iDreamPost

శీతాకాలంలో ఆల్కహాల్ సేవిస్తే.. దగ్గు, జలుబు తగ్గుతాయా..? నిజమెంత..?

చలి చంపుతున్న చమక్కులో గిలిగింత పెట్టిందీ అని పాడేసే సమయం ఆసన్నమైంది. చలి పంజా విసురుతూ.. దాచి ఉంచిన రగ్గులు, దుప్పట్లకు పని చెబుతోంది. ఇదే సమయంలో ఫ్లూ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అయితే కొందరు ఈ చలి నుండి ఉపశమనం పొందేందుకు ఆల్కహాల్ తీసుకుంటుంటారు..

చలి చంపుతున్న చమక్కులో గిలిగింత పెట్టిందీ అని పాడేసే సమయం ఆసన్నమైంది. చలి పంజా విసురుతూ.. దాచి ఉంచిన రగ్గులు, దుప్పట్లకు పని చెబుతోంది. ఇదే సమయంలో ఫ్లూ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అయితే కొందరు ఈ చలి నుండి ఉపశమనం పొందేందుకు ఆల్కహాల్ తీసుకుంటుంటారు..

శీతాకాలంలో ఆల్కహాల్ సేవిస్తే.. దగ్గు, జలుబు తగ్గుతాయా..? నిజమెంత..?

వాతావరణంలో  మార్పులు చోటుచేసుకున్నాయి. గజ గజ అంటూ చలి వణికించేస్తోంది. చలికాలం మొదలైంది అని సంకేతాలు ఇచ్చేందుకు శీతల గాలులు వీస్తున్నాయి. దుప్పట్టు కప్పుకున్నా, స్వెటర్లు ధరించినా చలి ఆగడం లేదు. ఉదయం 9 వరకు భానుడి జాడ కానరావడం లేదు. సాయంత్రం 4 గంటల నుండే చల్లబడిపోతుంది. ఈ శీతలానికి తోడు.. అప్పుడప్పుడు కురిసే వానలు ఒంట్లో చలి పెంచి గిలిగింతలు పెడుతున్నాయి. దీంతో జలుబు, దగ్గు, ఆయాసం, తలనొప్పి వంటివి వస్తుంటాయి. ఈ చిన్న వాటికి ఆసుపత్రికి ఏం వెళుతాంలే అని.. వాటి నుండి ఉపశమనం కోసం ఆల్కహాల్ సేవిస్తూ ఉంటారు. ఇది శరీరంలో ఉష్ణాన్ని పెంచుతుందని నమ్మడమే కాకుండా రోగాలు కూడా నయమౌతాయని భావిస్తుంటారు. మరీ ఈ వాదనలో వాస్తవమెంతో తెలుసుకుందాం

శీతాకాలం వచ్చిందంటే చాలు ఉదయం, సాయంత్రాలు చలి కారణంగా చికాకు తెప్పిస్తుంటాయి. పొద్దున్న లేవలేం.. రాత్రుళ్లు దుప్పటి ముసుగేసినా నిద్ర రాదు. దీంతో స్వాంతన కోసం కొంత మంది రమ్, బ్రాందీ వంటి ఆల్కహాల్ పుచ్చుకుంటూ ఉంటారు. కొంత మంది జలుబు, దగ్గు, ఆయాసం వంటి అనారోగ్య సమస్యలకు మందే పరిహారం అని తాగేస్తుంటారు. కీళ్ల నొప్పులు, వాతం వంటి సమస్యలు కూడా మద్యం సేవించడం వల్ల నయమౌతాయని విశ్వసిస్తుంటారు. శ్వాస సంబంధిత సమస్యల నుండి కూడా ఉప శమనం లభిస్తుందని భావిస్తూ ఉంటారు. అయితే ఆల్కహాల్ తీసుకుంటే ఇటువంటి ఫ్లూ వ్యాధులు తగ్గుతాయని చెప్పేందుకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అలాంటి ఇబ్బందులకు వచ్చినప్పుడు వీటిని తీసుకోమని వైద్యులు కూడా సూచించరు.

ఎందుకంటే రమ్‌ను చెరుకుతో తయారు చేస్తారు. ఇక బ్రాందీని వివిధ రకాల ఫ్రూట్స్, డీజిల్డ్ వైన్‌ను వినియోగిస్తారు. ఇవి కేవలం శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత.. శరీర ఉష్ణోగ్రత మరింత వెచ్చగా మారుస్తుంది తప్ప.. మరే రోగాలు, ఫ్ల్యూ వ్యాధులను నయం చేయదు. ఇదే  సైన్స్ చెబుతోంది. అలాగే ఎక్కువగా మద్యం సేవిస్తే.. బాడీ టెంపరేచర్ అటు ఉంచితే.. రోగాలు తగ్గడం  కాదు కదా..ఎక్కవవుతాయి అని చెబుతున్నారు వైద్యులు. అతి ఏదైనా అనర్థమే అయినట్లు.. ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే.. రోగ నిరోధక శక్తి బలహీన పడుతుంది. అలాగే శరీరంలోని అవయవాలు క్రమంగా దెబ్బతినడం స్టార్ అవుతాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న సామెత మాదిరి అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి