iDreamPost

ఇండియా-పాక్ మ్యాచ్ కి భారీ భద్రత! రంగంలోకి స్పెషల్ ఫోర్స్!

ఇండియా-పాక్ మ్యాచ్ కి భారీ భద్రత! రంగంలోకి స్పెషల్ ఫోర్స్!

వన్డే వరల్డ్ కప్ 2023 లో హై ఓల్టేజ్ మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది. ప్రపంచ కప్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ తలపడబోతున్నాయి. అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో దాయాదులతో పోరుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అసలే పాకిస్తాన్ తో మ్యాచ్.. టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న పాక్ నుంచి ఎప్పుడు ఏ ముప్పు వాటిల్లుతుందో చెప్పలేని పరిస్థితులు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే అహ్మదాబాద్ నగరం పోలీసుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది.

భారత్ -పాక్ మధ్య మ్యాచ్ అంటే ఎంత ఉత్కంఠత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నువ్వా నేనా అన్నట్లుగా సాగే ఆ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిస్తుంది. కాగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగబోయే భారత్ పాక్ మ్యాచ్ కు లక్షకుపైగా అభిమానులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే భద్రతాపరమైన చర్యల్లో మునిగిపోయింది గుజరాత్ ప్రభుత్వం. ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పకడ్భందీగా ఏర్పాట్లు చేస్తోంది. పోలీస్ బలగాలు అణువణువునా జల్లెడ పడుతున్నాయి. 11 వేల మందికి పైగా భద్రతా బలగాలు ఈ భద్రతా చర్యల్లో పాల్గొననున్నాయి.

కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ దాడులను కూడా అడ్డుకునేలా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని అహ్మదాబాద్ సిటీ కమిషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు. స్టేడియం చుట్టూ 2 వేల సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇదేగాక బాడీ కెమెరాలతో వెయ్యి మంది పోలీసులు, స్నైపర్ టీమ్స్ కూడా ఉండనున్నాయి. స్టేడియంలో మినీ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నట్లు పోలీసులు ఉన్నతాధికారులు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి