iDreamPost

చరిత్ర సృష్టించిన టీమిండియా.. టెస్టు క్రికెట్​ హిస్టరీలోనే తొలి జట్టుగా..!

  • Author singhj Published - 10:05 AM, Mon - 24 July 23
  • Author singhj Published - 10:05 AM, Mon - 24 July 23
చరిత్ర సృష్టించిన టీమిండియా.. టెస్టు క్రికెట్​ హిస్టరీలోనే తొలి జట్టుగా..!

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మరింత రసవత్తరంగా మారింది. గత రెండ్రోజులు ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ రసకందాయంలో పడింది. నాలుగో రోజు ఆటలో విండీస్ తమ తొలి ఇన్నింగ్స్​లో 255 రన్స్​కు ఆలౌట్ అయింది. ఆ తర్వాత తమ రెండో ఇన్నింగ్స్​ను మొదలుపెట్టిన భారత్.. 2 వికెట్లకు 181 రన్స్ వద్ద ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేసింది. దీంతో ఆతిథ్య కరీబియన్ టీమ్ ముందు 365 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. అయితే ఛేజింగ్​కు దిగిన ఆ టీమ్​ను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు.

క్రీజులో కుదురుకున్నట్లే కనిపించిన ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్​వైట్ (28)తో పాటు కిర్క్ మెకంజీని స్వల్ప వ్యవధిలో పెవిలియన్​కు పంపాడు అశ్విన్. యువ బ్యాటర్ త్యాగ్​నారాయణ్​ చందర్​పాల్ (24 బ్యాటింగ్), బ్లాక్​వుడ్ (20 బ్యాటింగ్) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్​లో నెగ్గాలంటే వెస్టిండీస్ మరో 289 రన్స్ చేయాలి. అదే భారత్ నెగ్గాలంటే మిగిలిన 8 వికెట్లు తీయాల్సి ఉంటుంది. ఇక, ఓవర్​నైట్ స్కోరు 229/5తో నాలుగో రోజు ఆటను మొదలుపెట్టిన విండీస్​ను మమ్మద్ సిరాజ్ చావుదెబ్బ తీశాడు. ఆ జట్టు ఆఖరి నలుగురు బ్యాట్స్​మెన్​ను వెంట వెంటనే ఔట్ చేశాడీ స్టార్ పేసర్. దీంతో టీమిండియాకు 183 రన్స్ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత భారత్ ఇన్నింగ్స్​ను ధాటిగా ఆరంభించింది.

ఓపెనర్లు రోహిత్ శర్మ (44 బంతుల్లో 57), యశస్వి జైస్వాల్ (30 బంతుల్లో 38) ధనాధన్ బ్యాటింగ్​తో భారత్​కు శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత వచ్చిన శుబ్​మన్ గిల్ (29 నాటౌట్) కాస్త నెమ్మదిగా ఆడినా.. ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 54 నాటౌట్) టీ20ల తరహాలో రెచ్చిపోయాడు. దీంతో భారత్ 24 ఓవర్లలోనే 181 రన్స్ చేసి ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేసింది. ఈ మ్యాచ్​లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఒక అరుదైన రికార్డును భారత జట్టు తన పేరు మీద లిఖించుకుంది. 12.2 ఓవర్లలోనే 100 రన్స్ చేయడం ద్వారా టెస్టు క్రికెట్​లో అత్యంత వేగంగా వంద పరుగులు చేసిన టీమ్​గా భారత్ నిలిచింది. ఇప్పటిదాకా ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉంది. బంగ్లాదేశ్​పై 13.2 ఓవర్లలో 100 రన్స్ చేసింది లంక.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి