iDreamPost

IPL 2022 : ఈ సారి కప్పు వాళ్లే గెలుస్తారు.. భజ్జీ జోస్యం..

IPL 2022 : ఈ సారి కప్పు వాళ్లే గెలుస్తారు.. భజ్జీ జోస్యం..

IPL 2022 సీజన్‌ చివరి దశకి చేరుకుంది. మే 27న రాజస్తాన్‌ రాయల్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య క్వాలిఫైయర్‌-2 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మే 29న గుజరాత్‌ టైటాన్స్‌తో జరుగనున్న టైటిల్‌ పోరుకు వెళ్తుంది. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు RCB జట్టు పైనే ఉన్నాయి. అనూహ్యంగా ప్లేఆఫ్స్ కి అర్హత సాధించింది RCB. ఎలిమినేటర్ మ్యాచ్ లో టీం సమిష్టి కృషితో గెలిచి మరింత ముందుకొచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా కప్పు సాధిస్తుంది అనే ఆశతో బెంగుళూరు ఫ్యాన్స్ ఉన్నారు. ప్రతి సారి ఏదో ఒక చోట వెనుదిరుగుతుంది ఈ జట్టు. అయితే ఈ సారి టీం అంతా అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉండటంతో బెంగుళూరు అభిమానులు ఈ సారి కప్పు మాదే అంటున్నారు.

తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ మాట్లాడుతూ కప్పు ఎవరు గెలుస్తారో జోస్యం చెప్పాడు. భజ్జీ మీడియాతో మాట్లాడుతూ.. బెంగళూరు జట్టులో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగం పటిష్టంగా ఉంది. జట్టుకు ట్రోఫీ అందించగల గల ప్లేయర్లు ఉన్నారు. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో అయితే RCB కచ్చితంగా గెలుస్తుందని అనుకుంటున్నాను. ఈ మ్యాచ్ గెలిస్తే ఇంక డౌట్ అవసర్లేదు, ఫైనల్ లో కచ్చితంగా RCB గెలిచి ఈ సారి కప్పు కొడుతుంది అని అన్నారు.

దీంతో భజ్జీ చేసిన ఈ వ్యాఖ్యలు RCB అభిమానుల్లో మరిన్ని ఆశలు నింపాయి. వాళ్ళు ఈ సారి కప్పు బెంగుళూరుదే అని అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఇంకో రెండు మ్యాచ్ ల వరకు ఆగాల్సిందే.