iDreamPost

భార్య పదేపదే పుట్టింటికి వెళ్లడం భర్తను హింసించడమే: ఢిల్లీ హైకోర్టు!

  • Published Apr 06, 2024 | 1:33 PMUpdated Apr 06, 2024 | 1:33 PM

ఈ మధ్య కాలంలో వైవాహిక బంధాలు చిన్న చిన్న విషయాలకే చిన్నా భిన్నం అవుతున్నాయి. ఈ క్రమంలో కోర్టు వారు కొత్త నిర్ణయాలను ఆదేశాలను జారీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా భార్య భర్తలు దాంపత్య విషయానికి సంబంధించి ఢిల్లీ హై కోర్టు కొన్ని ఆదేశాలను జారీ చేసింది.

ఈ మధ్య కాలంలో వైవాహిక బంధాలు చిన్న చిన్న విషయాలకే చిన్నా భిన్నం అవుతున్నాయి. ఈ క్రమంలో కోర్టు వారు కొత్త నిర్ణయాలను ఆదేశాలను జారీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా భార్య భర్తలు దాంపత్య విషయానికి సంబంధించి ఢిల్లీ హై కోర్టు కొన్ని ఆదేశాలను జారీ చేసింది.

  • Published Apr 06, 2024 | 1:33 PMUpdated Apr 06, 2024 | 1:33 PM
భార్య పదేపదే పుట్టింటికి వెళ్లడం భర్తను హింసించడమే: ఢిల్లీ హైకోర్టు!

షాపింగ్ కు తీసుకువెళ్లలేదని భర్తను వదిలేసిన భార్య.. బర్త్ డే కు దుబాయ్ తీసుకువెళ్ళలేదని భర్తను గుద్ది చంపేసిన భార్య అని చెప్పి తరచూ వార్తల్లో ఎక్కడో ఒక దగ్గర జరిగే సంఘటనల గురించి వింటూనే ఉన్నాము. రాను రాను సమాజంలో దాంపత్య బంధానికి విలువ లేకుండా పోతుందని చెప్పి తీరాలి. ఇద్దరి ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నా కూడా.. పెళ్లి తర్వాత వారి బంధం మాత్రం ఏక్కడ నిల్వడంలేదు. చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతూ.. వాటి కారణంగా విడాకులు వరకు వెళ్తున్నారు. కన్న బిడ్డల గురించి కూడా ఆలోచించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ క్రమంలో కోర్టు మెట్లను ఆశ్రయించిన ఎన్నో జంటలు ఉన్నాయి. అయితే, తాజగా ఢిల్లీ హై కోర్టు భార్య భర్తల విడాకులకు సంబంధించిన విషయంలో ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.

సాధారణంగా భార్యలంతా చేసే పని.. ఏంటంటే భర్త మీద కోపం వస్తే అలిగి పుట్టింటికి వెళ్లిపోవడం. ఇది ఎప్పటినుంచో వస్తున్న తీరే. కొంతమంది వారి పొరపాట్లు తెలుసుకుని తప్పులు సరిచేసుకుంటూ వారి కాపురాన్ని సరిదిద్దుకుంటారు. కానీ, మరి కొంతమంది మాత్రం పంతానికి పోయి ఎవరికీ వారే యమునా తీరే అన్న రీతిలో విడాకుల వరకు వెళ్తారు. ఈ క్రమంలో వారు కోర్టును ఆశ్రయించడం.. సర్ది చెప్పడం లాంటివి చేసినా కూడా కొంతమంది పట్టించుకోరు. ఇక్కడ తప్పు ఎవరిది అన్నది మాత్రం ఎవరు చెప్పలేరు. అయితే తాజాగా ఢిల్లీ హై కోర్టు.. ఓ విషయాన్నీ తెలియజేసింది. అదేంటంటే.. భర్త పొరపాటు ఏమి లేకుండా భార్య పుట్టింటికి వెళ్ళిపోతే కనుక.. అది పరోక్షంగా భర్తను మానసికంగా హింసించినట్లే అని .. దానిని క్రూరత్వ చర్యగా పరిగణించాల్సి వస్తుందని హై కోర్టు స్పష్టం చేసింది.

అలాగే భార్య భర్తల మధ్య.. ఒకరిపై ఒకరికి ప్రేమ, విశ్వాసం, నమ్మకం, ఆరాధన భావం ఉంటే వారి వైవాహిక బంధం అన్యోన్యంగా ఉంటుందని.. సంయమనం కోల్పోయిన దంపతుల మధ్య ఎడబాటు పెరిగిపోతూ వారు ఎప్పటికి కలవలేనంతగా పరిస్థితులు మారిపోతాయని. భార్య హింస, క్రూరత్వ చర్యల కారణంగా.. విడిగా విడిగా ఉంటున్న దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ.. జస్టిస్ సురేష్ కుమార్ కైత్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ భర్త ఇలా చెప్పుకొచ్చాడు. 19 ఏళ్ళ వైవాహిక జీవితంలో కనీసం ఏడు సార్లు తన భార్య తనను వదిలి పుట్టింటికి వెళ్లిందని.. అలా వెళ్లిన ప్రతి సారి ఆమె 10 నెలల పాటు పుట్టింట్లో ఉండిపోతుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కోర్టు వారు ఈ ఆదేశాలను జారీ చేసినట్లుగా సమాచారం. ఏదేమైనా ఇలాంటి ఆదేశాలు జారీ చేస్తేనే కానీ.. భార్య భర్తల బంధం అన్యోన్యంగా ఉండదని చెప్పి తీరాలి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి