iDreamPost

ఇండియా పేరు గర్వంగా లేదా?.. సెహ్వాగ్‌ కు హీరో సూటి ప్రశ్న

ఇండియా పేరు గర్వంగా లేదా?.. సెహ్వాగ్‌ కు హీరో సూటి ప్రశ్న

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఒక అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.  ఇండియా పేరుకు బదులు భారత్ అనే పేరును మార్చాలని కేంద్రంలోని మోదీ సర్కార్ ఆలోనలో ఉంది. అందుకే ఇండియా పేరు బదులు భారత్ పేరుతో జీ-20 సదస్సుకు దేశాలకు ఆహ్వానం పంపారు. అలానే సెప్టెంబర్ లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి.. ఈ అంశానికి సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. అయితే కేంద్ర తీసుకొనున్న ఈ నిర్ణయంపై విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఇండియా పేరును భారత్ గా మార్చడాన్ని కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. సమర్థించిన ప్రముఖుల్లో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు. ఇండియా పేరు భారత్ గా మార్చడం సంతోషంగా ఉందన్నారు. అయితే ఆయన ట్వీట్ పై కోలీవుడ్ హీరో విష్టు విశాల్ కొన్ని ప్రశ్నలు అడిగారు.

ఇండియా పేరును ఇండియా పేరును భారత్ గా మార్చే అంశంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు. మనకు గర్వకారణంగా అనిపించే పేరు ఒకటి ఉండాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. మనమంతా భారతీయులం. ఇండియా అనే పేరును బ్రిటీష్ వాళ్లు ఇచ్చారు. దాన్ని వదిలించుకునే సమయం వచ్చింది.  మన దేశానికి భారత్ అనే పేరును ఖరారు. చేయాలి. అలాగే వరల్డ్ కప్ లే ఆడే  క్రికెటర్ల జెర్సీలపై కూడా ఇండియాకు బదులు భారత్ అనే పేరు ఉండేలా చర్యలు తీసుకోవాలి” అంటూ బీసీసీఐని కోరారు. ఈ ట్వీట్ కు కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ కౌంటరిచ్చాడు. సార్.. మీకు ఇన్నేళ్లుగా ఇండియా అనే పదం గర్వంగా అనిపించలేదా? అంటూ ప్రశ్నించాడు.

మరో ట్వీట్ లో  షూటింగ్ లోకేషన్ లో  ఉన్న తన ఫోటోను షేర్ చేశాడు.  ఆ  ఫిక్ షేర్ చేస్తూ.. అసలు ఈ పేరు మార్పు దేనికి? మన దేశ ఉన్నతికి, ఆర్థిక వ్యవస్థకు ఇది ఏ మేరకు ఉపయోగపడుతుంది?” అంటూ ప్రశ్నించాడు. ఈ మధ్యకాలంలో తాను చూసిన వింత వార్త ఇదేనని పేర్కొన్నారు. మన దేశానికి ఇండియా, భారత్ అనే రెండు పేర్లూ ఉన్నాయి. కానీ ఉన్నట్లుండి ఇండియా అనే పదాన్ని ఎందుకు వదిలించుకోవాలనుకుంటున్నారని ప్రశ్నించాడు. అయితే విష్ణు విశాల్ ట్వీట్ ను కొందరు వ్యతిరేకిస్తుంటే, మరికొందరు సమర్ధిస్తున్నారు. కేరళను కేరళంగా మార్చితే లేనిది ఇండియాను భారత్ గా మార్చితే మాత్రం తప్పు అవుతుందా అంటూ విష్ణు విశాల్ ను ప్రశ్నిస్తున్నారు.  ఏది ఏమైనా ఈ అంశంపై పెద్ద చర్చ ఐతే సాగుతుంది. మరి.. హీరో విష్ణు విశాల్ ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి