iDreamPost

Tirumala: తిరుమలను కమ్మేసిన పొగమంచు.. ఆ మార్గాలు మూసివేత!

ఏపీలో మరోసారి వాతావరణంలో భారీ మార్పులు సంభవించాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి అవర్తన ప్రభావం వల్ల ఏపీలో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఏపీలో మరోసారి వాతావరణంలో భారీ మార్పులు సంభవించాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి అవర్తన ప్రభావం వల్ల ఏపీలో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Tirumala: తిరుమలను కమ్మేసిన పొగమంచు.. ఆ మార్గాలు మూసివేత!

గత కొన్నిరోజులుగా ఏపీలో వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. ఇటీవల మిచౌంగ్ తుఫాన్ కారణంగా పలు జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి.. ఆ ఎఫెక్ట్ నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి పడిపోతున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల సముద్రం నుంచి తమిళనాడు తో పాటు పరిసర ప్రాంతాలపైకి భారీగా తూర్పు గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గత రెండుమూడు రోజుల నుంచి ఏపీలో చలి తీవ్రగా బాగా పెరిగిపోయింది. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం అయిన తిరుమలలో పొగమంచు కమ్మేసింది.

తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్ర క్రమంగా పెరిగిపోతుంది. ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాలో మధ్యాహ్నం వరకు పొగమంచు కమ్ముసింది. రేణిగుంట ఎయిర్ పోర్ట్ లోని విమానాలకు, రోడ్డుపై నడిచే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. పట్టపగలు లైట్లు వేసుకొని మరీ ప్రయాణించే పరిస్థితి నెలకొంది. ఇక తిరుమలలో భారీ స్థాయిలో పొగ మంచు ఏర్పడింది. ఓ వైపు పొగమంచు, వర్షంతో తిరుమలలో అహ్లాదకర వాతావరణం నెలకొంది. ప్రకృతి రమణీయంగా మారిన తిరుమలను చూసి భక్తులు పరవశించిపోతున్నారు. అయితే.. సొంత వాహనాల్లో ఘాట్ రోడ్లలో ప్రయాణించే వాహనదారులకు అలిపిరి వద్ద టీటీడీ సిబ్బంది అప్రమత్తం చేసింది. విపరీతమైన పొగమంచు కారణంగా పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను తాత్కాలికంగా టీటీవీ మూసివేసింది. ఘాట్ రోడ్లలో అక్కడక్కడ మరమ్మతు కారణంగా పనులు జరుగుతున్నాయని.. వాహనదారులు జాగ్రత్తగా ఉండాల్సిందిగా టీటీడీ అధికారులు అంటున్నారు.

ఇక బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వచ్చిన మార్పుల కారణంగా దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. మరో 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి , కడప జిల్లాలో తెలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక పాడేరు, చింతపల్లి, అరకు లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో చలి పంజా విసురుతుంది. రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయని దీంతో రాత్రి నుంచి పొగమంచు మంచు కురుస్తుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి