iDreamPost

బాబు నోట ఆ మాట చెప్పించగలవా? పవన్ కి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ!

Chegondi Harirama Jogaiah: పొత్తుల లెక్కలు, సీట్ల సర్దుబాటు గురించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య ఆదివారం రెండు దఫాలుగా చర్చలు జరిగాయి. అనంతరం ఈ భేటీపై అనేక వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కాపు ఉద్యమ నాయకుడు హరిరామ జోగయ్య ఓ బహిరంగ లేఖ రాశారు.

Chegondi Harirama Jogaiah: పొత్తుల లెక్కలు, సీట్ల సర్దుబాటు గురించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య ఆదివారం రెండు దఫాలుగా చర్చలు జరిగాయి. అనంతరం ఈ భేటీపై అనేక వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కాపు ఉద్యమ నాయకుడు హరిరామ జోగయ్య ఓ బహిరంగ లేఖ రాశారు.

బాబు నోట ఆ మాట చెప్పించగలవా? పవన్ కి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ!

ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్నీ ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన వ్యూహంతో ఎన్నికల రంగంలోకి దిగారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, దాని మిత్రపక్షం జనసేన సీట్ల పంపకాలపై స్పష్టత ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఆదివారం రెండు దఫాలు ఈ ఇద్దరి నేతల మధ్య  చర్చలు జరిగాయి. ఈ సమావేశాల్లోనే ఎవరికి ఎన్నిసీట్లు అనే విషయంలో క్లారిటీ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కాపు ఉద్యమనేత మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య.. పవన్ బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికే పలు అంశాలపై అనేకసార్లు పవన్ కు హరిరామ జోగయ్య లేఖలు రాశారు. ఈసారి రాసిన లేఖ మాత్రం కాస్త ఘాటుగానే ఉంది. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆదివారం టీడీపీ,  జనసేన అధ్యక్షుల మధ్య రెండు దఫాలు సమావేశం జరిగింది. ఈ భేటీపై సాయంత్రం ఎల్లో మీడియాలు ఓ రేంజ్ లో కథనాలు రాసింది. అలానే సోషల్ మీడియాలో వీరి సీట్ల పంపకాలపై అనేక వార్తలు వైరల్ అయ్యాయి. జనసేనకు 30 సీట్లు, 35 సీట్లు అంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే కాపు ఉద్యమ నాయకుడు హరిరామ జోగయ్య..పవన్ కల్యాణ్ కి బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం కాపులు పవన్ వెంట నడవడం లేదని, దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారని ప్రశ్నించారు. రెండున్నారేళ్లు  పవన్ సీఎంగా ఉంటారనే మాట చంద్రబాబుతో చెప్పించి తీరాలని లేఖలో హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు.

ఇక హరిరామ జోగయ్య బహిరంగ లేఖ ద్వారా పవన్ కల్యాణ్ కి పలు ప్రశ్నలను సూటిగా సంధించారు. రాజ్యాధికారం ధ్యేయంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని గద్దెదింపాలంటే టీడీపీ, జనసేన కలవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉందని తెలిపారు. కానీ కాపులకు రాజ్యాధికారం దక్కాలంటే కేవలం వైసీపీని  ఓడిచి, టీడీపీని అధికారంలోకి తేవటం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాధికారం సాధించడం అంటే వైసీపీని గద్దెదించి, చంద్రబాబును అధికారంలోకి తీసుకు రావటమా అంటూ ప్రశ్నించారు. ఇక ఆయన మరికొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. టీడీపీ..జనసేనకు సీట్లు ఇవ్వడం కాదని, జనసేనానే టీడీపీకి సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండాలన్నారు. చంద్రబాబును అధికారంలోకి తేవడం కోసం కాపులంతా పవన్ కళ్యాణ్ వెంట నడవడం లేదన్నారు. జనాభా దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు జరగకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారని జోగయ్య ప్రశ్నించారు.

Hari ram jogayya about CBN and pawan

2024 ఎన్నికల్లో జనసేన 40 నుంచి 60 సీట్లలో జనసేన పోటీ చేయాలని ఆయన సూచించారు. అదేవిధంగా ఈ కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్‌కు రెండున్నరేళ్లు సీఎం పదవి ఇచ్చేలా బాబు ఎన్నికల ముందే ప్రకటన చేస్తారా? అని ప్రశ్నించాడు. జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరగకపోతే.. ఆ తర్వాత జరిగే నష్టానికి చంద్రబాబు, పవన్ బాధ్యత వహించాల్సి వస్తుందని రామజోగయ్య తెలిపారు. జనసేన సపోర్టు లేకుండా టీడీపీ అధికారంలోకి రావడం కష్టమని… అందుకు 2019 ఫలితాలే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. మరి.. హరిరామ జోగయ్య  లేఖపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి