iDreamPost

జాగ్రత్త.. క్యాబ్‌ డ్రైవర్‌కు లక్ష జరిమానా.. అలా చేశారంటే మీకూ తప్పదు!

హైదరాబాద్‌ వినియోగదారుల ఫోరం ఓ క్యాబ్ డ్రైవర్ కు బిగ్ షాకిచ్చింది. ఏకంగా లక్షరూపాయల జరిమానా విధించింది. ఆ కారణంతోనే క్యాబ్ డ్రైవర్ కు ఫైన్ వేసింది. అసలు ఏం జరిగిందంటే?

హైదరాబాద్‌ వినియోగదారుల ఫోరం ఓ క్యాబ్ డ్రైవర్ కు బిగ్ షాకిచ్చింది. ఏకంగా లక్షరూపాయల జరిమానా విధించింది. ఆ కారణంతోనే క్యాబ్ డ్రైవర్ కు ఫైన్ వేసింది. అసలు ఏం జరిగిందంటే?

జాగ్రత్త.. క్యాబ్‌ డ్రైవర్‌కు లక్ష జరిమానా.. అలా చేశారంటే మీకూ తప్పదు!

ప్రస్తుత రోజుల్లో ఎక్కడికైనా ప్రయాణించాలంటే సొంత వాహనం ఉండాల్సిన అవసరం లేదు. ఎంచక్కా ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే క్షణాల్లో మీ ఇంటి ముందు వాలిపోతున్నారు ట్యాక్సీ డ్రైవర్లు. ఉన్నచోటుకే వస్తుండడంతో ఆన్ లైన్ ట్యాక్సీలకు డిమాండ్ పెరిగింది. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థలు ప్రైవేట్ రవాణా రంగంలో సేవలందిస్తున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో ట్యాక్సీ డ్రైవర్ల దురుసు ప్రవర్తన కస్టమర్లకు ఇబ్బందికరంగా మారింది. ఛార్జీలు అదనంగా వసూలు చేయడం.. మధ్యలోనే దింపేయడం ఇలాంటి చర్యలకు పాల్పడడంతో ట్యాక్సీ డ్రైవర్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు కస్టమర్లు. ఈ క్రమంలో ఓ ట్యాక్సీ డ్రైవర్ కస్టమర్ పట్ల దురుసుగా ప్రవర్తించడంతో తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఏకంగా లక్ష రూపాయల జరిమానా విధించింది హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల ఫోరం 3.

కస్టమర్లకు జరిగే అన్యాయాలు, అసౌకర్యాలపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తే సదు సంస్థలపై లేదా వ్యక్తులపై చర్యలు తీసుకుంటుంది. ఇదే విధంగా ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి క్యాబ్ డ్రైవర్ కు జరిమానా విధించింది. ఆబిడ్స్‌కు చెందిన శామ్యూల్‌ వ్యక్తిగత పనిమీద వెళ్లేందుకు 2021 అక్టోబర్‌ 19న ఓ కంపెనీకి చెందిన క్యాబ్‌ను బుక్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు క్యాబ్‌ ఇంటి వద్దకు చేరుకుంది. శామ్యూల్‌, అతడి భార్య, మరో వ్యక్తి క్యాబ్ లో ఎక్కారు. క్యాబ్ డ్రైవర్ కారును స్టార్ట్ చేసి గమ్యస్థానానికి బయలుదేరారు. ఆ సమయంలో కారులో ఏసీ వేయాలని కస్టమర్ డ్రైవర్ ను కోరాడు. అయితే ప్రయాణం చేస్తున్న సమయంలో ఏసీ వేయడానికి నిరాకరించాడు క్యాబ్‌ డ్రైవర్‌.

అంతే కాదు కస్టమర్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. కేవలం 5 కిలోమీటర్లు ప్రయాణించగానే మధ్యలోనే దిగిపోవాలని అన్నాడు. ఇందుకు గాను రూ. 861 చార్జీ వసూలు చేశాడు. ఇక క్యాబ్ డ్రైవర్ ప్రవర్తనతో విసుగెత్తిపోయిన కస్టమర్ కంపెనీ కస్టమర్‌ కేర్‌ను సంప్రదించాడు. అక్కడి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో చేసేదేం లేక వినియోగదారుల ఫోరంలో కంప్లైంట్ చేశాడు. డబ్బు, సమయం వృథా అయిందని దానికి పరిహారం కోరాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన హైదరాబాద్‌ వినియోగదారుల ఫోరం కస్టమర్ కు కలిగిన అసౌకర్యాన్ని గుర్తించి అందుకు కారణమైన క్యాబ్ డ్రైవర్ కు జరిమానా విధించింది. కస్టమర్ కు పరిహారంగా రూ. లక్ష పరిహారంతోపాటు కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.5వేలు చెల్లించాలని తీర్పును వెలువరించింది. మరి మీరు కూడా అలా కస్టమర్ల పట్ల ప్రవర్తించినట్లైతే మీపై కూడా చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి