iDreamPost

వీడియో: ఇళయరాజా కూతురు ఇంత బాగా పాడుద్దా? పాపం గుర్తింపు రాకుండానే!

సినీ ఇండస్ట్రీలో ది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఠక్కున చెప్పే పేరు ఇళయ రాజా. ఆయన వారసులు సైతం ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు. ఇటీవల ఇళయ రాజా ఇంట్లో విషాదం నెలకొంది. ఇళయ రాజా ముద్దుల తనయ.. కన్నుమూసిన సంగతి విదితమే. ఆమె ఎంత గొప్ప సింగర్ అంటే..

సినీ ఇండస్ట్రీలో ది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఠక్కున చెప్పే పేరు ఇళయ రాజా. ఆయన వారసులు సైతం ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు. ఇటీవల ఇళయ రాజా ఇంట్లో విషాదం నెలకొంది. ఇళయ రాజా ముద్దుల తనయ.. కన్నుమూసిన సంగతి విదితమే. ఆమె ఎంత గొప్ప సింగర్ అంటే..

వీడియో: ఇళయరాజా కూతురు ఇంత బాగా పాడుద్దా? పాపం గుర్తింపు రాకుండానే!

తన పాటలతో సినీ ప్రియులను ఓలలాడించిన వాయిస్ ఆమెది. ఆమె పాడుతూ ఉంటే.. వీనుల విందుగా ఉంటుంది. పాటలే కాదూ ఆమె కూడా చాలా సున్నిత మనస్కురాలు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కుమార్తె అయినప్పటికీ.. సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చింది. కానీ ఊహించని విధంగా అందర్ని శోక సంద్రంలో ముంచేస్తూ.. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఆమె ఎవరో కాదూ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయ రాజా గారాల పట్టి.. భవతారిణి. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటూ ఇటీవల తుది శ్వాస విడిచింది. ఆమె మరణ వార్తతో కోలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది.

భవతారిణి చాలా టాలెంటర్. చిన్న నాటి నుండే పాటలు పాడేది. అయితే ఆమె సోలో ప్లే బ్యాక్ సింగర్‌గా మారింది మాత్రం రాసయ్య అనే మూవీతోనే. భారతి చిత్రంలోని మయిల్ పోలా పొన్ను పొన్ను ఒన్ను అనే పాటకు ఆమె నేషనల్ అవార్డును గెలుచుకుంది. ఆమెకు సంగీతంలో మంచి పట్టు ఉంది. పాటలే కాదూ.. పలు సినిమాలకు మ్యూజిక్ అందించింది. తండ్రి, సోదరులు యువన్ శంక్ రాజా, కార్తీక్ రాజా బాటలోనే పయనిస్తూ సంగీత దర్శకురాలిగా మారింది. భవతారిణి. మిత్ర్, అవునా (తెలుగు), ఫిర్ మిలేంగే వంటి పలు సినిమాలకు బాణీలు సమకూర్చింది. తెలుగులో ఆమె కేవలం రెండంటే రెండు పాటలు పాడింది. అనుమానాస్పదం అనే సినిమాలో ‘రేల రేల రేలా’ సాంగ్ అందులో ఒకటి.

‘గుండెల్లో గోదారి’ మూవీలో నను నీతో నిను నాతో కలిపింది గోదారి అనే సాంగ్ తెలుగులో ఆమెకు చివరిది. ఈ పాట ఎంత సూపర్ హిట్ కొట్టిందో అందరికీ తెలుసు. భవతారిణి దక్షిణాది భాషలతో పాటు బీటౌన్ చిత్రాల్లో పాటలు పాడింది. సుమారు 100కు పైగా పాటలకు గాత్రం అందించినా.. ఆమెకు ఎందుకో తగినంత గుర్తింపు రాలేదు. తండ్రి ఇళయ రాజా, సోదరులు యువన్ శంకర్, మోహన్ రాజా సంగీతం అందించిన మూవీస్‌లోనే ఎక్కువ పాటలు పాడటం వల్లో, ఇతర కారణాలో తెలియదు కానీ.. బయట మ్యూజిక్ డైరెక్టర్ల నుండి కూడా ఆమె అవకాశాలు అందుకోలేదు. కానీ ఆమెది చాలా స్వీట్ వాయిస్. తన తండ్రి చేసిన అనేక షోల్లో ఆమె పాడింది. భవతారిణి ఎంత అద్భుతంగా పాడుతుందో ఈ వీడియో ఓ ఉదాహరణ. ఈ వీడియో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతుంది కోలీవుడ్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి