iDreamPost

అలా రోడ్డేశారో లేదో.. ఇలా కొట్టేశారు.. వీళ్ల కక్కుర్తి పాడుగాను

నగలు, ఖరీదైన వస్తులు, లేదంటే బంగారం దోచుకెళ్లే వారి గురించి విన్నారు. కానీ ఏకంగా ప్రభుత్వ ఖజానాకు గండిపడే విధంగా రోడ్డును ఎత్తికెళ్లే వారి గురించి విన్నారా.. ఏంటీ రోడ్డా? దాన్ని ఎలా దొంగిలిస్తారనే కదా మీ డౌట్.. అయితే చదివేయండి.

నగలు, ఖరీదైన వస్తులు, లేదంటే బంగారం దోచుకెళ్లే వారి గురించి విన్నారు. కానీ ఏకంగా ప్రభుత్వ ఖజానాకు గండిపడే విధంగా రోడ్డును ఎత్తికెళ్లే వారి గురించి విన్నారా.. ఏంటీ రోడ్డా? దాన్ని ఎలా దొంగిలిస్తారనే కదా మీ డౌట్.. అయితే చదివేయండి.

అలా రోడ్డేశారో లేదో.. ఇలా కొట్టేశారు.. వీళ్ల కక్కుర్తి పాడుగాను

దొంగతనాలు చేయడంలో శృతి మించి పోతున్నారు దొంగలు. ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి, డబ్బులు దోచుకెళ్లిపోతుంటారు. మరికొంత మంది నడి రోడ్డులో జేబులు కొట్టేస్తుంటారు. కానీ ఇప్పుడు చోరీలు చూస్తుంటే మాత్రం బాబోయ్ అనిపించక మానదు. ఎందుకంటే.. రైల్వే ట్రాకులు ఎత్తుకెళిపోతున్నారు. బ్రిడ్జీలను లేపేస్తున్నారు. అంతేనా బస్టాండ్లను, బస్సులను కూడా కొట్టేస్తున్నారు. జన సంచారాల్లో ఉండే సెల్ ఫోన్ టవర్లను చాక చక్యంగా విప్పదీసి.. పట్టుకెళ్లిపోతున్నారు. ఇదంతా ఓ ఎత్తైతే.. ఈ దొంగలు ఏకంగా రోడ్డునే ఎత్తుకెళ్లిపోయి వార్తల్లో నిలిచారు. ఇంతకు ఈ వింత దొంగతనం ఎక్కడ జరిగిందంటే.. బీహార్‌లో.

అసలు రోడ్లను ఎత్తుకెళ్లడం గురించి విన్నారా.. రహదారిని ఎలా చోరీ చేస్తారనే సందేహం కూడా కలిగే ఉంటుంది కదా. కానీ నిజమే దోచేందుకు లేదేది అనర్హం అన్నట్లు తయారయ్యారు. ఇంతకు ఏమైందంటే.. ముఖ్యమంత్రి సడక్ గ్రామ్ యోజన పథకం కింద జహానాబాద్ జిల్లాలోని ఔదాన్ గ్రామంలో రోడ్డు వేస్తున్నారు. ఈ రోడ్డు పనులకు మూడు నెలల క్రితమే స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. అయితే రోడ్డుపై వేసిన సిమెంట్, ఇసుక వంటి మిశ్రమాన్ని తవ్వుకుంటూ వెళ్లిపోయారు స్థానికులు. ఏకంగా మూడు కిలోమీటర్ల మేర రోడ్డును తుడిచిపెట్టేశారు.

అంతేకాకుండా రహదారి నిర్మాణం కోసం ఉంచిన సామాగ్రిని కూడా పట్టుకెళ్లిపోయారు. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై పోలీసులు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఈ దొంగతనం చూస్తుంటే వీరి కక్కుర్తి పాడుగానూ, కొంత మంది ఓరీ మీ దుంపలు తెగ.. ఇలా ఉన్నారేంట్రా అని కామెంట్స్ చేస్తున్నారు.  మరీ మీ అభిప్రాయలేమిటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి