iDreamPost

6 గ్యారెంటీల కోసం ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి.. పూర్తి వివరాలు

How To Apply For 6 Guarenties: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చెప్పిన విధంగానే 6 గ్యారెంటీల అమలుకు రంగం సిద్ధం చేసింది. మీకు 6 గ్యారెంటీల్లో ఏ పథకం కావాలన్నా ఇలా అప్లయ్ చేసుకోండి.

How To Apply For 6 Guarenties: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చెప్పిన విధంగానే 6 గ్యారెంటీల అమలుకు రంగం సిద్ధం చేసింది. మీకు 6 గ్యారెంటీల్లో ఏ పథకం కావాలన్నా ఇలా అప్లయ్ చేసుకోండి.

6 గ్యారెంటీల కోసం ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి.. పూర్తి వివరాలు

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి అందరికీ తెలిసిందే. ఆ పార్టీకి అధికారాన్ని కట్ట బెట్టింది కూడా ఆ 6 గ్యారెంటీలనే చెప్పాలి. ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఆ గ్యారెంటీల్లో చెప్పిన పథకాలను అమలు చేయడం కూడా ప్రారంభించేసేంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపును అమలు చేస్తున్నాయి. అంతేకాకుండా మిగిలిన పథకాలకు సంబంధించి కూడా అర్హులను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన దరఖాస్తులను విడుదల చేశారు. మీకు ఏ పథకం కావాలి అన్నా కూడా ఈ దరఖాస్తుల ద్వారా అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి.. వాటిని ఎలా నింపాలి? వాటికి ఏ డాక్యుమెంట్లు కావాలో చూద్దాం.

తెలంగాణలో డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన దినోత్సవాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రామానికి సంబంధించి ప్రభుత్వ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సభలకు అధికారులు మాత్రమే కాకుండా నేతలు కూడా హాజరవుతారు. ఈ దినోత్సవాల ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలను ఆలకించడం. అంతేకాకుండా అక్కడికక్కడే పరిష్కారం దిశగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటారు. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులను కూడా ఈ గ్రామ సభల్లోనే స్వీకరిస్తారు. మీకు ఏ పథకం కావాలన్నా ప్రజా పాలన దరఖాస్తును ఫిల్ చేసి డాక్యుమెంట్లు జతచేసి ఈ గ్రామ సభల్లో ఇవ్వాల్సి ఉంటుంది.

ఒకటే దరఖాస్తు:

కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఆరు గ్యారెంటీలకు ఒకటే దరఖాస్తును విడుదల చేశారు. 6 గ్యారెంటీల్లో మళ్లీ వేర్వేరు హామీలు ఉన్నాయి. ఏ పథకం కోసమైన ఈ దరఖాస్తునే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రజా పాలన దరఖాస్తులను ఆయా పంచాయతీలకు ప్రభుత్వం అందజేసింది. మొత్తం 10 రోజుల పాటు ఈ గ్రామ సభలు జరగనున్నాయి. ప్రజా పాలన దరఖాస్తులను నింపి గ్రామ సభల సమయంలో అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.

ఎలా నింపాలి?:

మీరు ఈ ప్రజా పాలన దరఖాస్తులో కుటుంబసభ్యుల పూర్త వివరాలను అందజేయాల్సి ఉంటుంది. కుటుంబ యజమాని పేరు, యజమాని పుట్టిన తేదీ, ఆధార్ కార్డు సంఖ్య, రేషన్ కార్డు నంబర్, ఫోన్ నంబర్, వృత్తి, కులం ఇలా అన్నీ వివరాలను అందజేయాల్సి ఉంటుంది. మీకు ఏ పథకం కావాలో ఆ పథకానికి సంబంధిచిన వివరాలను నింపాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇదిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేనేత పథకం ఇలా ఏ పథకం కావాలన్నా ఆ పథకం ఎదురుగా టిక్ చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకం కావాలంటే ఆ పథకం ఎదురుగా ఉన్ బాక్స్ లో టిక్ చేయాలి. మీకు సబ్సిడీలో గ్యాస్ సిలిండర్ కావాలంటే ఆ పథకం ఎదురుగా టిక్ చేయాలి. మీ గ్యాస్ నంబర్, డీలర్ వివరాలు, ఏడాదిలో సగటును ఎన్ని సిలండర్లు తీసుకుంటారు అనే పూర్తి వివరాలను అందజేయాలి.

వికలాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వితంతువులు ఆసరా కోసం దానికి ఎదురుగా ఉండే చెక్ బాక్స్ లో టిక్ చేయాలి. గృహజ్యోతి కోసం అప్లయ్ చేసుకోవాలంటే బాక్సులో టిక్ చేసి.. మీ మీటరు నంబర్ వివరాలను రాయాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇల్లు కోసం అయితే టిక్ చేసి వివరాలను రాయాలి. అమరవీరుల కుటుంబానికి చెందిన వాళ్లు కూడా ఈ దరఖాస్తులోనే వివరాలను నింపాల్సి ఉంటుంది. అమరవీరుడి పేరు, మరణించిన సంవత్సరం, మరణ ధృవీకరణ పత్రం నెంబర్, జైలుకు వెళ్లిన వివరాలు, ఎఫ్ఐఆర్ నెంబర్ వంటి వివరాలను అందజేయాల్సి ఉంటుంది. ఇలా మీరు ఏ పథకానికి అప్లయ్ చేయాలనుకున్నా ఈ ప్రజా పాలన దరఖాస్తులోనే వివరాలు నింపాల్సి ఉంటుంది.

ఏ డాక్యుమెంట్లు కావాలి?:

మీరు 6 గ్యారెంటీల్లో పథకాలకు సంబంధించిన వివరాలను పూర్తి చేసిన తర్వాత.. కావాల్సిన డాక్యుమెంట్లను కూడా జతచేయాల్సి ఉంటుంది. ఈ పథకాల కోసం అప్లయ్ చేస్తున్నవాళ్లు ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్ జతచేయాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తును నింపిన తర్వాత గ్రామ సభల్లో అధికారులకు అందజేయాలి. ఆ తర్వాత అధికారుల నుంచి రశీదును పొందాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను అధికారులు స్క్రూటినీ చేస్తారు. ఎవరు అర్హులు? ఎవరికి ఏ పథకాలు వర్తిస్తాయి అనే విషయాలను పరిశీలిస్తారు. అధికారుల లెక్కల ప్రకారం ఎవరైతే అర్హులు ఉంటారో వారికి ఈ పథకాలను అమలు చేస్తారు. రేషన్ కార్డులేని వాళ్లు కూడా ఈ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రేవంత్ సర్కారు వ్యాఖ్యానించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి