iDreamPost

బాసు మీరు గ్రేట్.. ఉద్యోగులకు బహుమతులుగా కార్లు

ఓ కంపెనీ యజమాని గొప్ప మనసు చాటుకున్నారు. ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు బహుమతులుగా ఏకంగా కార్లను అందించాడు. ఉద్యోగులతో పాటు ఆఫీస్ బాయ్ కి కూడా కార్లు ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.

ఓ కంపెనీ యజమాని గొప్ప మనసు చాటుకున్నారు. ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు బహుమతులుగా ఏకంగా కార్లను అందించాడు. ఉద్యోగులతో పాటు ఆఫీస్ బాయ్ కి కూడా కార్లు ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.

బాసు మీరు గ్రేట్.. ఉద్యోగులకు బహుమతులుగా కార్లు

గొడ్డు చాకిరి చేయించుకుని నెలాఖరులో జీతం ఇచ్చేందుకు ఆలోచించే రోజులివి. చేసిన పనికి తగిన వేతనం చెల్లించ కుండా ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసే సంఘటనలు మనం చాలానే చూశాం. పని చేయించుకుని నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా ఉన్న కంపెనీలు కూడా ఉన్నాయి. కంపెనీ వృద్ధిలో కీలక భాగమైన ఉద్యోగులకు కనీస గుర్తింపు కూడా ఇవ్వని సందర్భాలు కూడా ఉన్నాయి ఇలాంటి తరుణంలో ఓ కంపెనీ యజమాని గొప్ప మనసు చాటుకున్నారు. ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు బహుమతులుగా ఏకంగా కార్లను అందించాడు. ఉద్యోగులతో పాటు ఆఫీస్ బాయ్ కి కూడా కార్లు ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ఈ విషయం నెట్టింటా వైరల్ గా మారింది.

కాగా అన్ని కంపెనీల యాజమాన్యాలు ఒకే తీరుగా ఉండవు. కొన్ని కంపెనీలు ఉద్యోగుల కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తుంటాయి. కంపెనీ ఎదుగుదలకు కారణమైన ఉద్యోగులను తమ కుటుంబ సభ్యుల మాదిరిగా భావిస్తుంటాయి. ఇదే క్రమంలో హర్యానాలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని తమ ఉద్యోగులకు కారు బహుమతులను అందించాలని నిర్ణయించుకున్నాడు. కంపెనీ అభివృద్ధికి పాటుపడిన ఉద్యోగుల్ని గుర్తించి వారిని సర్‌ప్రైజ్ చేసేలా ఏకంగా కార్లనే గిఫ్టుగా ఇచ్చారు. దీపావళి వస్తుందంటే చాలు ఉద్యోగులు జీతంతో పాటు బోనస్ కోసం ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో ఆ ఉద్యోగులు కార్లు గిఫ్టులుగా అందుకోవడంతో ఆనందం రెట్టింపయ్యింది.

పంచకులలోని ఫార్మాస్యూటికల్ కంపెనీ మిట్స్ హెల్త్ కేర్ యజమాని ఎంకే భాటియా తన ఉద్యోగులను సెలబ్రిటీలుగా పేర్కొంటూ 12 మంది స్టార్ పెర్ఫార్మర్స్‌కి కార్లను బహూకరించాడు. భవిష్యత్తులో మరో 38 మంది ఉద్యోగులకు కార్లను అందించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్లు కేవలం దీపావళి బహుమతులే కాదని, కంపెనీ విజయానికి ఉద్యోగులు చేసిన శ్రమ, అంకితభావం, విధేయతకు దక్కిన రివార్డులని యజమాని తెలిపారు. కంపెనీ నుంచి ఊహించని గిఫ్టులు అందడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తూ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి