iDreamPost

అత్యంత చెత్త కెప్టెన్​గా పాండ్యా.. 17 ఏళ్ల ఘనమైన రికార్డును నాశనం చేశాడు!

  • Author singhj Published - 09:35 AM, Mon - 14 August 23
  • Author singhj Published - 09:35 AM, Mon - 14 August 23
అత్యంత చెత్త కెప్టెన్​గా పాండ్యా.. 17 ఏళ్ల ఘనమైన రికార్డును నాశనం చేశాడు!

వరుసగా రెండు మ్యాచుల్లో నెగ్గి పుంజుకున్నట్లే కనిపించిన భారత జట్టు భంగపడింది. వెస్టిండీస్​తో చివరి టీ20 మ్యాచ్​లో ఓడి సిరీస్​ను 2-3 తేడాతో కోల్పోయింది. నాలుగో మ్యాచ్​లో పరుగుల వరద పారించిన అదే వేదికలో టీమిండియా తగినంత స్కోరు చేయలేకపోయింది. స్టార్ బ్యాటర్లు బ్రెండన్ కింగ్, నికోలస్ పూరన్ మెరుపులతో కరీబియన్ జట్టు అలవోకగా టార్గెట్​ను ఛేజ్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ వృథా అయింది. ఈ ఓటమితో భారత్ పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన పర్యాటక జట్టు.. 9 వికెట్లకు 165 రన్స్ చేసింది. సూర్యకుమార్ (65) టాప్ స్కోరర్​గా నిలిచాడు.

విండీస్ జట్టు బౌలర్లలో రొమారియో షెఫర్డ్ (4/31), అకీల్ హొసేన్ (2/24)లు భారత్​ను బాగా కట్టడి చేశారు. ఛేదనలో బ్రెండన్ కింగ్ (85 నాటౌట్), పూరన్ (47) మెరవడంతో టార్గెట్​ను వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఆతిథ్య జట్టును కట్టడి చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఒక్క కుల్దీప్ యాదవ్ తప్పితే మిగతా అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. స్పిన్నర్ చాహల్ వేసిన 4 ఓవర్లలో ఏకంగా 51 రన్స్ ఇచ్చుకున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. బౌలింగ్ వైఫల్యం మ్యాచ్​లో కొట్టొచ్చినట్లు కనిపించింది.

విండీస్ చేతిలో సిరీస్​ ఓటమితో భారత్ పలు చెత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. గత 25 నెలల కాలంలో టీమిండియా ఓడిన టీ20 సిరీస్ ఇదే కావడం గమనార్హం. వెస్టిండీస్​ చేతిలో ద్వైపాక్షిక సిరీస్​ను కోల్పోవడం గత 17 ఏళ్లలో ఇదే తొలిసారి. ఒక టీ20 సిరీస్​లో భారత్ మూడు మ్యాచ్​లు ఓడిపోవడం కూడా ఇదే ఫస్ట్ టైమ్. ఈ చెత్త రికార్డుల గురించి ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో భారత ఫ్యాన్స్ అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్​గా హార్దిక్ పాండ్యా పనికిరాడని అంటున్నారు. వెస్టిండీస్ మీద సిరీస్ ఓటమి అనేదే లేకుండా 17 ఏళ్లుగా ఉన్న ఘనమైన రికార్డును అతడు నాశనం చేశాడని విమర్శిస్తున్నారు. పాండ్యా ఓ చెత్త కెప్టెన్ అని ట్రోల్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి