iDreamPost

Metro Rail: గుడ్‌న్యూస్.. ఇకపై అర్థరాత్రి వరకు మెట్రో సేవలు.. చివరి ట్రైన్ ఎప్పుడంటే..?

హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం నమాయిష్ ఎగ్జిబిషన్ భారీ ఎత్తున నిర్వహిస్తుంటారు. తెలుగు రాష్ట్రా నుంచే కాదు.. వివివధ రాష్ట్రాల నుంచి కూడా ఈ ఎగ్జిబిషన్ ని చూసేందుకు వస్తుంటారు.

హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం నమాయిష్ ఎగ్జిబిషన్ భారీ ఎత్తున నిర్వహిస్తుంటారు. తెలుగు రాష్ట్రా నుంచే కాదు.. వివివధ రాష్ట్రాల నుంచి కూడా ఈ ఎగ్జిబిషన్ ని చూసేందుకు వస్తుంటారు.

Metro Rail: గుడ్‌న్యూస్.. ఇకపై అర్థరాత్రి వరకు మెట్రో సేవలు.. చివరి ట్రైన్ ఎప్పుడంటే..?

హైదరాబాద్ లో నాంపల్లి ఎగ్గిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. ఈ ఎగ్జిబిషన్ ని జనవరి 1 సోమవారం సాయంత్రం 5 గంటటకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించే నుమాయిష్ కోసం ఇప్పటికే అన్నీ ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది నిర్వహించే నుమాయిష్ ఎగ్జిబిషన్ కి తెలంగాణ నుంచి మాత్రమే కాదు.. వివిధ రాష్ట్రాల నుంచి జనాలు తరలివస్తుంటారు. 46 రోజుల పాటు సాగే నుమాయిష్ ఎగ్జిబిషన్ కి టికెట్ ధరలు, విజిటింగ్ అవర్స్ ఎలాంటి మార్పులు లేవని నిర్వాహకులు అంటున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది మెట్రో రైల్వే. వివరాల్లోకి వెళితే..

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్ ఎగ్జిబిషన్ కి భారీ ఎత్తున జనాలు తరలిస్తుంటారు. ఈ ఏడాది ఎగ్జిబిషన్ లో సుమారు 2400 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.. దాదాపు 20 లక్షల సందర్శకులు విచ్చేయవొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే సందర్శకుల తాకిడి దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ మెట్రో యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై సందర్శకుల కోసం మెట్రో ట్రైన్ వేళలను అర్థరాత్రి వరకు పొడిగించింది. చివరి ట్రైన్ ఇక ఒంటి గంట వరకు మియాపూర్ – ఎల్బీ నగర్, నాగోల్ – రాయదుర్గం మార్గాల్లో రాత్రి 12.15 గంటలకు మొదలై 1 గంట వరకు గమ్యస్థానానికి చేరుకోనున్నది. అంతేకాదు మెట్రో స్టేషన్లలో నుమాయిష్ సందర్శకుల కోసం ప్రత్యేక టికెట్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేయనుంది.

మరోవైపు నుమాయిష్ ఎగ్జిబిషన్ సందర్శకుల కోసం టీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ ఏగ్జిబిషన్ ఎంట్రీ టికెట్ ధర రూ.40 గా నిర్ణయించారు. ఇక నుమాయిష్ టైమింగ్స్ విషయానికి వస్తే.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు ఉంటే.. వారాంతం, సెలవు దినాల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సందర్శించుకునే అవకాశం కల్పిస్తుంది. ఇక ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు వాహనాలతో వెళ్లేవారికి అవకాశం కల్పించారు.. ఇందుకోసం ప్రత్యేకంగా రూ.600 వరకు రుసుము వసూళ్లు చేస్తున్నారు. ఇక నుమాయిష్ ఎగ్జిబిషన్ లో చేనేత వస్త్రాల నుంచి వంటగది సామాన్ల వరకు ఎన్నో రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఇందులో ప్రత్యేకంగా ఫుడ్ కోర్టు కూడా ఉంటుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి