iDreamPost

Hamza Saleem Dar: క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని విధ్వంసం.. ఒక్క మ్యాచ్ లో ఇన్ని రికార్డులా?

  • Author Soma Sekhar Published - 03:11 PM, Thu - 7 December 23

వరల్డ్ క్రికెట్ లో ఇప్పటి వరకు ఎవ్వరూ ఊహించని విధ్వంసం సృష్టించాడు ఓ ఆటగాడు. కేవలం 43 బంతుల్లోనే 193 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

వరల్డ్ క్రికెట్ లో ఇప్పటి వరకు ఎవ్వరూ ఊహించని విధ్వంసం సృష్టించాడు ఓ ఆటగాడు. కేవలం 43 బంతుల్లోనే 193 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

  • Author Soma Sekhar Published - 03:11 PM, Thu - 7 December 23
Hamza Saleem Dar: క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని విధ్వంసం.. ఒక్క మ్యాచ్ లో ఇన్ని రికార్డులా?

వరల్డ్ క్రికెట్ లోకి పొట్టి ఫార్మాట్ ఎప్పుడైతే ప్రవేశించిందో.. అప్పటి నుంచి క్రికెట్ రూపురేఖలే మారిపోయాయి. దీంతో ప్రపంచంలో ఏదో ఒకమూలన రోజుకో రికార్డు బద్దలవుతూనే ఉన్నాయి. తాజాగా ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధ్వంసం చోటుచేసుకుంది. ఈ విధ్వంసాన్ని సృష్టించింది హమ్జా సలీమ్ దార్ అనే ఆటగాడు. స్పెయిన్ వేదికగా జరుగుతున్న యూరోపియన్ క్రికెట్ సిరీస్ టీ10లో అతడు పలు వరల్డ్ రికార్డులు బ్రేక్ చేశాడు. ఈ లీగ్ లో భాగంగా కాటలున్వా జాగ్వార్ వర్సెస్ సోహల్ హాస్పిటల్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో కేవలం 43 బంతుల్లోనే 193 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే అనేక రికార్డులు బద్దలు కొట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో సంచలనం సృష్టించాడు ఓ ఆటగాడు. అతడి పేరు హమ్జా సలీమ్ దార్.. ప్రస్తుతం ఈ పేరు వరల్డ్ క్రికెట్ లో మారుమ్రోగిపోతోంది. స్పెయిన్ వేదికగా యూరోపియన్ క్రికెట్ సిరీస్(ECS) జరుగుతోంది. అందులో భాగంగా కాటలున్యా జాగ్వార్-సోహల్ హాస్పటల్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో జాగ్వార్ ప్లేయర్ సునామీ ఇన్నింగ్స్ తో ప్రత్యర్థిని ముంచేశాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడు కేవలం 43 బంతుల్లోనే 14 ఫోర్లు ఏకంగా 22 సిక్సులు బాది 193 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడికి తోడు మరో ఓపెనర్ 58 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడంతో.. జట్టు నిర్ణీత 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 257 పరుగులు చేసింది.

అదీకాక ఈ మ్యాచ్ లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో పాటుగా ఓ ఫోరు బాది మెుత్తం 43 పరుగుల రాబట్టి రికార్డు నెలకొల్పాడు హమ్జా సలీమ్ దార్. ఈ ఓవర్ లో రెండు వైడ్స్ తో పాటుగా ఓ నోబాల్ తో కలిపి మెుత్తం 9 బంతులు వేశాడు బౌలర్. ఇక టీ10 ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు సలీమ్ దార్. ఈ మ్యాచ్ లో అతడు బ్యాటింగ్ చేసిన తీరు చూస్తే.. ఆశ్చర్యపోక తప్పదు. కొడితే సిక్స్, లేదంటే ఫోర్ అన్నట్లుగా బంతిని బాదాడు సలీమ్ దార్. దీంతో కేవలం 24 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకుని మరో ఘనత సాధించాడు. ఇలా ఒకే మ్యాచ్ లో థండర్ ఇన్నింగ్స్ ఆడి.. సంచలనం సృష్టించాడు. అనంతరం 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సోహల్ హాస్పిటల్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 104 రన్స్ మాత్రమే చేసింది. దీంతో 153 పరుగుల భారీ తేడాతో జాగ్వార్ టీమ్ ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ లోనే కాకుండా బౌలింగ్ లో కూడా మెరిసిన సలీమ్ దార్ మూడు వికెట్లు కూల్చాడు. ఊహించని రీతిలో ప్రపంచ రికార్డులు నెలకొల్పిన ఈ చిచ్చరపిడుగుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి