కోలుకొని హార్దిక్ పాండ్యా స్థానంలో ఆల్ రౌండర్ కోటాలో శివం దూబే తమ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

యువ బ్యాట్స్ మెన్లు శ్రేయస్ అయ్యర్,మనీష్ పాండే జట్టులో కొనసాగనున్నారు.బౌలింగ్ విభాగంలో నెలల తర్వాత జట్టులో స్థానం సంపాదించిన స్పీడ్ బౌలర్ బూమ్రా తోపాటు యువ కెరటాలైన నవదీప్ సైని,శార్దూల్ ఠాకూర్ తమ స్థానాలను నిలుపుకున్నారు.

విదేశీ పర్యటన కావడంతో 15 మంది సభ్యులకు బదులుగా 16 మంది సభ్యులను ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.టి20 సిరీస్ ముగిసిన తర్వాత 3 వన్డే,2 టెస్టు మ్యాచులు కోసం జట్టును తర్వాత ఎంపిక చేయనున్నారు.

టీ20 జట్టులో సభ్యులు: విరాట్ కోహ్లీ (కెప్టెన్),రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్),శిఖర్ ధావన్,కేఎల్ రాహుల్,శ్రేయస్ అయ్యర్,మనీష్ పాండే,రిషబ్ పంత్,శివం దూబే,మహమ్మద్ షమీ,జస్ ప్రీత్ బుమ్రా,నవదీప్ సైని, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్,యజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి