iDreamPost

వీడియో: గ్రౌండ్ లోనే గొడవకు దిగిన పాక్ ఆటగాళ్లు.. ఢీ అంటే ఢీ అంటూ!

Iftikhar Ahmed-Asad Shafiq: పాకిస్తాన్ ప్లేయర్లు ఇద్దరూ గ్రౌండ్ లోనే కొట్టుకునేందుకు సిద్ధమైయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Iftikhar Ahmed-Asad Shafiq: పాకిస్తాన్ ప్లేయర్లు ఇద్దరూ గ్రౌండ్ లోనే కొట్టుకునేందుకు సిద్ధమైయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీడియో: గ్రౌండ్ లోనే గొడవకు దిగిన పాక్ ఆటగాళ్లు.. ఢీ అంటే ఢీ అంటూ!

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ల్లో అప్పుడప్పుడు గ్రౌండ్ లోనే గొడవలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సార్లు ప్లేయర్లు బాహటంగానే ముష్టియుద్ధం సాగించేందుకు సిద్దమవుతుంటారు. తాజాగా పాకిస్తాన్ ప్లేయర్లు ఇద్దరూ గ్రౌండ్ లోనే కొట్టుకునేందుకు సిద్ధమైయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ ఇఫ్తికర్ అహ్మద్, మరో పాక్ ఆటగాడు అయిన అసద్ షఫిక్ తో కోట్లాటకు దిగాడు.

సింధ్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా బుధవారం లార్కణ ఛాలెంజర్స్ వర్సెస్ కరాచీ ఘాజీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ లీగ్ కరాచీ ఘాజీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు ఇఫ్లికర్ అహ్మద్. అటు లార్కణ ఛాలెంజర్స్ టీమ్ కు కెప్టెన్ గా అసద్ షఫిక్ ఉన్నాడు. వీరిద్దరి మధ్య తాజాగా జరిగిన మ్యాచ్ లో గొడవ జరిగింది. ఇఫ్తికర్ అహ్మద్ బౌలింగ్ లో షఫిక్ వరుసగా ఓ సిక్స్, ఫోర్ బాదాడు. దీంతో సహనం కోల్పోయాడు అహ్మద్. అయితే ఆ తర్వాత బంతికే షఫిక్ వికెట్ తీశాడు. దీంతో రెచ్చిపోయిన అహ్మద్ కోపంతో షఫిక్ పై నోరుపారేసుకున్నాడు. అతడిని ఔట్ చేసిన ఆనందంలో తిడుతూ.. మీదకు దూసుకెళ్లాడు.

ఇక ఇటు షఫిక్ సైతం అంతే ధీటుగా బదులిస్తూ.. ముందుకు వెళ్లాడు. దీంతో సహచర ఆటగాళ్లు, అంపైర్ జోక్యం చేసుకోవడంతో.. వాతావరణం కాస్త చల్లబడింది. లేదంటే.. గ్రౌండ్ లోనే కొట్టుకునే పరిస్థితి వచ్చేది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఇఫ్తికర్ పై క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అనవసరంగా గొడవకు దిగావు అంటూ విమర్శిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ టీమ్ నిర్ణీత ఓవర్లలో 160 పరుగులు చేయగా.. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లార్కాణ టీమ్ 92 రన్స్ కే కుప్పకూలింది. ఇక ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు ఇఫ్తికర్ అహ్మద్. బ్యాటింగ్ లో 69 రన్స్ చేయడంతో పాటుగా బౌలింగ్ లో 3 వికెట్లు కూడా పడగొట్టాడు. అయితే ఈ వివాదంపై మ్యాచ్ అనంతరం స్పందించాడు అహ్మద్. అసద్ షఫిక్ కు క్షమాపణలు చెప్పినట్లు తెలిపాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి