iDreamPost

Horn sound నిషేధిత హారన్‌ కొడితే చార్జిషీట్‌, డ్రైవర్, వాహన యజమానిపై కేసు నమోదు

Horn sound నిషేధిత హారన్‌ కొడితే చార్జిషీట్‌, డ్రైవర్, వాహన యజమానిపై కేసు నమోదు


ఫ‌న్ కోసమో, థ్రిల్ కోస‌మే పెద్ద సౌండ్ తో, విచిత్రమైన ధ్వనులతో హారన్‌ కొడుతూ హ‌డావిడి చేస్తున్నారా? జూన్‌ 1 నుంచి ట్రాఫిక్ పోలీసులు సీరియ‌స్ గా యాక్ష‌న్ తీసుకోనున్నారు. నిషేధిత హారన్లు మోగించే డ్రైవర్, ఆ వాహన యజమానిపై చార్జిషీట్‌ దాఖలు చేయనున్నారు. ప్రెషర్, ఎయిర్, మల్టీటోన్డ్ త‌ర‌హా నిషేధిత హారన్ వాడుతూ, తోటివారిని ఇబ్బంది పెడుతున్న వారిపై నగర ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝుళిస్తున్నారు. తెలంగాణ హైకోర్డు ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఇచ్చిన ఆదేశాల‌ను పాటించ‌నున్నారు. ఇక‌పై పెద్ద సౌండ్ చేసే హార‌న్ ల‌ను వాడేవారికి బాదుడే.

ఇప్ప‌టికే స్పెషల్‌ డ్రైవ్ లో ఇప్పటివరకు 3,320కిపైగా వాహనాలకు ఉన్న నిషేధిత హారన్లను తొలగించారు ట్రాఫిక్ పోలీసులు. ఎంవీ యాక్ట్‌ 190 (2) సెక్షన్‌ ప్రకారం రూ.1,000 జరిమానా విధించారు. కేంద్ర మోటారు వాహనాల చట్టం (సీఎంవీఆర్‌)–1988 సెక్షన్‌ 52 ప్రకారం తయారీదారుల నుంచి వచ్చిన వాహన హారన్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదు. ప్రతి వాహనానికీ ఎలక్ట్రిక్‌ హారన్‌ మాత్రమే ఉండాలి. మీరు కొత్త హార‌న్ వాడారో కేసులు త‌ప్ప‌వు.

వాహనాల నుంచి వెలువడే పొగతో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది. దీనికి తోడు హారన్‌ల శబ్ధ కాలుష్యం (Sound pollution) కూడా తోడ‌యితే హెల్త్ దెబ్బ‌తిన‌డం ఖాయం. అందుకే జూన్‌ 1 నుంచి నిషేధిత హారన్లు మోగించే డ్రైవర్, ఆ వాహన యజమానిపై ట్రాఫిక్‌ పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేయనున్నారు.

మ‌రి హార‌న్ సౌండ్ ల‌ను ఎలా తెలుసుకొంటారు?
హైద‌రాబాద్ లో అకౌస్టిక్‌ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. అదే పనిగా హారన్ కొడితే ఈ కెమెరాలు పట్టేస్తాయి. హారన్‌ శబ్దం ఆధారంగా అటువైపు తిరిగి ఫొటో, వీడియో తీస్తాయి. మరో మూడు వారాల్లో ఇవి పనిచేయడం ప్రారంభించనున్నాయి. హారన్‌ శబ్దం రాగానే కెమెరాలో ఉన్న మైక్రోఫోన్‌ లెవెల్‌ పెరుగుతుంది. అంతే సౌండ్ వ‌చ్చే దిశలో కెమెరా టర్న్‌ అవుతుంది. వేహిక‌ల‌, నెంబర్‌ ప్లేట్‌లను ఫోటో తీస్తుంది. ఎవిడెన్స్ కోసంమూడు సెకన్ల వీడియోను కూడా రికార్డ్‌ చేస్తుంది. వెంటనే ఆ ఫోటో, వీడియో ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌కు చేరతాయి. ఆ తర్వాత ఆ వేహిక‌ల్ ఓన‌ర్ కి నోటీసు వెళ్లిపోతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి