iDreamPost

HYDలోని ఆ ఏరియాలో పెట్టుబడి పెడితే కనక వర్షమే!

స్థిరాస్తిపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? తక్కువ ఇన్వెస్ట్ మెంట్ తో ఎక్కువ లాభాలను పొందాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ లోని ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో అధిక లాభాలుంటాయంటున్నారు నిపుణులు.

స్థిరాస్తిపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? తక్కువ ఇన్వెస్ట్ మెంట్ తో ఎక్కువ లాభాలను పొందాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ లోని ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో అధిక లాభాలుంటాయంటున్నారు నిపుణులు.

HYDలోని ఆ ఏరియాలో పెట్టుబడి పెడితే కనక వర్షమే!

హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా అవతరిస్తున్న వేళ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిపోయింది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ కు క్యూ కడుతున్నాయి. ఈ కారణం చేత నగరంతో పాటు శివారు ప్రాంతాలు కూడా ఘణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఇప్పుడు పెట్టుబడి పెట్టినట్లైతే రెండు మూడేళ్లలోనే మీ డబ్బు రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు మార్కెట్ నిపుణులు. మీరు స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ లోని ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో కనకవర్షం కురవడం ఖాయమంటున్నారు నిపుణులు.

హైదరాబాద్ నగరం నలు దిశలా డెవలప్ అవుతూ దూసుకెళ్తోంది. నగరానికి ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, సౌకర్యాలు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిస్తున్నాయి. సిటీకి అతి దగ్గరలో ఉన్న పటాన్ చెరువులో స్థలాల ధరలు నగరం నడిబొడ్డున ఉన్న ప్రాంతాలతో పోలిస్తే కాస్త తక్కువగానే ఉన్నాయి. పటాన్ చెరువులో ఫార్మా కంపెనీలు, పరిశ్రమలకు కొదవ లేదు. వందలాది మంది ఆ ప్రాంతంలో ఉపాధి పొందుతున్నారు. అంతేగాక ఇటీవల మెట్రో విస్తరణలో భాగంగా పటాన్ చెరువు ప్రాంతానికి మెట్రో లైన్ నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ ఏరియాలో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. ట్రాన్స్ పోర్టు విషయంలో కూడా అనుకూల పరిస్థితులు కలిగి ఉంది పటాన్ చెరువు. తక్కువ దూరంలోనే రైల్వే, మెట్రో స్టేషన్లను అందుబాటులో ఉండడం, ఆర్టీసీ బస్ సౌకర్యాలను కలిగి ఉండడం కలిసొచ్చే అంశం.

ఔటర్ రింగ్ రోడ్ కు దగ్గర్లో ఉండడం, జాతీయ రహదారులతో కనెక్టివిటీ ఇవన్నీ కూడా పటాన్ చెరువులో స్థలాలపై ఇన్వెస్ట్ చేసేందుకు అనుకూల అంశాలు. ప్రస్తుతం ఈ ఏరియాలో ప్లాట్స్ ధరల విషయానికి వస్తే.. స్క్వేయర్ ఫీట్ కు రూ. 3,350 ధర పలుకుతోంది. మీరు 2బీహెచ్ కే కోసం 900 స్క్వేయర్ ఫీట్ స్థలాన్ని తీసుకున్నట్లైతే రూ. 30,15, 000 అవుతుంది. ఈ క్రమంలో పటాన్ చెరువు అభివృద్ధికి చిరునామాగా మారుతున్న తరుణంలో అక్కడి స్థలాలపై ఇన్వెస్ట్ చేస్తే.. ఫ్యూచర్ లో రెట్టింపు లాభం వచ్చే అవకాశాలున్నాయి. ఓ వ్యక్తి ఇప్పుడున్న రూ. 3350 ధరకు 900 స్క్వేయర్ ఫీట్ స్థలాన్ని కొనుగోలు చేసినట్లైతే.. కొంతకాలం తరువాత స్వ్కేయర్ ఫీట్ ధర రూ. 6000 వేలకు పెరిగిందనుకుందాం. అప్పుడు ఆ స్థలం విలువ 54 లక్షలకు చేరుకుంటుంది. ఈ లెక్కన మీరు దాదాపు రెట్టింపు లాభాలను అందిపుచ్చుకున్నట్లే అవుతుందంటున్నారు మార్కెట్ రంగ నిపుణులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి