iDreamPost

అన్నీ సౌకర్యాలతో రైల్వే స్టేషన్లలో రూమ్స్.. ఇలా బుక్ చేసుకోండి!

సాధారణంగా ఏ కారణం చేతైనా మీ రైలు రద్దైనా, మీరు వేరే రైలుకు వెళ్లాలి అనుకున్నా వెయిట్ చేయాల్సి ఉంటుది. అలాంటి సమయంలో హౌటల్ లో రూమ్ తీసుకోవాలి అంటే తడిసిమోపెడు అవుతుంది. అలాంటప్పుడు ఇలా చేయండి.

సాధారణంగా ఏ కారణం చేతైనా మీ రైలు రద్దైనా, మీరు వేరే రైలుకు వెళ్లాలి అనుకున్నా వెయిట్ చేయాల్సి ఉంటుది. అలాంటి సమయంలో హౌటల్ లో రూమ్ తీసుకోవాలి అంటే తడిసిమోపెడు అవుతుంది. అలాంటప్పుడు ఇలా చేయండి.

అన్నీ సౌకర్యాలతో రైల్వే స్టేషన్లలో రూమ్స్.. ఇలా బుక్ చేసుకోండి!

సాధారణంగా వృత్తి, వ్యాపార, పర్యాటక అవసరాల దృష్ట్యా చాలామంది తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ట్రెయిన్ మిస్ అయిపోతూ ఉంటారు. వేరే ట్రైన్ కి వెళ్లే ఉద్దేశంలో కూడా స్వతహాగానే ఆగిపోతూ ఉంటారు. అయితే అలాంటి సమయంలో రైల్వే స్టేషన్ దగ్గర్లో రూమ్ తీసుకోవాలి అంటే బడ్జెట్ తడిసి మోపెడు అవుతుంది. వెయిట్ హాల్స్ లో ఉండాలి అంటే ఎంతసేపని అలా కూర్చునే ఉంటారు? తప్పక అయినా రూమ్ తీసుకోవాల్సి రావచ్చు. అలాంటి సమయంలో ప్రయాణికులకు డబ్బు ఆదా చేసేందుకు రైల్వే స్టేషన్లలో అన్నీ సౌకర్యాలతో రూమ్స్ ఉంటాయి. వాటి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.

ఐఆర్ సీటీసీ(ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) పలు సేవలను అందిస్తూ ఉంటుంది. వాటిలో రిటైరింగ్ రూమ్స్, డార్మిటరీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అయితే వీటి గురించి చాలామందికి సరైన అవగాహన లేదు. ఈ రిటైరింగ్ రూమ్ సర్వీసెస్ ద్వారా మీరు రైల్వే స్టేషన్లలో అతి తక్కువ ఖర్చుతోనే గదులను బుక్ చేసుకోవచ్చు. మీరు కావాలను కుంటే గంట నుంచి గరిష్టంగా 48 గంటల వరకు ఈ గదులను బుక్ చేసుకోవచ్చు. వీటిలో సింగిల్, నాన్ ఏసీ, ఏసీ, డార్మిటరీ గదులు ఉంటాయి. వీటి ధర కూడా చాలా అందుబాటులోనే ఉంటుంది. రూమ్స్ ధర రూ.100 నుంచి రూ.700 మధ్యే ఉంటుంది.

అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్ ఓకే అయిన వారు మాత్రమే వీటిని బుక్ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. వెయిటింగ్ లిస్టులో ఉన్నా కూడా వీటిని బుక్ చేసుకునేందుకు అవకాశం ఉండదు. ఈ రూమ్స్ ని మీరు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ బుక్ చేసుకోవచ్చు. ఇంక ఈ రిటైరింగ్ రూమ్ సర్వీసెస్ దేశంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ రూమ్ ని బుక్ చేసిన తర్వాత వివిధ కారణాల చేత క్యాన్సిల్ చేస్తే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 48 గంటల ముందే క్యాన్సిల్ చేస్తే బుకింగ్ కాస్ట్ లో నుంచి 10 శాతం ఫీజును వసూలు చేస్తారు. అదే ఒకరోజు ముందు క్యాన్సిల్ చేస్తే 50 శాతం మినహాయిస్తారు.

ఎలా బుక్ చేసుకోవాలి?:

మీరు ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో లాగిన్ అవ్వాలి. అకౌంట్ సెక్షన్ లో మై బుకింగ్ పై క్లిక్ చేయాలి. స్క్రోల్ చేయగానే రిటైరింగ్ రూమ్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మీ పీఎన్నార్ నంబర్ ఎంటర్ చేయాలి. మీ అవసరాలకు తగినట్లు బెడ్ టైప్, చెకిన్, చెకౌట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని వివరాలు చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేయాలి. పేమెంట్ పూర్తి చేసిన తర్వాత మీ బుకింగ్ కన్ఫామ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి