iDreamPost

Hyundai Creta FaceLift: ఫీచర్స్ చూస్తే వావ్ అనాల్సిందే!

హ్యూండాయ్ క్రెటా కారుకు ఇప్పటికే ఎంతో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ ఫేస్ లిఫ్ట్ ఫీచర్స్ చూస్తే ఆ డిమాండ్ డబుల్ అవుతుంది.

హ్యూండాయ్ క్రెటా కారుకు ఇప్పటికే ఎంతో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ ఫేస్ లిఫ్ట్ ఫీచర్స్ చూస్తే ఆ డిమాండ్ డబుల్ అవుతుంది.

Hyundai Creta FaceLift: ఫీచర్స్ చూస్తే వావ్ అనాల్సిందే!

మిడ్ రేంజ్ Suvల్లో హ్యూండాయ్ క్రెటాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయం మనం చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది జరిగిన అమ్మకాలు చూస్తే.. ఎవరైనా ఆ మాట ఒప్పుకుని తీరాల్సిందే. 2023లో హ్యూండాయ్ క్రెటా 1,57,311 యూనిట్స్ అమ్ముడయ్యాయి. మరోవైపు మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా 1,13,387 యూనిట్స్, కియా సెల్టాస్ 1,04,891 యూనిట్స్ మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ లెక్కలను బట్టే హ్యూండాయ్ క్రెటా మోడల్ కు ఎంతటి క్రేజ్ ఉందో చెప్పచ్చు. ఇప్పుడు ఈ క్రేజ్ రెండితలు కాబోతోంది. ఎందుకంటే హ్యూండాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ జనవరి 16న విడుదల కాబోతోంది. ఆ కారు ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ చూసిన తర్వాత మార్కెట్ లో మరింత ఆసక్తి పెరుగుతోంది. మరి.. ఆ ఫీచర్స్ ఏంటి? అసలు ధర ఎంత అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

క్రెటా ఫేస్ లిఫ్ట్ ఎక్స్ టీరియర్:

గతంతో పోలిస్తే.. ఈ క్రెటా ఫేస్ లిఫ్ట్ లో ఎక్స్ టీరియర్ స్టన్నింగ్ లుక్స్ తో ఉంది. నిజానికి పాత మోడల్ లోనే క్రెటా ఎక్స్ టీరియర్ కు ఎంతో మంది అభిమానులు న్నారు. ఇప్పుడు సరికొత్త లుక్స్ చూసిన తర్వాత కార్ లవర్స్ అందరూ ఈ మోడల్ తో లవ్ లో పడిపోతున్నారు. ఈ ఫేస్ లిఫ్ట్ లో ఎక్స్ టీరియర్ పరంగా కూడా అప్ డేట్స్ తీసుకొచ్చారు. సరికొత్త పారామెట్రిక్ బ్లాక్ క్రోమ్, క్వాడ్- భీమ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ హారిజన్ పొజీషనింగ్ ల్యాంప్స్, కనెక్టెడ్ ఎల్ఈడీ హారిజన్ టెయిల్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ స్టాప్ ల్యాంప్ తో స్పాయిలర్, రీ డిజైన్డ్ టెయిల్ గేట్ తో అప్ గ్రేడ్ చేశారు. అలాగే సరికొత్త అలాయ్ వీల్స్ కూడా వస్తున్నాయి. వీటన్నింటి సాయంతో క్రెటా లుక్స్ లో మరిన్ని మార్పులు వచ్చాయి.

ఇంటీరియర్:

ఈ ఆల్ న్యూ క్రెటాలో క్యాబిన్ డిజైన్ పూర్తిగా మార్చేశారు. ముఖ్యంగా డ్యాష్ బోర్డ్ డిజైన్స్ లో ట్రెమండస్ ఛేంజెస్ చేశారు. 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తీసుకొస్తున్నారు. అలాగే 10.25 ఇంచెస్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది. సరికొత్త లెథరెట్ సీట్స్, లెథరెట్ ఆర్మ్ రెస్ట్ కవరింగ్, లెథరెట్ ఫ్లాట్ బాటమ్ స్ట్రీరింగ్ వీల్, లెథరెట్ వ్రాప్డ్ గేర్ షిఫ్టర్ తో వస్తోంది. ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్, యాంబియంట్ లైటింగ్, ఎయిట్ వే పవర్ డ్రైవర్ సీట్, సరౌండ్ వ్యూ మోనిటర్, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ ఉంటాయి. 8 స్పీకర్స్ తో సరౌండ్ సిస్టమ్ ఉంటుంది. పానోరామిక్ సన్ రూఫ్ ఉంటుంది. ఈ ఇంటీరియర్ చూసిన తర్వాత అందరూ క్రెటా ప్రేమలో పడిపోతారని కంపెనీ కూడా ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇంజిన్- సేఫ్టీ:

ఇంక ఈ కారు ఇంజిన్, సేఫ్టీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మీకు మొత్తం 3 ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. 1.5 లీటర్ ఎంపీఐ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 115పీఎస్/144 ఎన్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. 1.5 లీటర్ కప్పా టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 160పీఎస్/ 253ఎన్ఎం టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మూడో ఆప్షన్ గా 1.5 లీటర్ యూ2 డీజిల్ ఇంజిన్ ఉంది. ఇంక సేఫ్టీ విషయానికి వస్తే.. ఈ క్రెటా ఫేస్ లిఫ్ట్ వర్షన్ మొత్తం 70 రకాల సేఫ్టీ ఫీచర్స్ తో వస్తోంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానికి స్టెబిలిటీ కంట్రోల్ వంటి 36 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. హైఎండ్ మోడల్ లో 19 ఫీచర్స్ తో లెవల్ 2 ADAS ఉంటుంది. ఇంక ధర విషయానికి వస్తే.. ఈ ఫేస్ లిఫ్ట్ మోడల్ ధర రూ.11 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. అధిరాకికంగా తెలియాలంటే జనవరి 16 వరకు ఆగాల్సిందే. మరి.. క్రెటా ఫేస్ లిఫ్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి