iDreamPost

అధిక రాబడిని కోరుకుంటున్నారా!.. అయితే ఈ రెండు పథకాల్లో పెట్టుబడి పెట్టండి!

మీరు సురక్షితమైన పెట్టుబడులతో అధిక లాభాలను పొందాలనుకుంటున్నారా? అయితే ఈ రెండు రకాల స్కీముల్లో ఇన్వెస్ట్ చేసి అధిక రాబడులు పొందండి.

మీరు సురక్షితమైన పెట్టుబడులతో అధిక లాభాలను పొందాలనుకుంటున్నారా? అయితే ఈ రెండు రకాల స్కీముల్లో ఇన్వెస్ట్ చేసి అధిక రాబడులు పొందండి.

అధిక రాబడిని కోరుకుంటున్నారా!.. అయితే ఈ రెండు పథకాల్లో పెట్టుబడి పెట్టండి!

ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. ప్రస్తుత రోజుల్లో ప్రతి పనికి డబ్బే అవసరం. కోటలు మేడలు కట్టాలన్నా, కాటికి నలుగురు మోయాలన్నా చేతిలో కాసులు ఉండాల్సిదే. డబ్బుతోనే సమాజంలో కీర్తి ప్రతిష్టలు దక్కుతున్నాయి. అయితే డబ్బు సంపాదనకు అనేక మార్గాలున్నాయి. ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదించుకోవచ్చు. వ్యాపారాలు చేస్తూ కూడా డబ్బును సంపాదించుకోవచ్చు. మరికొంత మంది స్టాక్ మార్కెట్ లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసి లాభాలను పొందుతుంటారు. అయితే ఇది అన్ని వేళలో సురక్షితం కాదు. కొన్ని కొన్ని సార్లు రిస్క్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు పెట్టిన పెట్టుబడిపై అధిక రాబడి రావాలని కోరుకుంటే ఈ రెండు స్కీముల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అవేంటంటే?

సురక్షితమైన రాబడులు రావాలంటే బ్యాంకుల్లో, పోస్టాఫిసుల్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి ఆదాయం లభిస్తుంది. వీటిల్లో అందుబాటులో ఉన్న డిపాజిట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందొచ్చు. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్ డ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు పొందొచ్చు. తన కస్టమర్లను ఆకర్షించేందుకు ఇటీవల వడ్డీరేట్లను పెంచింది. అనేక మంది వ్యక్తులు ఎస్బీఐ ఎఫ్డీ లేదా పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్ స్కీమ్స్ వంటి సురక్షితమైన పెట్టుబడి పథకాలపై మొగ్గుచూపుతున్నారు.

ఎస్బీఐ రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీరేటును 3.5 శాతం నుంచి 7 శాతం మధ్యలో ఆఫర్‌ చేస్తున్నది. సీనియర్‌ సిటిజన్లకు అదనంగా మరో అరశాతం చెల్లిస్తున్నది. మీరు ఎస్బీఐలో ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే మంచి రాబడులను అందుకోవచ్చు. అదేవిధంగా పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్ స్కీమ్ వడ్డీ రేట్లను ప్రభుత్వం పెంచింది. టర్మ్ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం 10 బేసిస్ పాయింట్లు పెంచింది. మూడేళ్ల కాలంలో వడ్డీ రేటును 7 శాతం నుంచి 7.10 శాతానికి పెంచారు. కొత్త వడ్డీ రేట్లు జనవరి 1, 2024 నుండి అమలులోకి వచ్చాయి. ఇవి మార్చి 31, 2024 వరకు అమల్లో ఉండనున్నాయి. ఈ క్రమంలో మీరు ఎస్బీఐలో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసినా లేదా పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన ఎక్కవ వడ్డీ రేట్ల మూలంగా మీకు అధిక రాబడులు వస్తాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి