iDreamPost

స్థానిక సంస్థల ఎన్నికలు.. ప్రభుత్వానికి నిరాశ కలిగించేలా హైకోర్టు నిర్ణయం

స్థానిక సంస్థల ఎన్నికలు..  ప్రభుత్వానికి నిరాశ కలిగించేలా హైకోర్టు నిర్ణయం

కరోనా వైరస్‌ను కారణంగా చూపుతూ స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తలుపుతట్టింది. లంచ్‌మోషన్‌ రూపంలో పిటిషన్‌దాఖలు చేసింది. పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.

అయితే ప్రభుత్వానికి హైకోర్టు నుంచి ఊరట కలిగించే నిర్ణయం రాలేదు. పైగా నిరుత్సాహం వచ్చేలా విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. పిటిషన్‌ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు విచారణ, నిర్ణయం ఆశగా ఎదురుచూసిన రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థల అభ్యర్థులకు నిరాశే ఎదురైందని చెప్పవచ్చు.

కాగా, సుప్రింలోనూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై రేపు విచారణ జరగనుంది. ఈ కారణం చేత హైకోర్టు విచారణను వాయిదా 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 21వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్‌ జరగాల్సి ఉంది. ఈ రోజు మినహా పోలింగ్‌కు మరో నాలుగు రోజుల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో రేపు సుప్రింలో జరగబోయే విచారణపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకుందని చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి