iDreamPost

CM రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. తెలంగాణలో మరో కొత్త జిల్లా..

  • Published Apr 06, 2024 | 8:19 AMUpdated Apr 06, 2024 | 8:19 AM

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..

  • Published Apr 06, 2024 | 8:19 AMUpdated Apr 06, 2024 | 8:19 AM
CM రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. తెలంగాణలో మరో కొత్త జిల్లా..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి పాలనలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఓ వైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని నెవవేరుస్తూనే.. మరోవైపు రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలానే గతంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం పది జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని పునర్విభజన చేసి.. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో  33 జిల్లాలు ఉన్నాయి. అయితే మొదట బీఆర్ఎస్ గవర్నమెంట్ రాష్ట్రాన్ని 31 జిల్లాలుగా పునర్విభజన చేసింది. ఆ తర్వాత ప్రజా డిమాండ్ మేరకు ములుగు, నారయణపేట జిల్లాలను కూడా ప్రకటించటంతో ప్రస్తుతం మొత్తం జిల్లాల సంఖ్య 33కు చేరింది.

New District added into Telangana

అయితే.. ఇప్పుడు మరో కొత్త జిల్లా ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. అది ఎక్కడో కాదు.. జంటనగరాల్లో ఒకటైన సికింద్రాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తులు వస్తుండగా.. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్టుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ.. సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా పవన్ కుమార్ సికింద్రాబాద్ ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి గౌడ్ వినతి పత్రం అందజేసినట్లు తెలుస్తోంది.

గత కొంత కాలంగా సికింద్రాబాద్‌ను జిల్లా చేయాలంటూ గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్న విషయాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. అయితే.. పవన్ కుమార్ గౌడ్ విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్టు ప్రచారం జరుగుతోంది. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో సికింద్రాబాద్ కొత్త జిల్లా ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించి.. సానుకూల నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ హామీ కూడా ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. మరి ఇది వాస్తవమో కాదో తెలియాలంటే కాస్త సమయం పడుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి