iDreamPost

Half Day Schools: ఒంటిపూట బడులు.. విద్యార్థులు ఇవి తప్పక తెలుసుకోవాలి

  • Published Mar 05, 2024 | 11:38 AMUpdated Mar 05, 2024 | 11:38 AM

తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు మొదలు కానున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాల గురించి తప్పక తెలుసుకోవాలి. అవి ఏంటంటే..

తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు మొదలు కానున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాల గురించి తప్పక తెలుసుకోవాలి. అవి ఏంటంటే..

  • Published Mar 05, 2024 | 11:38 AMUpdated Mar 05, 2024 | 11:38 AM
Half Day Schools: ఒంటిపూట బడులు.. విద్యార్థులు ఇవి తప్పక తెలుసుకోవాలి

ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు అడుగుపెట్టే పరిస్థితే లేదు. మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని.. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఒంటిపూట బడులపై నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు మొదలు కానున్నట్లు ప్రకటించింది. అయితే ప్రతి ఏటా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు ఒకేసారి ప్రారంభం అవుతాయి. తెలంగాణలో ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ కాగా.. ఏపీకి సంబంధించి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఏపీలో ఒంటిపూట బడులు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ఏపీలో పాఠశాలలు ఆలస్యంగా తెరుచుకోవడంతో.. ఒంటి పూట బడుల నిర్వహణ కూడా ఆలస్యం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి ఏపీలో ఒంటిపూట బడులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒంటిపూట బడుల్లో భాగంగా ఉదయం ఉదయం 8-12 గంటల వరకు ఒక్క పూట మాత్రమే బడులు కొనసాగుతాయి. అయితే 10 తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం నుంచి తరగతులు ప్రాంరభం అవుతాయి. వీరికి తొలుత మధ్యాహ్న భోజనం పెట్టి.. ఆ తర్వాత క్లాసులు కొనసాగిస్తారు. పదో తరగతి పరీక్షలు ముగిశాక.. ఆయా స్కూళ్లలో ఉదయం పూటే ఒంటిపూట బడులు నిర్వహిస్తారు.ఇక ఒంటిపూట బడుల నేపథ్యంలో వైద్యులు విద్యార్థులకు సంబంధించి కీలక సూచనలు చేశారు.

కనుక ఉదయం పూట బడికి వెళ్లే విద్యార్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు వైద్యులు. కచ్చితంగా ఉదయం పూట అల్పాహారం తీసుకోవాలని లేదంటే కళ్లు తిరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. అలానే తగినన్ని నీళ్లు తాగాలి.. కనుక విద్యార్థులు కచ్చితంగా వాటర్‌ బాటిల్‌ తీసుకుని వెళ్లాలి. పాఠశాలకు ఇంటికి దూరం ఎక్కువగా ఉంటే గొడుగు కచ్చితంగా తీసుకెళ్లాలి. అలానే స్కూల్‌ అయిపోయాక మధ్యాహ్నం భోజనం చేశాకే ఇంటి రావాలి. లేదంటే ఎండలో కళ్లు తిరిగే ప్రమాదం ఉంది అంటున్నారు వైద్యులు. స్కూల్‌ నుంచి వచ్చేటప్పుడు కూడా బాటిళ్లలో వాటర్‌ తెచ్చుకోవాలని సూచిస్తున్నారు.

ఇంటికి వెళ్లగానే ఎండలో ఆడకుండా.. కాసేపు విశ్రాంతి తీసుకోవాలని.. సాయంత్రం సమయాల్లో ఆడుకోవాలని సూచిస్తున్నారు. ఐదు గంటల తర్వాతనే విద్యార్థులు బయటకు వెళ్లడం మంచిదని.. అప్పుడే ఎండ తీవ్రత కాస్త తక్కువగా ఉంటుంది అంటున్నారు. స్కూల్‌కి వెళ్లి వచ్చే దారుల్లో బయట ఆహారం తీసుకోవద్దని సూచిస్తున్నారు. విద్యార్థులు తమ ఆహారంలో మజ్జిగ, పళ్ల రసాలు, పళ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి అని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలని.. సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి