iDreamPost

CM కీలక ఆదేశాలు.. మందుబాబులను జైళ్లలో కాదు.. హోటళ్లలో ఉంచండి

  • Published Dec 26, 2023 | 12:14 PMUpdated Dec 26, 2023 | 12:14 PM

సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో.. పట్టుబడిన మందుబాబులకు జరిమాన విధించడం, శిక్ష వేసి జైలుకు పంపడం వంటివి చేస్తారు. కానీ తాజా ఓ ముఖ్యమంత్రి మాత్రం.. మందుబాబులను జైళ్లకు కాదు హోటల్స్ కి పంపండి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు..

సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో.. పట్టుబడిన మందుబాబులకు జరిమాన విధించడం, శిక్ష వేసి జైలుకు పంపడం వంటివి చేస్తారు. కానీ తాజా ఓ ముఖ్యమంత్రి మాత్రం.. మందుబాబులను జైళ్లకు కాదు హోటల్స్ కి పంపండి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు..

  • Published Dec 26, 2023 | 12:14 PMUpdated Dec 26, 2023 | 12:14 PM
CM కీలక ఆదేశాలు.. మందుబాబులను జైళ్లలో కాదు.. హోటళ్లలో ఉంచండి

ఇయర్ ఎండ్.. వరుసగా సెలవులు వస్తుండటంతో.. చాలా మంది పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంటారు. కొందరూ ప్రత్యేకించి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం కోసమే విదేశాలకు వెళ్తుంటారు. అంత బడ్జెట్ లేని వాళ్లైతే.. స్వదేశంలోనే టూర్ ప్లాన్ చేసుకుంటారు. పైగా శీతాకాలం కావడంతో.. చాలా మంది మంచు కురిసే ప్రాంతాలకు వెళ్లడానికి ఆసక్తి చూపుతారు చాలా మంది. ఇక ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే మద్యం ఏరులై పారుతుంది. ఆ రోజు నగరాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు భారీగా నమోదవుతాయి. వారందరిని స్టేషన్ కు తరలిస్తారు. కానీ ఓ ముఖ్యమంత్రి మాత్రం.. మందుబాబులను జైళ్లకు కాకుండా హెటల్స్ కి తరలించమని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు..

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మందుబాబులను జైళ్లకు కాకుండా హోటల్స్ కి తరలించమని సూచించారు. ఈ ఏడాది తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో వింటర్ కార్నివాల్ నిర్వహిస్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సెలవుల సందర్భంగా వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు ఆ వింటర్ కార్నివాల్‌ను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే దేశం నలు మూలల నుంచి వచ్చే పర్యాటకులు.. మద్యం సేవించి ఓవరాక్షన్ చేస్తే వారిని జైళ్లకు తరలించకుండా హోటల్ రూమ్‌లకు పంపించాలని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు సూచించారు.

సిమ్లాలో ఈ ఏడాది ఇయర్ ఎండ్ సందర్భంగా తొలిసారి వింటర్ కార్నివాల్ ను నిర్వహిస్తున్నారు. ఏడు రోజుల పాటు కొనసాగే వింటర్ కార్నివాల్‌ను ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రారంభించారు. అనంతరం అక్కడి ఏర్పాట్లను తిలకించారు. ఈ సందర్భంగా అతిగా మద్యం సేవించిన వారి విషయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా పర్యాటకులు బాగా తాగి రచ్చ చేస్తే వారిని పోలీస్ స్టేషన్‌ లాకప్‌లో కాకుండా హోటల్‌ గదులకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే వారికి వీఐపీ ట్రీట్‌మెంట్ అందించాల్సి ఉంటుంది అన్నమాట.

కార్నివాల్ ను చూసేందుకు.. దేశం నలుమూలల నుంచి భారీగా పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్‌కు తరలివస్తున్నారని.. వారి కోసం హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ఇతర ఫుడ్ స్టాల్స్‌ 24 గంటల పాటు తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. అంతే కాకుండా పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా పర్యాటకులు చట్టాన్ని గుర్తుంచుకుని ప్రవర్తించాలని సీఎం సుఖ్వీందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన సిమ్లా, మనాలిలకు భారీగా పర్యాటకులు చేరుకుంటున్నారు. లక్షల మంది పర్యాటకులు సిమ్లా, మనాలి ప్రాంతాల్లో బస చేస్తున్నారు. ఇటీవల క్రిస్మస్, వీకెండ్ సందర్భంగా వరుస సెలవులు రావడంతో హిమాచల్‌ ప్రదేశ్‌కు పర్యాటకులు పోటెత్తారు. దీంతో రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ ఏర్పడింది. అంతేకాక కొత్తగా ప్రారంభించిన అటల్ టన్నెల్ నుంచి ఒక్కరోజే 55 వేలకు పైగా వాహనాలు దాటినట్లు అధికారులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి