iDreamPost

Cyclone Michaung: ‘మిచౌంగ్ తుఫాన్’.. ఈ పేరుకి అర్ధం తెలుసా? ఇంత ఆలోచిస్తారా?

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమాంగా మిచౌంగ్ తుఫాన్ గా ఏర్పడింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో ఎక్కువగా చూపిస్తుంది. ఇప్పటికే భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమాంగా మిచౌంగ్ తుఫాన్ గా ఏర్పడింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో ఎక్కువగా చూపిస్తుంది. ఇప్పటికే భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

Cyclone Michaung: ‘మిచౌంగ్ తుఫాన్’.. ఈ పేరుకి అర్ధం తెలుసా? ఇంత ఆలోచిస్తారా?

సాధారణంగా ప్రకృతిలో అనేక మార్పుల వల్ల భూకంపాలు, తుఫాన్లు వస్తుంటాయి. వాతావరణ ప్రభావం వల్ల తుఫాన్ ఏర్పడి అది సృష్టించే బీభత్సం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరుగుతుంది. అయితే ప్రతి తుఫాన్ కి వాతావరణ శాఖ వారు ఒక పేరు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. బంగాళా ఖాతం, అరేబియా మహాసముద్రంలో ఏర్పడి అల్ప పీడనం కారణంగా క్రమేణా వాయుగుండంగా మారి తుఫాన్ రూపం దాల్చుతుంది. దీని ప్రభావం దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతుంటాయి. ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగిపోతాయి. విపరీతమైన గాలులు వీయడంతో  కట్టడాలు నేటమట్టం అవుతుంటాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న మిచౌంగ్ తుఫాన్ కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

తుఫాన్ అంటే ప్రజలు భయంతో వణికిపోతుంటారు. ప్రతి ఏటా ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) సైక్లోన్ పరిస్థితిని బట్టి ఈ పేరును పర్యవేక్షిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ సముద్ర పరివాహక ప్రాంతాల్లో ఏర్పడే తుఫానులను ఆ ప్రాంతాలలోని ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలు, ఉష్ణ మండల తుఫాన్ హెచ్చిరికల కేంద్రాల నుంచి పేర్లను సేకరించి వాటికి అనుగుణంగా తుఫాన్ పేరును సూచిస్తాయి. 2021 లో ఏర్పడిన తౌటే తుఫాన్ కి మయన్మార్ పేరు పెట్టింది. మయన్మార్ లో తౌటే అంటే పెద్ద శబ్ధం చేసే బల్లి అని అర్థం. ఈ తుఫాన్ భారీ శబ్ధాలు చేస్తూ రావడంతో మయన్మార్ వాతావరణ శాఖ తమ దేశంలో ప్రత్యేకంగా ఉండే బల్లి పేరును పెట్టింది. ఆ తర్వాత ఏపీని వణికించిన హుద్ హుద్ తుఫాన్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ దీని ఎఫెక్ట్ ఆ ప్రాంతంలో కనిపిస్తూనే ఉంది. హుద్ హుద్ తుఫాన్ కి ఆ పేరు ఒమన్ సూచించింది. ఇది ఇజ్రాయెల్ జాతీయ పక్షి హుపో. హుద్ హుద్ అంటే ఆఫ్రో-యురేషియా అంతటా కనిపించే రంగుల పక్షి.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు, తమిళనాడును వణికిస్తున్న తుఫాన్ కి మిచౌంగ్ అని పేరు పెట్టారు. ‘మిగ్గామ్’ అని ఉచ్చరించే మిచాంగ్ పేరును మయన్మార్ సూచించింది. మిచాంగ్ అంటే ‘బలం’ లేదా ‘స్థిరత’ అని అర్థం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా మిచౌంగ్ తుఫాన్ గా ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నుంచి దీని ప్రభావం విపరీతంగా చూపిస్తుంద. గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతుంది. మిచౌంగ్ తుఫాన్ కారణంగా ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మిచౌంగ్ తుఫాన్ ప్రభావం మరో రెండు రోజులు ఉండవొచ్చని.. ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తుంది. ఈ తుఫాన్ ప్రభావం తమిళనాడులో భారీగా చూపించింది. చెన్నైలో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. ఇప్పటికే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) రంగంలోకి దిగి సహాయకచర్యలు ప్రారంభించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి