iDreamPost

హుస్సేన్‌సాగర్ అలలపై లేజర్ ఆధారిత సౌండ్, లైట్ షో.. దేశంలోనే తొలిసారి..

Laser Lights Show at Hussain Sagar: హైదరాబాద్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది హుస్సేన్ సాగర్. ఇక్కడ సాయంత్రం వేల ఎంతో అహ్లాదంగా ఉంటుంది.. నగర వాసులు తెగ ఎంజాయ్ చేస్తుంటారు.

Laser Lights Show at Hussain Sagar: హైదరాబాద్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది హుస్సేన్ సాగర్. ఇక్కడ సాయంత్రం వేల ఎంతో అహ్లాదంగా ఉంటుంది.. నగర వాసులు తెగ ఎంజాయ్ చేస్తుంటారు.

హుస్సేన్‌సాగర్ అలలపై లేజర్ ఆధారిత సౌండ్, లైట్ షో.. దేశంలోనే తొలిసారి..

హైదరాబాద్ నగరంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ అందమైన కట్టడాలు, పర్యాటక ప్రదేశాలను చూడటానికి దేశ విదేశాల నుంచి ఎంతోమంది పర్యాటకులు   వేల సంఖ్యల్లో వస్తూ ఉంటారు. హైదరాబాద్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చే వాటిలో చార్మీనార్ తర్వాత హుస్సేన్ సాగర్.  1562 హుస్సేన్ సాగర్ ని మంచి నీటి కోసం నిర్మించారు ఇబ్రహీం కులీ కుతుబ్ షా. అప్పట్లో చెరువు తవ్వకం పూర్తయినా నీరు నిండకపోవడంతో మూసీ నదికి అనుసంధానం చేశారు. హుస్సేన్ సాగర్ పర్యాటక కేంద్రంగా కొనసాగుతుంది. ఇక్కడ బుద్ద విగ్రహం స్పెషల్ ఎట్రాక్షన్. హుస్సేన్ సాగర్ మరో అద్బుతం సంతరించుకోబోతుంది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ పర్యాటకానికి సంబంధించిన మరో కొత్త ప్రాజెక్ట్ ప్రజలకు అంకితం కాబోతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీనికోసం ఎంతో కృషి చేశారు. హుస్సేన్ సాగర్ అలలపై అత్యాధునిక సాంకేతికతో వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్ పై లేజర్ ఆధారిత సౌండ్, లైట్ షోను కిషన్ రెడ్డి మార్చి 12, మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ లైట్ అండ్ సౌండ్ షో ప్రపంచంలోనే అత్యంత ఆకర్షీయమైన ‘కోహినూర్’ వజ్రం గురించిన కథ కూడా ఉండబోతుంది. ప్రపంచ ప్రసిద్ది చెందిన కోహినూర్ వజ్రం మన తెలంగాణ భూముల్లో లభించిన విషయం తెలిసిందే. కోహినూర్ ఎక్కడ దొరికింది.. ఎలా రూపు దిద్దికుంది.. ఖండాంతరాలు దాటి ఎలా వెళ్లింది అనే కథాంశం వాటర్ స్క్రీన్ పై రంగుల లేజర్ వెలుతురులో వివరించనున్నారు.

ఈ కథను రాజ్యసభ ఎంపీ, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో.. ప్రముఖ రచయిత ఎస్ ఎస్ కంచి రాశారు. ప్రముఖ నేపథ్య గాయని సునిత గాత్రాన్ని అందించారు. ప్రముఖ సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. ఈ లేజర్ షో కు వచ్చే పర్యాటకుల సరైన సైనేజెస్, వెయ్యి మంది కూర్చునేలా సిట్టింగ్, అన్ని వసతులతో కూడిన గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. ఓ చెరువు అలలపై లేజర్ ఆధారిత సౌండ్, లైట్ షో ఏర్పాటు చేయడం అనేది దేశ చరిత్రలోనే ఇదే మొదటి సారి అంటున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి