iDreamPost

కార్తీ గొప్ప మనసు.. సంక్షేమ కార్యక్రమాల కోసం ఏకంగా..

శివకుమార్‌ ఇద్దరు కుమారులు సూర్య, కార్తీలు తండ్రితో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వీరికి అగరం అనే ఫౌండేషన్‌ ఉంది.

శివకుమార్‌ ఇద్దరు కుమారులు సూర్య, కార్తీలు తండ్రితో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వీరికి అగరం అనే ఫౌండేషన్‌ ఉంది.

కార్తీ గొప్ప మనసు.. సంక్షేమ కార్యక్రమాల కోసం ఏకంగా..

సీనియర్‌ తమిళ నటుడు శివకుమార్‌ కుటుంబానికి సేవా కార్యక్రమాల విషయంలో ఓ ప్రత్యేకమైన పేరుంది. అవసరం ఉన్న వారిని ఆదుకోవటంలో ఈ కుటుంబం ఎప్పుడూ ముందుంటుంది. శివకుమార్‌ ఇద్దరు కుమారులు సూర్య, కార్తీలు తండ్రితో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వీరికి అగరం అనే ఫౌండేషన్‌ ఉంది. ఈ ఫౌండేషన్‌ ద్వారా ఎంతో మంది పేద పిల్లలను చదివిస్తున్నారు. అంతేకాదు! వరదలు, ఇతర పకృతి విపత్తులు వచ్చినపుడు లక్షలు, కోట్ల రూపాయలు దానం చేస్తూ ఉన్నారు.

ఇక, అసలు విషయానికి వస్తే.. హీరో కార్తీ తాజాగా కోటి రూపాయల భారీ విరాళం ప్రకటించారు. ఈ కోటి రూపాయల్ని పలు సేవా కార్యక్రమాల కోసం వినియోగించనున్నారు. ఆయన నటించిన తాజా చిత్ర ‘జపాన్‌’ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కార్తీ 25వ సినిమా. అందుకే ఆయన కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. ఈ కోటి రూపాయల్లో.. సామాజిక కార్యక్రమాల కోసం 25 లక్షలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, నిరుపేదల ఆకలి తీర్చటం వంటి వాటికి తలా 25 లక్షల చొప్పున కేటాయించనున్నారు.

కాగా, శనివారం జపాన్‌ ఆడియో లాంఛ్‌ కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సూర్య, లోకేష్‌ కనగరాజ్‌, విశాల్‌, జయం రవి, ఆర్య, తమన్నా హాజరయ్యారు. ఈ సినిమాకు రాజు మురుగున్‌ దర్శకత్వం వహించారు. జపాన్‌లో కార్తీకి జంటగా అను ఇమ్మాన్యుయేల్‌ నటించారు. సునీల్‌, కేఎస్‌ రవికుమార్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి, ఈ సేవా కార్యక్రమాల కోసం కార్తీ కోటి రూపాయలు దానం చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి