iDreamPost

టీ20 వరల్డ్ కప్‌లో తలపడనున్న భారత్- పాక్.. మ్యాచ్ జరిగేది ఎక్కడంటే?

క్రికెట్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చే మ్యాచ్ ఏదైనా ఉందంటే అది కేవలం భారత్-పాక్ మ్యాచ్ మాత్రమే. మరో సారి టీ20 వరల్డ్ కప్ లో దాయాదులతో సమరం జరుగనుంది. ఆ మ్యాచ్ ఎక్కడ జరుగనుందంటే?

క్రికెట్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చే మ్యాచ్ ఏదైనా ఉందంటే అది కేవలం భారత్-పాక్ మ్యాచ్ మాత్రమే. మరో సారి టీ20 వరల్డ్ కప్ లో దాయాదులతో సమరం జరుగనుంది. ఆ మ్యాచ్ ఎక్కడ జరుగనుందంటే?

టీ20 వరల్డ్ కప్‌లో తలపడనున్న భారత్- పాక్.. మ్యాచ్ జరిగేది ఎక్కడంటే?

క్రికెట్ హిస్ట్రీలో భారత్- పాక్ మ్యాచ్ కు ఉండే క్రేజ్ ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. అది ఏ ఫార్మాట్ అయినా దాయాదులతో పోరు అంటే ప్రపంచమంతా ఉత్కంఠతతో ఎదురు చూస్తుంటుంది. భారత్- పాక్ మధ్య జరిగే హై వోల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇటీవల స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్ లో దాయాదులను చిత్తుచిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి భారత్ పాక్ తలపడబోతున్నాయి. జూన్ లో జరుగనున్న టీ20 వరల్డ్ కప్ లో భారత్-పాక్ పోరుకు రంగం సిద్ధమైంది. కాగా ఆ మ్యాచ్ ఎక్కడ జరుగనుందంటే?

క్రికెట్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్. టీ20 వరల్డ్ కప్ లో మ‌రోసారి భారత్, పాక్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఎన్నో భావోద్వేగాలు, గెలుపు కోసం రెచ్చగొట్టేలా చేసే చేష్టలు దాయాదుల మ్యాచ్ లో కనిపిస్తాయి. ఫ్యాన్స్ కు ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఫుల్ కిక్ ఇస్తుంది. కాగా వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీలో.. న్యూయార్క్ సిటీలోని పాప‌ప్ స్టేడియం వేదిక‌గా భార‌త్, పాక్ ఢీకొనబోతున్నాయి. కాగా ఈ వేదికను తాత్కాలికంగానే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే భారత్, పాక్ మ్యాచ్ వేదికను ఐసీసీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.

కానీ ప్రవాస భారతీయులు అధికంగా ఉండే న్యూయార్క్ సిటీలో పాక్ దేశస్తులు కూడా నివసిస్తుంటారు. ఈ కారణంగానే భారత్-పాక్ మ్యాచ్ ను న్యూయార్క్ లో నిర్వ‌హించేందుకు సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే ఐసీసీ అధికారులు ఆయా దేశాల్లో పర్యటించి షెడ్యూల్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో 20 జ‌ట్లు పాల్గొనబోతున్నాయి. ఈసారి వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఉగాండా, ప‌పువా న్యూ గినియా వంటి చిన్న జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. టీ20 వరల్డ్ కప్ లో మరోసారి భారత్-పాక్ పోరుకు సిద్ధమవుతుండడంతో ఇరు దేశాల ఫ్యాన్స్ ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి