iDreamPost

ఫోన్లను కొట్టేసిన దొంగలు.. ఆ ఒక్క ట్రిక్‌తో కనిపెట్టి పట్టేసాడు.. ఎలా అంటే?

స్మార్ట్ ఫోన్ ఒక వేళ పోగొట్టుకుంటే లేదా దొంగలు ఎత్తుకెళ్లితే దాని మీద ఆశలు వదిలేసుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం దొంగలు కొట్టేసిన రెండు స్మార్ట్ ఫోన్లను సింపుల్ ట్రిక్ తో కనిపెట్టి పట్టేసాడు. ఎలా అంటే?

స్మార్ట్ ఫోన్ ఒక వేళ పోగొట్టుకుంటే లేదా దొంగలు ఎత్తుకెళ్లితే దాని మీద ఆశలు వదిలేసుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం దొంగలు కొట్టేసిన రెండు స్మార్ట్ ఫోన్లను సింపుల్ ట్రిక్ తో కనిపెట్టి పట్టేసాడు. ఎలా అంటే?

ఫోన్లను కొట్టేసిన దొంగలు.. ఆ ఒక్క ట్రిక్‌తో కనిపెట్టి పట్టేసాడు.. ఎలా అంటే?

స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక హ్యూమన్ లైఫ్ స్టైల్ మారిపోయింది. స్మార్ట్ ఫోన్ ప్రతిఒక్కరి జీవితంలో కీలకంగా మారింది. చేతిలో ఫోన్ లేనిదే ఏ పని జరగని పరిస్థితి నెలకొన్నది. సమాచారం పొందాలన్నా.. ఇవ్వాలన్నా స్మార్ట్ ఫోన్ ముఖ్యపాత్ర పోషిస్తోంది. మరి ఇంత ఇంపార్టెంట్ గా మారిన స్మార్ట్ ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకుంటే లేదా ఎవరైనా దొంగిలిస్తే ఆ బాధను వర్ణించలేము. ఖరీదైన ఫోన్ అయితే మరింత బాధకు గురికావాల్సి వస్తది. అదీకాక ఫోన్ లో ఉన్న నెంబర్స్, డాక్యూమెంట్స్, ఫోటోలు తిరిగి పొందడం కష్టం. అయితే ఓ యువకుడు మాత్రం తన ఫోన్లు దొంగలు కొట్టేస్తే చాకచక్యంగా వ్యవహరించాడు. దొంగలు దొంగిలించిన స్మార్ట్ ఫోన్లను సింపుల్ ట్రిక్ ఉపయోగించి కనిపెట్టి పట్టేసాడు. ఇంతకీ ఆ యువకుడు ఉపయోగించిన ట్రిక్ ఏంటంటే?

సాధారణంగా ప్రయాణాలు చేసేటపుడు లేదా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఫోన్లు పోగొట్టుకోవడం లేదా దొంగలు కొట్టేయడం జరుగుతూ ఉంటుంది. ఫోన్ పోయిన వెంటనే కొందరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి మళ్లీ తిరిగి పొందిన సంఘటనలున్నాయి. కానీ దీనికి కొంత టైమ్ పడుతుంది. అసలు ఏ కంప్లైంట్ ఇవ్వకుండా.. అప్పటికప్పుడే దొంగలు దొంగిలించిన 2 ఫోన్లను ఆ ఒక్క ట్రిక్ తో కనిపెట్టి పట్టుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. షారుఖ్ అనే వ్యక్తి గతేడాది భార్యతో కలిసి రంజాన్ ఇఫ్తార్ కోసం ఢిల్లీలోని జామా మసీదుకు వెళ్లాడు. ఆ సమయంలో తన వెంట మూడు స్మార్ట్ ఫోన్లను బ్యాగులో తీసుకెళ్లాడు. అందులో ఒకటి ఆపిల్ ఐఫోన్ 13, షావోమీ సివి 2, రెడ్‌మి కే50 అల్ట్రా ఫోన్ ఉన్నాయి.

కాగా ఇఫ్తార్ విందు కోసం వచ్చిన వారితో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఇదే సమయంలో దొంగలు చేతివాటం చూపారు. షారుఖ్ తీసుకెళ్లిన మూడు ఫోన్లలో రెండు ఫోన్ల (ఐఫోన్ 13, షావోమీ సివి2)ను దొంగలు కొట్టేశారు. తన ఫోన్లు చోరీకి గురైన విషయం తెలుసుకుని షారుఖ్ షాక్ కు గురయ్యాడు. వెంటనే తన వద్ద ఉన్న మూడో ఫోన్ తో ఆపిల్ ఫోన్ కు కాల్ చేశాడు. కానీ ఆ ఫోన్ ను అప్పటికే స్విఛ్చాఫ్ చేశారు దొంగలు. ఆ తర్వాత షావోమీ సివి 2కు కాల్ చేశాడు అదృష్టావశాత్తు ఆ ఫోన్ ఆన్ లోనే ఉంది. షావోమీ సివి 2 ఫోన్ ను దొంగలు స్విఛ్చాఫ్ చేయలేకపోయారు. ఎందుకంటే.. ఆ షావోమీ ఫోన్‌లో ‘షట్‌డౌన్ కన్ఫర్మేషన్’ ఫీచర్ ఉంది. అందుకే ఫోన్ పవర్ ఇంకా ఆన్‌లోనే ఉంది. ఆ ఫోన్ షట్‌డౌన్ చేయాలంటే పాస్‌వర్డ్ అవసరం. ఈ ఒక్క ఫీచర్ షారుఖ్ పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి పట్టుకునేలా చేసింది. షారుఖ్ వెంటనే షావోమీ వెబ్‌సైట్‌లోని ఫైండ్ మై డివైస్ ఫంక్షన్‌ను ఉపయోగించి.. షారుక్ పొగొట్టుకున్న ఫోన్‌ లొకేషన్ గుర్తించాడు.

ఆపై (షావోమీ సివి2) ఫోన్ సౌండ్ ఆప్షన్ ట్యాప్ చేయగానే గట్టిగా అలారం మోగడం స్టార్ట్ అయ్యింది. ఆ అలారాన్ని ఆపడం దొంగల వల్ల కాలేదు. వెంటనే షారుఖ్ తన ఫోన్ నుంచి షావోమీ సివి2 కు ఫోన్ చేశాడు. ఇక చేసేదేం లేక దొంగిలించిన వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి మసీదు గేట్ నంబర్ 2 దగ్గర తనకు ఫోన్ దొరికిందని చెప్పి వెంటనే తీసుకెళ్లమని షారుక్‌కి చెప్పాడు. షారుక్ అతడి వద్దకు వెళ్లి తన రెండు ఫోన్లను తీసుకున్నాడు. ఫోన్లు దొరకడంతో ఆ దొంగను ఏమనకుండా థ్యాంక్స్ చెప్పానని షారుఖ్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని నెటిజన్స్ తో పంచుకున్నాడు. షారుఖ్ చూపిన సమయస్ఫూర్తికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి