iDreamPost

క్రికెట్ లో బాల్ వేగాన్ని ఎలా లెక్కిస్తారు? స్పీడ్ గన్ గ్రౌండ్ లో ఎక్కడ పెడతారు?

How To Measure Speed Of A Ball In Cricket: క్రికెట్ లో బౌలర్ వేసిన బంతి ఎంత వేగంగా వెళ్లింది అనే విషయాన్ని సెకన్లలోనే చెప్పేస్తారు. గంటకు ఇన్ని కిలోమీటర్ల వేగంతో వెళ్లింది అంటారు. మరి.. ఆ వేగాన్ని ఎలా కొలుస్తారు?

How To Measure Speed Of A Ball In Cricket: క్రికెట్ లో బౌలర్ వేసిన బంతి ఎంత వేగంగా వెళ్లింది అనే విషయాన్ని సెకన్లలోనే చెప్పేస్తారు. గంటకు ఇన్ని కిలోమీటర్ల వేగంతో వెళ్లింది అంటారు. మరి.. ఆ వేగాన్ని ఎలా కొలుస్తారు?

క్రికెట్ లో బాల్ వేగాన్ని ఎలా లెక్కిస్తారు? స్పీడ్ గన్ గ్రౌండ్ లో ఎక్కడ పెడతారు?

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసినా సాయంత్రానికి ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. ఈ క్యాష్ రిచ్ లీగ్ లో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతున్నాయి. వాటిలో మయాంక్ యాదవ్ కూడా ఒకడు. వరుసగా తొలి రెండు మ్యాచుల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకుని చరిత్ర సృష్టించాడు. అతని స్పెషాలిటీ గంటకు 155 కిలోమీటర్ల వేగంతో వరుసగా బౌలింగ్ చేస్తున్నాడు. ఎప్పుడైనా ఒక ప్రశ్న మీరు వేసుకున్నారా.. అసలు బౌలర్ వేసే బంతి వేగాన్ని ఎలా కొలుస్తారు? అంత కచ్చితంగా బంతి గంటకు 156 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందని ఎలా నిర్ధారిస్తారు? అసలు ఆ వేగాన్ని కొలిచే పరికరం, పద్ధతి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

ప్రస్తుతం క్రికెట్ లో ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీలు వచ్చాయి. లైవ్ లో మ్యాచ్ జరుగుతుండగానే ఎన్నో విషయాలను వివరిస్తున్నారు. అయితే క్రికెట్ మ్యాచ్ లో ముఖ్యంగా బాల్ ఎంత వేగంగా వచ్చింది? అనే విషయాన్ని అప్పటికప్పుడే స్క్రీన్ మీద, టీవీలో ప్రసారం చేస్తారు. అయితే ఆ వేగాన్ని ఎలా కొలుస్తారు అంటే? దానికి ఒక పరికరాన్ని వాడతారు. దానిని రాడార్ గన్ లేదా స్పీడ్ గన్ అంటారు. దీనితో బాల్ వేగాన్ని, బంతి గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది అనే విషయాన్ని వెల్లడిస్తారు. ఈ రాడార్ గన్ ను బౌలర్ కి వ్యతిరేక దిశలో అమరుస్తారు. అంటే ఈ గన్ బ్యాట్స్ మన్ వైపు ఉంటుంది. బాల్ విడుదలైన తర్వాత ఎంత వేగంతో వచ్చిందనే విషయాన్ని వెల్లడిస్తుంది. ఈ స్పీడ్ గన్ సైన్స్ లో ఉండే డాప్లర్ ఎఫెక్ట్ ని వినియోగించి బంతి వేగాన్ని కొలుస్తుంది.

Ball Speed

డాప్లర్ ఎఫెక్ట్ అంటే?:

ఈ రాడార్ గన్ బంతివైపు కంటికి కనిపించని రేడియో ఫ్రీక్వెన్సీని పంపుతుంది. ఆ తరంగాలను మైక్రోవేవ్స్ అంటారు. అవి బంతికి తగలి తిరిగి రాడార్ గన్ కు చేరుకుంటుంది. ఆ విధంగా వేగాన్ని కొలుస్తారు. కానీ, బంతి వేగంగా కదులుతున్నప్పుడు వేగాన్ని కొలిచే పద్ధతిని డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. ఉదాహరణకు కొలనులో ఒక బాతు ఉంటుంది. అది అలజడి సృష్టిస్తూ ఉంటుంది. అలా అలజడి సృష్టించినప్పుడు దాని చుట్టూ కొన్ని అలలు ఏర్పడతాయి. ఒక సెకనుకు ఒక సర్టన్ పాయింట్ కి ఎన్ని అలలు వస్తున్నాయో కొలిస్తే దానిని ఫ్రీక్వెన్సీ అంటారు. బాతు కదలకుండా ఉంటే వచ్చే సర్కిల్స్ కంటే.. బాతు ముందుకు కదులుతున్నప్పుడు వచ్చే అలలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఫ్రీక్వెన్సీ కూడా మారుతుంది.

బాతు కదలకుండా ఉన్నప్పుడు కంటే ముందుకు కదులుతున్నప్పుడు సెకనుకు ఏర్పడే సర్కిల్స్ సంఖ్య పెరుగుతుంది. అలా పెరగడాన్నే డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. ఈ డాప్లర్ ఎఫెక్ట్ విధానం ద్వారానే క్రికెట్ లో స్పీడ్ గన్ తో బాల్ వేగాన్ని కొలుస్తూ ఉంటారు. బంతివైపు కొన్ని తరంగాలను పంపుతారు. వాటిని ఎమిటెడ్ వేవ్ అంటారు. ఆ తర్వాత ఆ తరంగాలు తిరిగి స్పీడ్ గన్ కు రిసీవ్ అవుతాయి. అలా రిసీవ్ అయిన ఫ్రీక్వెన్సీని రిఫ్లెక్టెడ్ వేవ్ అంటారు. ఈ ఎమిటెడ్ వేవ్- రిఫ్లెక్టెడ్ వేవ్ ని బట్టి రియల్ టైమ్ వేగాన్ని కొలుస్తారు. ఈ విధానం వల్ల దాదాపుగా కచ్చితమైన వేగం ఎంతో తెలుస్తుంది. మరి.. క్రికెట్ మ్యాచ్ లో బంతి వేగాన్ని కొలిచే ఈ విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి