iDreamPost

తెలంగాణ వాసుల్లారా… బీ అలెర్ట్…ఆసని వచ్చేస్తోంది…

తెలంగాణ వాసుల్లారా… బీ అలెర్ట్…ఆసని వచ్చేస్తోంది…

ఆసని వచ్చేస్తుంది…బీ అలెర్ట్ ఏంటి అనుకుంటున్నారా ? మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సముద్రాల్లో ఏర్పడే తుఫాన్లకు పేర్లు పెడతారు అనే సంగతి తెలిసిందే. తాజాగా పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో సోమవారం తీవ్ర తుఫాన్ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనికి అసని అని పేరు పెట్టారు.

ఇది పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి మంగళవారం ఉదయం కాకినాడకు ఆగ్నేయ దిశలో సుమారు 269 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈ తుఫాను వాయువ్య దిశగా ప్రయాణించి మంగళవారం రాత్రికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకొనే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులు పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బుధవారం రోజున నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గంటకు 30 కి. మీ నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి