iDreamPost

హనుమాన్ గుడికి లక్షలు ఖరీదు చేసే భూమిని విరాళమిచ్చిన ముస్లిం! ఎక్కడంటే?

  • Published Apr 25, 2024 | 3:42 PMUpdated Apr 25, 2024 | 3:42 PM

భారతదేశంలో భిన్న మతాల వారు కలిసిమెలిసి జీవిస్తూ.. మత సామరస్యాన్ని పాటిస్తుంటారు. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటనలు బోలేడు జరగ్గా.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. హిందూ ఆలయానికి ఓ ముస్లి వ్యక్తి భూవిరాళం ఇచ్చాడు. ఆ వివరాలు..

భారతదేశంలో భిన్న మతాల వారు కలిసిమెలిసి జీవిస్తూ.. మత సామరస్యాన్ని పాటిస్తుంటారు. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటనలు బోలేడు జరగ్గా.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. హిందూ ఆలయానికి ఓ ముస్లి వ్యక్తి భూవిరాళం ఇచ్చాడు. ఆ వివరాలు..

  • Published Apr 25, 2024 | 3:42 PMUpdated Apr 25, 2024 | 3:42 PM
హనుమాన్ గుడికి లక్షలు ఖరీదు చేసే భూమిని విరాళమిచ్చిన ముస్లిం! ఎక్కడంటే?

భారతదేశం అంటే.. భిన్నత్వంలో ఏకత్వం.. లౌకిక దేశం, మత సామరస్యం ప్రదర్శించే దేశంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడనే కాదు.. ప్రారంభం నుంచే ఇక్కడ మత సామరస్యం పరిఢవిల్లింది. మన మతాన్ని పాటిస్తూనే.. ఇతర మతాలను గౌరవించే సంప్రదాయం కేవలం భారతీయులకు మాత్రమే సొంతం. ఏళ్లుగా ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇంకా అనేక ఇతర మతాల వారు కలిసి మెలసి సోదర భావంతో జీవితాలను సాగిస్తున్నారు. పరాయి దేశాల వాళ్లు.. మన దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఇక్కడి ప్రజల్లో మెజారిటీ వర్గం మాత్రం మత సామరస్యం చూపుతూ.. కలిసిమెలసి జీవిస్తున్నారు.  హిందువుల పండుగల్లో ముస్లింలు.. ముస్లిం ప్రార్ధనల్లో హిందువులు పాల్గొంటారు. ఈ క్రమంలో తాజాగా మత సామరస్యాన్ని చాటే ఘటన వెలుగు చూసింది. హిందువుల ఆలయం కోసం ఓ ముస్లి వ్యక్తి లక్షలు ఖరీదు చేసే భూమిని విరాళంగా ఇచ్చాడు. ఎక్కడంటే..

తాజాగా హిందు, ముస్లిం.. భాయి భాయి అనే దానికి నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి వెలుగు చూసింది. ముస్లిం వ్యక్తి పెద్ద మనసు చాటుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీక అని తన చేతలతో మరోసారి నిరూపించాడు. లక్షలు విలువచేసే భూమిని హనుమాన్ దేవాలయానికి విరాళంగా అందించి.. గొప్ప మనసు చాటుకున్నాడు ఆ వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ శివారు మెయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామంలో కొత్తగా హనుమాన్ దేవాలయం నిర్మించారు. బుధవారం వీరాంజనేయ స్వామి విగ్రహాన్ని, ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మేడిపల్లి గ్రామానికి చెందిన సలావుద్దీన్ అనే ముస్లిం వ్యక్తి.. హనుమాన్‌ ఆలయం కోసం తనకు చెందిన 5 గుంటల భూమిని విరాళంగా ఇచ్చారు. అందుకు సంబంధించిన పత్రాలను చిలకూరు ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్‌కు అందజేశారు. సిటీకి శివారు ప్రాంతం కావడంతో ఇక్కడ భూమికి భారీ ధర ఉంది. గజం ధరనే వేలల్లో పలుకుతుంది. అలాంటిది లక్షలు విలువచేసే భూమిని.. హిందూ ఆలయం కోసం విరాళంగా ఇవ్వటంపై స్థానికులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. భూమిని దానమిచ్చి సలావుద్దీన్ మత సామరస్యాన్ని చాటుకున్నారని మెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారి కూడా ఉండటం వల్లే మన రాష్ట్రంలో మత విద్వేషాలకు తావు లేకుండా పోయింది అంటున్నారు. మరి సలావుద్దీన్‌ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి